shirisha was murdered alleges her uncle శిరీషది హత్యే.. అనవసర అరోపణలు వద్దంటున్న పోలీసులు

Shirisha was murdered alleges her uncle

Beautician Sirisha Suicide Case, Shirisha murdered alleges relavtives, Kukunoorpally Mystery, Kukunoorpally SI, Kukunoorpally Sirisha, Kukunoorpally PS Sravan Rajeev, Rajeev Sravan Sirisha, Rajeev kill Sirisha, Sirisha Rape and Kill, Beautician Sirisha Case Details, shirisha, beautician, RJ photography, rajeev kumar, sravan, si prabhakar reddy, kukumoorpally, dcp venkateshwar rao

Even after the police says that shirisha has commited suicide, her uncle alleges that she has been murdered and claims proofs.

శిరీషది హత్యే.. అనవసర అరోపణలు వద్దంటున్న పోలీసులు

Posted: 06/27/2017 11:14 AM IST
Shirisha was murdered alleges her uncle

రోజుకో మలుపు తిరుగుతున్న బ్యూటీషియన్ శిరీష కేసులో అసలేం జరిగిందన్న ఉత్కంఠ పెరుగుతుంది. హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ ఆర్జీ స్టూడియోలో శిరీష ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తమ వద్దకు చేరిన నివేదికల అధారంగా చెబుతున్న అమె బంధువులు మాత్రం దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. అమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, అమెను హత్య చేశారని అరోపిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శిస్తున్నారు.

తన మేనకోడలిని హత్య చేసిన వారిని తప్పించడానికి అమెపై తప్పుడు ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోందని ఆమె మేనమామ తీవ్ర ఆరోపణలు చేశారు. తన మేనకోడలిని కారులో తీసుకొచ్చేటప్పుడే హతమార్చారని అనుమానం వ్యక్తం చేశారు. మెడకు వైరు బిగించి ఆమెను హత్య చేశారని అరోపించిన ఆయన అందుకు సంబంధించి అధారాలు వున్నాయని కూడా చెప్పారు. శిరీష మెడపై వైరు చారిక ఉందని ఆయన చెప్పారు.

అంతే కాకుండా మీడియా చూపిస్తున్న ఫోటోలలో ఆమె షర్టు గుండీలు కూడా వరుస క్రమంలో కాకుండా అపక్రమంలో పెట్టినట్టున్నాయని అన్నారు. మీడియా చూపించిన ఫోటోలలో ఇది స్పష్టంగా కనిపిస్తుందని.. కావాలంటే పోలీసులు మరోమారు వాటిని చూడాలని ఆయన సూచించారు. కింది బటన్ ను పై బొత్తంలో పెట్టారని ఆయన తెలిపారు. పెనుగులాటలో పైబటన్ తెగిపోయి ఉంటుందని, అందుకే ఆమెది ఆత్మహత్యగా చిత్రీకరించే తొందరలో ఆమె బటన్స్ పెట్టారని.. అయన అరోపించారు.

కాగా శిరీష ఆత్మహత్య కేసులో అనవసర విమర్శలు చేయవద్దని డీసీపీ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. శిరీష బంధువులకు ఏమైనా అనుమానాలు ఉంటే హైదరాబాద్ కు రావాలని, వారి అనుమానాలన్నీ నివృత్తి చేస్తామని తెలిపారు. ఆమె బంధువులు మీడియా ముందు చేస్తున్న విమర్శలపై స్పందించిన ఆయన, తమకు ఎవరినీ కాపాడాలన్న ఉద్దేశం గానీ, అవసరం గానీ తమకు లేదనిఅన్నారు. శిరీష పంపిన వాట్స్ యాప్ లొలేషన్ కుకునూరుపల్లి పీఎస్ క్వార్టర్స్ దేనని మరోసారి స్పష్టం చేసిన ఆయన, ఆమెపై అత్యాచారం జరిగిందా? లేదా? అన్న విషయం ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తరువాతే తెలుస్తుందని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles