SHO seeking sexual favour from accused wife arrested ‘‘రాత్రికి వస్తా’’నన్న ఎస్ఐకి షాక్

Sho seeking sexual favour from accused wife arrested by acb

anti-corruption bureau, kamaldan charan, Rajiv Gandhi Nagar police station, sexual favours, bribe, objectionable act, Rs. 2 lakh bribe, compromise, café compound, Chopasani Housing Board, Jodhpur, rajasthan, crime

A police official was arrested by the Anti-Corruption Bureau (ACB) sleuths for allegedly seeking sexual favours and taking a bribe of Rs. two lakh from the wife a person who is accused in a drug case.

‘‘రాత్రికి వస్తా’’నన్న ఎస్ఐకి షాక్

Posted: 06/15/2017 10:35 AM IST
Sho seeking sexual favour from accused wife arrested by acb

రాజస్థాన్ లోని జోథ్ పూర్ జిల్లాలో రాజీవ్ గాంధీ నగర్ పోలిస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐకి షాక్ తగిలింది. రెండు లక్షల రూపాలయ లంచం అడిగి.. అందులోంచి లక్ష రూపాయలను లంచంగా తీసుకన్న ఎస్ఐ.. మరో లక్ష రూపాయలు ఇస్తేనే నిందితుడ్ని వదిలిపెడతానని తెగేసి చెప్పాడు. లక్ష రూపాయల డబ్బునే ఎంతో కష్టపడి చుట్టు పక్కల వాళ్లను, బంధువులను అడిగి సమకూర్చాను.. ఇక ఇంతకన్నా డబ్బు తీసుకురావడం తన వల్ల కాదని కన్నీళ్ల పర్యంతమై అర్థించన్న నిందితుడి భార్యను ఒరగా చూసిన ఎస్ఐ.. సరేలా ఎడవమాకు అని ఓదార్చాడు.

అంతేకాదు ‘‘ఈ రోజు రాత్రి మీ ఇంటికి వస్తాను.. నీతో సరదాగా కాసేపు మాట్లాడతాను.. మనం కొంత సమయం ఏకాంతంగా గడుపుదాం.. సరేనా.. ఆ తరువాత మీ భర్థను వదిలిపెడతాను’’ అని ఎస్ఐ చెప్పగానే.. చేసేది లేక ఎస్ఐ ప్రతిపాదనకు తలొగ్గినట్లు సంకేతం ఇచ్చినా.. విలపిస్తూ ఇంటికి చేరకుంది. తానేం చెయ్యాలి.. ఎస్ఐ చెర నుంచి తనను తాను ఎలా కాపాడుకోవాలన్న అలోచన చేసింది. ఇంతలో తనకు వచ్చిన ఓ ఐడియాతో అతని ఆటను కట్టించింది. ఏకంగా రంగంలోకి దిగిన ఏసీబి అధికారులు అమె ఇంటికి వచ్చిన ఎస్ఐని రెడ్ హ్యాండెండ్ గా పట్టుకుని అరెస్టు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. రాజీవ్ గాంధీ నగర్ లో ఒక వ్యక్తి కిలో నల్లమందు (ఓపియమ్) కలిగి ఉండడంతో అతనిని అరెస్టు చేశారు. భర్తను విడిపించుకునేందుకు వెళ్లిన అతని భార్యను ఎస్సై కమల్ ధన్ చరణ్ 2 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. లక్ష రూపాయలు ఎలాగోలా సర్దిన ఆమె, మరో లక్షకు చెక్కు రాసి ఇచ్చింది. తన దగ్గర చెక్కులు చెల్లవని, డబ్బే కావాలని కమల్ ధన్ చరణ్ ఆమెకు స్పష్టం చేశాడు. డబ్బు లేదని చెప్పడంతో.. నీతో సరదాగా ఇవాళ రాత్రి గడుపుతాను.. లక్ష రూపాయలు చెల్లిపోతుందని అన్నాడు. అతని ప్రతిపాదనకు సరేనన్న నిందితుడి భార్య.. ఇంటికి చేరకుని అలోచన చేసింది.

నేరుగా ఏసీబి అధికారులను కలిసింది. వారు అమెకు మనోధైర్యాన్ని ఇచ్చారు. ఇక రాత్రి వేళ ఎస్ఐ కలమ్ దన్ చరణ్ తొందరగా డ్యూటీ ముగించుకుని సంబరపడుతూ నిందితుడి ఇంటికి వెళ్లాడు. తలుపు మూసివుండటంతో కాలింగ్ బెల్ నొక్కాడు. తలుపు తెరిచే ఉంది లోనికి రండీ అంటూ సమాధానం రావడంతో సంతోషంగా లోపలికి వచ్చాడు. అక్కడ ఊహించినట్టుగానే అమె చక్కగా ముస్తాబై వుంది. అయితే అమెతో పాటు ఏసీబీ అధికారులు కూడా వుండటంతో కమల్ ధన్ చరన్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. వెంటనే ఏసీబి అధికారులు అతనిని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kamaldan charan  Rajiv Gandhi Nagar police station  drug case  sexual favours  bribe  crime  

Other Articles