botsa invites lokesh challenge on corruption రాజకీయాల్లో లోకేష్ పిల్లకాకేనా..?!

Botsa invites lokesh challenge on corruption

botsa invites lokesh challenge, ysrcp invites debate on corruption, ysrcp ready to debate on corruption, ysrcp, tdp, mahanadu, botsa satyanarayana, minister nara lokesh, challenge, corruption, corruption

ysrcp senior leader and official spokesman of the party botsa satya narayana invites minister nara lokesh challenge on corruption.

బొత్స కూడా రెడీ అన్నారుగా.. మరీ లోకేష్ ఏమంటారో..?

Posted: 05/30/2017 11:57 AM IST
Botsa invites lokesh challenge on corruption

స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకుని ఏర్పాడు చేసిన తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికపై నుంచి ఆ పార్టీ యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్రమంత్రి నారా లోకేష్ విసిరిన సవాల్ ను ప్రత్యర్థి పార్టీ స్వీకరించింది. తమ అధినేత జగన్ పై టీడీపీ జాతీయ స్థాయి నేతల నుంచి రాష్ట్రస్థాయి నేతల వరకు అవినీతి అంశం అంటూ విమర్శలు చేయడాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో వారికి లోకేష్ విసిరిన సవాల్ సరైన సమయంలో కలసివచ్చిందని భావించి అందుకు.. సై అనింది.

మంత్రి లోకేష్ అస్తులు వివరాలు ఏకంగా కోటాను కోట్ల రూపాయలకు ఎలా పెరిగాయన్న అంశంపై ఇప్పటికే వైసీపీ నేతలు ప్రచార అంశంగా మార్చారు. దీంతో మహానాడు వేదికగా సవాల్ విసిరిన లోకేష్ సవాల్ ను స్వీకరించిన వైసీపీ అవినీతిపై చర్చకు తాము సిద్దమని సంకేతాలను పంపింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ చర్చకు తాము సిద్దమని, ఇక వేదికను మాత్రం అధికార పార్టీయే ఖారారు చేసుకోవాలని చెప్పింది.

అయితే జగన్ పై విచారణ చేసిన సీబిఐ అధికారుల చేత లోకేష్ కూడా తనపై వచ్చిన సదావర్తి, దస్పల్లా హిల్స్, విశాఖ ల్యాంగ్ ఫూలింగ్ స్కామ్ లపై విచారణ జరపించుకోవాలని.. అప్పుడు వారే ఎవరు ఎంత అవినీతి పరులో తేల్చిచెబుతారని బోత్స అన్నారు. ఎవరి అవినీతి ఎంత.. గుడిని గుడిలోని లింగాన్ని మింగుతూనే.. ఎవరు నీతిమంతుల్లా ఫోజు కొడుతూ అన్నా హాజారే వారసులమని ప్రగల్భాలు పలుకుతున్నారో కూడా అందరికీ తెలుస్తుందని బొత్స తీవ్రస్థాయిలో విమర్శించారు.

రాజకీయాల్లో ఇంకా పిల్లకాకి లాంటి లోకేశ్‌కు ఆరాటం తప్ప,.. వ్యవహారం లేదని విమర్శించారు. తాత ఎన్టీఆర్‌లా నిక్కచ్చిగా మాట్లాడడం.. ఇచ్చిన మాటకు కట్టుబడి పనులు చేయడం నేర్చుకోవాలనే కానీ.. తండ్రి చంద్రబాబు నాయుడులా మసిబూసి మారేడు కాయలను చేసినట్లుగా మేనేజ్ మెంట్ కదాని ఆయన సూచించారు. ప్రభుత్వ ధనం, అధికార దుర్వినియోగంతో మూడు రోజులపాటు టీడీపీ జాతర చేసుకుందని ఆరోపించిన ఆయన… మూడు రోజుల పాటు జరిగిన మహానాడులో తెలుగు రాష్ట్రాలకు ఒరిగిందేం లేదని బొత్స సత్యానారాయణ విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ysrcp  tdp  mahanadu  botsa satyanarayana  minister nara lokesh  challenge  corruption  corruption  

Other Articles