In-laws Sold Daughter-in-law After Their Son's Death. సహగమనాన్ని మించిన ఘోరం.. కొడుకు మరణించాడని కోడలి విక్రయం..

In laws sold daughter in law after their son s death

in laws sold off daughter in law, in laws sold off lalitha, in laws sold off son's wife, in laws, daughter in law, adilabad, neredugonda, krihnapur, lalitha, gujarat businessman, son's demise, Telangana, crime

A strange incident is reported from Adilabad's Neredugonda Mandal, Krishnapur, where in-laws selling their daughter-in-law Lalitha to Gujarat business people for Rs 1.8 lakhs after the death of their son.

ITEMVIDEOS: అదిలాబాద్ లో సతీసహగమనాన్ని మించిన ఘోరం..

Posted: 05/31/2017 06:25 PM IST
In laws sold daughter in law after their son s death

ఎందరో మహానుభావులు స్వాతంత్ర్యానికి ముందు నుంచి కొనసాగుతున్న మూడాచారాలకు వ్యతిరేకంగా పోరాడారు. అందులో చెప్పుకోదగినది సతీ సహగమనం. ఇప్పటికీ దీని గురించి తెలుసుకుని దానితో పాటు ఇలాంటి సాంఘిక దురాచారాలకు రేపటి తరం దూరంగా వుండాలని మన ప్రభుత్వాలు పాఠ్యపుస్తకాలలో ఈ అంశాలను జోడించాయి. అయితే స్వతంత్ర్య దేశంలో అందునా దేశానికి స్వతంత్రం వచ్చి సుమారు 67 ఏళ్లు గడుస్తున్నా దేశంలో మాత్రం కొత్త, వింత, దురాచారాలు రాజ్యమేలుతున్నాయి.

మరోలా చెప్పాలంటే అంతకు మించిన ఘోరం తెలంగాణలో చోటుచేసుకుంది. తమకొడుకు అకస్మికంగా మరణించాడని ఏకంగా తమ కోడలి పైన పూర్తి హక్కులు తమవే నంటూ కొడలిని అమ్మిన దారుణ ఘటన అలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండ‌లం కిష్టాపూర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. కొడలిని తమ ఇ:టిలో వస్తువుగా పరిగణించే అత్తమామలు తమ కొడుకు చ‌నిపోయాడ‌ని అమెను విక్రయించేశారు.

వీరిదే దారుణమని భావిస్తుండగా, వారి కోడలును ఏకంగా గుజరాత్ కు చెందిన ఒక వ్యాపారవేత్త కొని తీసుకెళ్లడు. అయితే ఇందుకుగాను ల‌లిత‌ అత్తమామ‌లకు రూ.1.80 ల‌క్షల‌ రూపాయలను చెల్లించాడు. తనను కట్టి బానిస కన్నా దారుణంగా వ్యాపారి వేధింపులకు గురిచేస్తుండటంతో అమె తన సోదరుడికి విషయాన్ని ఫోన్ ద్వారా తెలిపింది. దీంతో ల‌లిత త‌ల్లిదండ్రులు, సోద‌రుడు విచారించగా అత్తమామలు నోరు విప్పడం లేదు.

దీంతో వారు స్థానిక పోలిస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయాన్ని మొత్తం ఎస్ ఐ వెంకన్నకు వివరించి.. పిర్యాదు చేశారు. ల‌లిత‌కు రెండేళ్ల పాప ఉందని తల్లి కోసం అమె ఏడుస్తున్నా అత్తమామలు పట్టించుకోలేదని తెలిపారు. అయితే ప్రస్తుతం. ఆ పాప అమ్మమ్మ ద‌గ్గరే ఉంటుంది. ఆ పాప‌తో పోలీస్ స్టేష‌న్ కి వ‌చ్చిన ల‌లిత కుటుంబ స‌భ్యులు త‌మ కూతురి ఆచూకీ తెలపాల‌ని కోరారు. త‌మ కూతురు ఎవ‌రో వ్యాపారి చేతిలో వేధింపుల‌కు గుర‌వుతోంద‌ని, ఆమెను కాపాడాల‌ని వేడుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : in laws  daughter in law  adilabad  neredugonda  krihnapur  lalitha  gujarat businessman  son's demise  Telangana  crime  

Other Articles