benz company officials shock police by asking case details of nitish నారాయణ కుమారుడు నితీష్ కేసులో బెంజ్ కంపెనీ ట్విస్టు..

Benz company officials shock police by asking case details of nitish

telangana police shocked by benz officials, benz officials shock telangana police, minister narayana son nitish, nitish and his friend raja ravichandra varma, benz company clarrification, benz car balloons, nitish car accident, jubilee hills, narayana, ap minister, telangana police

Benz company officials ask telangana police the case details of ap minister's son nitish road accident to give clarrification on the air balloons

నారాయణ కుమారుడు నితీష్ కేసులో బెంజ్ కంపెనీ ట్విస్టు..

Posted: 06/27/2017 12:03 PM IST
Benz company officials shock police by asking case details of nitish

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నితీష్ రోడ్డు ప్రమద ఘటనలో బెంజ్ కంపెనీ ప్రతినిధులు.. తెలంగాణ పోలీసులకు అసహనం కలిగించే రితీలో వ్యవహరిస్తున్నారు. ఎయిర్ బ్యాగ్స్ విషయమై కంపెనీ ప్రతినిధుల నుంచి తెలంగాణ పోలీసులు నివేదిక కోరగా..  నివేదిక ఇవ్వడంలో జాప్యం చేసిన బెంజ్ కంపెనీ ప్రతినిధులు పోలీసుల నుంచే మరిన్ని వివరాలను కోరి.. ప్రమాద ఘటపను దర్యాప్తు చేస్తున్న తరహాలో ప్రమాదానికి సంబంధించిన సిసిటీవీ ఫూటేజీలు.. పోస్టుమార్గం నివేదికతో పాటు దర్యాప్తు వివరాలను, ప్రమాదానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్, వీడియోగ్రాఫ్లను కూడా కొరడంతో.. తెలంగాణ పోలీసులు అవ్వాకవుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. మంత్రి నారాయణ కుమారుడు నితీష్ మే నెల 10న అర్థరాత్రి జూబ్లీహిల్స్ లో రోడ్ నెంబర్ 36లో మెట్రో పిల్లర్ ను ఢీకొని దుర్మరణం పాలైన విషయం తెలిసింది. ఈ ప్రమాధంలో నితీష్ తో పాటు అతని స్నేహితుడు రాజా రవిచంద్ర వర్మ కూడా మరణించిన విషయం తెలిసిందే. మంత్రి కుమారుడు అతని స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో.. ఈ ఘటనపై క్షణ్ణంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు అటు బెంజ్ కంపెనీ నుంచి వివేదికను కోరారు. ప్రమాదానికి గల కారణాలు మితిమీరిన వేగమని ఓ వైపు చెబుతున్నా.. అసలు కారు బెలున్లు ఎందుకని ఓపెన్ కాలేదన్న విషయమై దర్యాప్తు జరుపుతున్నారు.

ఈ మేరకు బెంజ్ కంపెనీ ప్రతినిధులకు ఓ లేఖను రాసిన తెలంగాణ పోలీసులు కంపెనీ నుంచి పలు వివరాలను కోరారు. అత్యాధునిక కారులో కారు బెల్టు పెట్టుకుంటేనే తప్ప లేకపోతే బెలూన్లు తెరుచుకోవా..? కారు ఎంత వేగంలో వెళ్లిన తరువాత ప్రమాదానికి గురైంది..? అన్న వివరాలను కోరుతూ లేఖ రాయగా, బెంజ్ కంపెనీ ప్రతినిధులు మాత్రం ఇప్పటివరకు నివేదిక ఇవ్వలేదు. దీంతో మరోమారు లేఖ రాసిన తెలంగాణ పోలీసులకు తమకు అత్యంత గోప్యంగా వుండే పోలీసు దర్యాప్తు వివరాలను అందజేయాలని కంపెనీ ప్రతినిధులు కోరడంతో తెలంగాణ పోలీసులు విస్మయానికి గురయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : benz  car balloons  nitish car accident  jubilee hills  narayana  ap minister  telangana police  

Other Articles