Missing Hyderabad School Girl Traced in Mumbai

At last poornima sai found

Poornima Sai, Poornima Sai Missing, Poornima Sai Mumbai, Nizampet Girl Missing, Nizampet Poornima Sai, Poornima Sai case, Poornima Sai Interview, Poornima Sai Parents, Poornima Sai Re Birth, Poornima Sai Kidd napped, Hyderabad School Girl Miss, Hyderabad School Girl Kidnap

Hyderabad Missing girl Poornima Sai found after 40-day search in Mumbai. Poornima Sai disappear on June 7th while going to school in Nizampet. More than a month after she went missing, found in a child care home in Mumbai, putting an end to Missing Mystery.

హమ్మయ్యా! మిస్సింగ్ మిస్టరీ వీడిందిగా...

Posted: 07/17/2017 08:42 AM IST
At last poornima sai found

ఏమైపోయిందోనంటూ 40 రోజుల పాటు కొనసాగిన సస్పెన్స్‌కు తెర పడింది. సంచలనం రేపిన పూర్ణిమ సాయి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. ముంబైలోని దాదర్ లో పూర్ణిమ సాయి ఉండటాన్ని అక్కడి ఓ స్వచ్ఛంద సంస్థ గుర్తించింది. ఈ విషయాన్ని సైబరాబాద్ పోలీసులకు తెలియజేయడంతో అక్కడికి వెళ్లారు. ఆ బాలిక పూర్ణిమే అని ధృవీకరణ కావటంతో ముంబై నుంచి హైదరాబాద్ కు తీసుకురానున్నారు.

కాగా, నిజాంపేటకు చెందిన పదమూడేళ్ల పూర్ణిమ సాయి గత నెల 7న స్కూల్‌కని వెళ్లి.. అదృశ్యమైంది. దీంతో, ఆ బాలిక తల్లిదండ్రులు తమ బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికారు. బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో, బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తొలుత, మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసిన పోలీసులు,ఆ తర్వాత దీనిని కిడ్నాప్‌ కేసుగా మార్చారు. ఎలా చేరిందో తెలీదుగానీ బాలిక ముంబయిలోని బోయివాడ ఆశ్రమానికి చేరుకుంది.

అక్కడి పోలీసులకు, ఆశ్రమ నిర్వాహకులకు బాలిక తెలిపిన వివరాల ఆధారంగా.. అక్కడి ఎస్సై మహాజన్ ఆదివారం సాయం త్రం తుకారాంగేట్ సీఐ రమేష్‌కు ఫోన్‌చేసి వాట్సాఫ్‌లో బాలిక ఫొటో పంపించారు. అయి తే ఇప్పటికే ఈ విషయంలో పెద్ద ఎత్తున ఫ్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం జరగడంతో తుకారాంగేట్ సీఐ రమేష్ బాచుపల్లి సీఐ బాలకృష్ణారెడ్డికి సమాచారం అందించారు. ముంబయి నుంచి పంపిన ఫొటో , పూర్ణిమాసాయి ఫొటోతో సరిపోలడంతో అటు పోలీసులు, ఇటు పూర్ణిమాసాయి కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం పూర్ణిమా పుట్టినరోజు కావడంతో ఆమె తమకు మళ్లీ జన్మించినట్లుగా తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నా రు. 

యాక్టింగ్ పిచ్చితో...

ఎలాగైనా నటించాలన్న ఉద్దేశంతోనే ఇంటి నుంచి పారిపోయినట్లు విస్తూ పోయే విషయాలు వెల్లడించింది బాలిక పూర్ణిమా సాయి. 40 రోజుల క్రితం ఇంట్లోంచి పారిపోయి 15 రోజులు ప్రయాణం చేసి ఆపై ముంబై చేరుకున్న పూర్ణిమ గుళ్లో ప్రసాదం తింటూ కాలం వెల్లదీసింది. ఆపై సినిమా, సీరియళ్ల అవకాశాల కోసం ముంబైలోని ఫిల్మ్ స్టూడియోల చుట్టూ కాళ్లరిగేలా తిరిగింది. తాను ఊహించిన దాని కన్నా భిన్నంగా పరిస్థితులు ఉన్నాయని తెలుసుకున్న తరువాతనే పోలీసులను ఆశ్రయించానని, అయితే, ఎలాగైనా సినిమాల్లో నటించాలన్న బలమైన కోరికతోనే పోలీసులకు అబద్ధాలు చెప్పానని వెల్లడించింది.

తన తల్లిదండ్రులు కొద్ది రోజుల క్రితమే చనిపోయారని, తన పేరును ఓ సీరియళ్ లోని నటి పేరుతో మార్చుకుని పోలీసులను బురిడీ కొట్టించే యత్నం చేసింది. సినిమా స్టూడియోల ముందు తనను ఎవరూ పట్టించుకోలేదని పోలీసులకు తెలిపింది. తనకు ఎక్కడికీ వెళ్లాలని లేదని, ముంబైలోనే ఛాన్సుల కోసం ట్రై చేస్తానంటూ పోలీసులకు విన్నవించింది. ప్రస్తుతం బాలికకు కౌన్సిలింగ్ ఇప్పించే పనిలో పోలీసులు ఉన్నారు. ఇక మనసులోని కోరికను తీర్చుకునే దిశగా అడుగులు వేసిన పూర్ణిమ రిస్క్ అయినా యత్నించిందని పలువురు అంటున్నారు. అక్రమ రవాణా ముఠాల కళ్లలో బాలిక పడకపోవటం అదృష్టమనే చెప్పుకోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Poornima Sai  Hyderabad  Missing Mystery  

Other Articles

 • Rahul calls it betrayal of anti communal mandate

  దమ్ముంటే జనంలోకి వెళ్ధాం రండీ.. యువనేత సవాల్..!

  Jul 27 | బీహార్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ ప్రజలు మతవాదులకు వ్యతిరేకంగా తీర్పునిచ్చినా.. ఆయన మరోమారు అధికారం కోసం వారి... Read more

 • Nitish kumar to swear in as bihar cm

  సీఎంగా నితీశ్.. డిప్యూటీ సీఎంగా మోదీ ప్రమాణం

  Jul 27 | మహా ఘటబంధన్ తో మైత్రి తెంచుకుని చివరకు మూడేళ్ల తర్వాత పాత దోస్తీ బీజేపీతో కలిసి బీహార్ లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది జనతాదళ్(యు). ఆరోసారి జేడీయూ నేత నితీశ్ కుమార్ కాసేపటి... Read more

 • China back step in doklam issue

  మనల్ని రెచ్చగొట్టేది చైనా కాదంట!

  Jul 27 | భూటాన్, సిక్కిం సరిహద్దుల్లో ఉన్న డోక్లాం చైనా సైన్యం యవ్వారంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. బాల్ భారత్ కోర్టులోనే ఉందంటూ.. చెబుతూనే మరో పక్క పలు విధాలుగా బెదిరించేందుకు చైనా ప్రయత్నించింది.... Read more

 • Gujarat floods kills 17 members of family

  ఒకే ఫ్యామిలీ.. 17 మంది దుర్మరణం

  Jul 27 | ఊహించని పరిణామం ఆ కుటుంబంలో కన్నీటిని మిగిల్చింది. గుజరాత్‌లో భారీ వర్షాలకు అక్కడి పరిస్థితి భీభత్సంగా ఉంది. వరదలు ముంచెత్తటంతో ఒకే కుటుంబానికి 17 మంది చనిపోయారు. చనిపోయిన వారు బనస్కంత జిల్లాకు చెందిందని,... Read more

 • Tspsc urges students not to believe cancellation rumours

  టీఎస్ పీఎస్పీ రద్దు... అంతా రూమర్లేనా?

  Jul 27 | ఇప్పటికే అక్రమ భర్తీలంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాజాగా హైకోర్టు ఆదేశాలానుసారం పరీక్షలను వాయిదా వేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ). అయితే ఏకంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు రద్దయ్యాయంటూ వస్తున్న వదంతులను... Read more

Today on Telugu Wishesh

porno