Shocking Twist in Kukunoorpally SI Death

Si prabhakar reddy death new twist

Kukunoorpally, SI Prabhakar Reddy, Kukunoorpally Deaths, SI Prabhakar Reddy Deatgh, Sirisha SI Prabhakar Reddy, Prabhakar Reddy Call Data, SI Prabhakar Reddy Call Data, SI Prabhakar Reddy Murder, SI Prabhakar Reddy Twist, Sirisha Prabhakar Reddy Link, SI Prabhakar Reddy Last Words

Murder Allegations in Kukunoorpally SI Prabhakar Reddy's Suicide. Sirisha and Prabhakar Reddy call Data Key Role in Both Cases.

షాకింగ్ ట్విస్ట్: ఎస్సై ప్రభాకర్ రెడ్డి హత్య??

Posted: 06/15/2017 09:54 AM IST
Si prabhakar reddy death new twist

సిద్ధిపేట జిల్లా కుకునూర్ పల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి మరణం ఇంకా మిస్టరీగానే ఉంది. అధికారుల వేధింపుల మూలంగానే సూసైడ్ అని, కాదు హత్య చేశారని ఇలా వాదనలు వినిపిస్తున్న క్రమంలో, హైదరాబాద్ లో చనిపోయిన బ్యూటీషియన్ శిరీష మృతితో లింకు పెట్టేశారు. దీంతో ఈ రెండు కేసుల సంబంధంపై దర్యాప్తు కొనసాగుతోంది. శిరీష్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు, ప్రభాకర్ రెడ్డి, శిరీష మధ్య సంబంధాలు ఉన్నాయని తేలిందని చెబుతున్నారు. ఆదివారం రాత్రి ప్రభాకర్ రెడ్డి హైదరాబాదు వెళ్లాడని, శిరీషపై లైంగిక వేధింపులకు దిగాడని, దీంతో ఆ విషయం బయటకు వస్తే ఉద్యోగం, పరువు పోతుందని భావించి ఆత్మహత్యకు పాల్పడ్డాడని కొందరు తోటి ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు .

అయితే, ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు మాత్రం ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెబుతున్నారు. తన భర్తకు ఎవరితోనూ సంబంధాలు లేవని, కేవలం కేసును తప్పుదోవపట్టించేందుకు తన భర్తపై ఆరోపణలు చేస్తున్నారని ప్రభాకర్ రెడ్డి భార్య రచన స్పష్టం చేసింది. ఇక శిరీష భర్త ఘటన గురించి వివరిస్తూ... సోమవారం ఉదయం ఆఫీసుకు వెళ్లిన శిరీష రాత్రి 8 గంటల సమయంలో ఫోన్ చేసి లేట్ అవుతుందని చెప్పిందని, 11 గంటల సమయంలో భోజనం చేసి నిద్రపోయామని, అయితే ఉదయం 3 గంటల సమయంలో తను హైదరాబాదుకు 71 కిలో మీటర్ల దూరంలో ఉన్నట్టు లొకేషన్ షేర్ చేసిందని చెబుతున్నాడు. తాను కాల్ చేస్తే ఆమె లిఫ్ట్ చేయలేదని, దీంతో ఆమె నిద్రపోయి ఉంటుందని భావించానని, ఉదయం 5 గంటలకు ఆఫీసుకు వెళ్లిపోయానని చెప్పారు. అనంతరం పోలీసులు ఫోన్ చేసి ఆమె హత్య గురించి చెప్పారని తెలిపారు.

ఈ నేపథ్యంలో పోలీసులు ప్రభాకర్ కు శిరీషతో పరిచయం ఎలా జరిగింది? అన్న విషయంలో ఆమె పని చేసిన సంస్థ అధికారి రాజీవ్, అతని స్నేహితుడు శ్రావణ్ లను ప్రశ్నిస్తున్నారు. రాజీవ్ గర్ల్ ఫ్రెండ్ తేజస్వినిని కూడా విచారించనున్నట్టు తెలుస్తోంది.

ప్రభాకర్ ఆఖరి మాటలు...

‘‘నేను కుకునూర్‌పల్లిలో పనిచేయలేకపోతున్నాను. హైదరాబాద్‌ కు బదిలీ చేయించుకుంటాను’’ అని స్నేహితులతో ప్రభాకర్ చెప్పినట్టు తెలుస్తోంది. అధికారుల వేధింపుల వల్లే ప్రభాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కొంత మంది వాదిస్తుండగా, ప్రభాకర్ రెడ్డి మృతదేహం ఫోటోల్లో కనిపిస్తున్న తీరు చూస్తుంటే ఆయనను తుపాకీతో కాల్చి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మరికొందరు ఆరోపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SI Prabhakar Reddy  Suicide Case  Beautician Sirisha  

Other Articles