US visas issued Pakistanis down by 40% ఎక్కడ పొగడాలో కాదు.. ఎక్కడ చెక్ పెట్లాలో కూడా ట్రంప్ కి తెలుసు

Us visas issued pakistanis down by 40 india sees a rise by 28

pakistan us visas, decrease in pakistan us visas, us visas to pakistanis, us visa to indians, US State Department, american president Donald Trump, Barack Obama

Despite not being on the list of US President Donald Trump's "Muslim ban" countries, Pakistan is experiencing a significant decrease in number of non-immigrant US visas.

ఎక్కడ పొగడాలో కాదు.. ఎక్కడ చెక్ పెట్లాలో కూడా తెలుసట

Posted: 05/30/2017 11:08 AM IST
Us visas issued pakistanis down by 40 india sees a rise by 28

ఎక్కడ పోగడాలో అన్న మాటకోస్తే.. ప్రశంసలను, ముఖస్తుతికి తన కన్నా పెద్దవారి నుంచి పొందినప్పుడు ఆ తృఫ్తి ఎలా వుంటుందంటే.. మాటల్లో చెప్పనలవి కాదు. కానీ ఎక్కడ చెక్ పెట్టాలన్న విషయానికి వస్తే.. తమ దేశానికి వలసవచ్చే విదేశీయులను చెక్ పెట్టి.. వారికి సగటున లభించే వీసాలను గణనీయంగా తగ్గించడం కూడా అగ్రరాజ్యానికి తెలుసునని తాజాగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్యంలోకి రానీయకుండా విడుదల చేసిన ట్రావెల్ బ్యాన్ లిస్టులో తాము లేమని సంతోషించిన పాకిస్థాన్ కు ఇలా చెక్ పెట్టడం కూడా చర్చనీయాంశంగా మారింది.

ఇది ఓకే కానీ పాకిస్థాన్ ను ట్రంప్ ఎప్పుడు పొగిడారా..? అని అలోచనలో పడ్డారా..? తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా ముస్లిం దేశాలకు వెళ్లిన ట్రంప్ ను ఆ సందర్బంలో అ దేశంలో వున్న పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ కలిశారు. దీంతో ఆయనపై ప్రశంసలు గుప్పించారు. ఓపక్క టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ.. దుర్మార్గానికి పాల్పడుతున్న పాక్ తీరును ఎండగట్టకుండా.. కేవలం టెర్రరిజాన్ని మాత్రమే టార్గటె చేసిన ట్రంప్.. మరోవైపు పాక్ ప్రధానిని పోగిడేశారు. దీంతో తమ దేశాన్ని ఒక్కమాట అనని ట్రంప్ పై పాకిస్థాన్ కూడా చాలానే అశలు పెట్టుకుంది.

అయితే ఎక్కడ పోగడాలో కాదు ఎక్కడ చెక్ పెట్టాలో కూడా తెలిపిన అగ్రరాజ్యం.. పాకిస్తాన్ వీసాల జారీ విషయంలో మాత్రం చాలా కుదింపులు చేసింది. మరోవైపు భారతీయులకు మాత్రం సాధారణంగా లభించే వీసాల సంఖ్య కన్నా 28శాతం అధికంగా పెంచడం అగ్రరాజ్యం తీరును స్పష్టం చేస్తుంది. నవాజ్ షరీఫ్ ను ట్రంప్ పోగిడారు కాబట్టి ఇక తమ వీసాల సంఖ్య కూడా పెరుగుతుందని భావించిన పాకిస్థాన్ కు అగ్రరాజ్యం అనుకోని రీతిలో ఇచ్చిన షాకుతో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది.

పాక్ జాతీయులకు వీసాల జారీలో కఠినమైన పద్దతుల్ని అమలు చేస్తున్న అగ్రరాజ్యం.. ఏప్రిల్ ల్లో వారికి మంజూరు చేసిన వీసా సంఖ్యను 40 శాతం మేర కుదించింది. పాక్ కు ట్రంప్ సర్కారు ఈ ఏడాది మార్చిలో 3973 వీసాలు.. ఏప్రిల్ లో 3925 వీసాల్ని మాత్రమే మంజూరు చేశారు. ఒబామా సర్కారులో నెలవారీ సగటును చూస్తే  6553 వీసాలు మంజూరు కాగా.. ఇప్పుడు తక్కువనే చెప్పాలి. పాక్ తో సహా.. ముస్లిం ప్రాబల్యం ఉన్న దేశాల్లో వీసాల మంజూరీలో అమెరికా గుట్టుచప్పుడు కాకుండా 20 శాతం మేర కోత పెట్టినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో భారత్ కు వీసాల మంజూరు 28 పెరిగింది. దీంతో మాటలకు చేతలకు భిన్నమైన రీతిని ట్రంప్ సర్కార్ అవలంభిస్తుంది.. పొగిడితే సంతోషించడం కాదు.. చేతల్లో పనులు చూపాలని పాకిస్తాన్ సర్కార్ పై ఒత్తిడి కూడా పెరుగుతుందట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : us visas  pakistanis  us visa to indians  US State Department  Donald Trump  Barack Obama  

Other Articles