Heavy metal festival lays four-mile beer pipeline ‘బీర్’బలుల కోసం స్పెషల్ ఫైఫ్ లైన్.. ఇక పండగే పండగ

A four mile beer pipeline is coming to this german heavy metal festival

Wacken Open Air, Wacken, WOA, W:O:A, Heavy Metal, Metal, Festival, Open Air, Discovery, Beer, Incredible, Cry

“The installation of the pipes and the enlarged drainage is a lasting investment in the infrastructure of Wacken. We pave the way for many more years of Heavy Metal at Wacken Open Air!”

ITEMVIDEOS: ‘బీర్’బలుల కోసం స్పెషల్ ఫైప్ లైన్.. ఇక పండగే పండగ

Posted: 05/31/2017 07:17 PM IST
A four mile beer pipeline is coming to this german heavy metal festival

పైప్ లేన్ దేని కోసం వేస్తారు. నగర పౌరులకు మంచినీటి అందించడం కోసమో.. లేక ముడి చమురు చేరవేసేందుకో.. అదీ కాకపోతే గ్యాస్ సరఫరాకో వేస్తారు. ఇప్పుడేంటి..? అంటున్నారా..? వీటి కోసం కాకుండా ఎవరైనా మధ్యం సరఫరా కోసం ఫైల్ లైన్ వేస్తారా..? అంటే ఎవరైనా ఏంటీ.. మద్యం కోసమా..? ఏం మాతో అడుకుంటున్నారా..? అంటున్నారా..? లేదండీ ఇది నిజంగా నిజం. జర్మనీలోని వాకెన్ పట్టణంలో ఇలాంటి పైప్ లైన్ ను మద్యం కోసమే వేసేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. జర్మనీలోని వాకెన్ పట్టణంలో ప్రతి ఏడాది ఓపెన్ ఎయిర్ ఫెస్టివల్ నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమానికి స్థానికులే కాదు.. వేర్వేరు ప్రాంతాల నుంచి భారీగా పర్యాటకులు వస్తుంటారు. మూడు రోజుల పాటు సాగే ఈ వేడుకలు ఆగస్టు 5 నుంచి స్టార్ట్ కానున్నాయి. అయితే.. ఈ వేడుకల్లో మద్యం సేవించటం కూడా ఒక భాగమే. ఇక్కడికి వచ్చిన వారంతా బీరును విపరీతంగా తాగేస్తుంటారు. అయితే.. సమస్య ఏమిటంటే.. ఈ వేడుకల్ని పచ్చటి పొలాల్లో నిర్వహిస్తుంటారు. వేడుకలకు వచ్చినోళ్లు.. బుద్ధిగా తాగేయకుండా.. మద్యం సీసాల్ని ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారట.

దీంతో.. మా గొప్ప చిరాగ్గా మారిందట. అందుకే.. ఈ సమస్యను అధిగమించేందుకు వీలుగా..  బీరు కోసం ఏకంగా ఒక పైప్ లైన్ వేస్తే ఎలా ఉంటుందని ఆలోచించిన కార్యక్రమ నిర్వాహకులు.. ఆ పని మొదలెట్టేశారు. ఈ వేడుకకు వచ్చే వారు పైప్ లైన్ ద్వారా వచ్చే బీరును మాత్రమే తాగాలే కానీ.. సీసాలు.. గ్లాసులు తీసుకొస్తామంటే మాత్రం ఊరుకోరట. పైపుల్లో నుంచి మంచినీళ్లు రావటం తెలుసుకానీ.. ఇలా బీరు రావటాన్ని మరి.. వేడకకు వచ్చే వారు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఏమైనా ఈ ముచ్చట మందుబాబులకు తెలిస్తే మాత్రం.. గుటకలేస్తూ వెళ్లటం ఖాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Wacken Open Air  Wacken  WOA  W:O:A  Heavy Metal  Metal  Festival  Open Air  Discovery  Beer  Incredible  Cry  

Other Articles