India's Population overtaken China's report wrong

Chinese scholar says india most populous country in the world

China India Population, Demographer Yi Fuxian, India Highest Population, Chinese Demographer India Population, Highest Population Country, China Demography Wrong, China 2015 Population, China No 2 Population

India's population already overtaken China's: Chinese Demographer Yi Fuxian. Does India have more people than China? A U.S. researcher claims Beijing’s population statistics are wrong.

చైనా కంటే భారత్ టాప్.. సుద్ద తప్పు

Posted: 05/25/2017 09:08 AM IST
Chinese scholar says india most populous country in the world

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది? ఏళ్ల తరబడి ఈ ప్రశ్నకు ఒకే సమాధానం వినిపిస్తుంటుంది. అదే చైనా. ఏషియా దేశంగానే కాదు ఓవరాల్ ప్రపంచంలోనే సుమారు 137 కోట్లతో అగ్రస్థాయిలో నిలిచింది. ఇక దీని తర్వాతి స్థానే మన భారత్ ఫాలో అవుతూ వస్తోంది. కానీ, గత వారంగా భారత్ చైనాను ఎప్పుడో క్రాస్ చేసి వెళ్లిపోయిందని ఓ సర్వే చెబుతోంది.

చైనాకు చెందిన స్వతంత్ర జనాభా శాస్త్రవేత్త ( డెమోగ్రాఫర్), విస్కాన్సిన్-మాడిసన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త యి ఫుక్సియాన్. చైనా జనాభాను భారత్ ఎప్పుడో దాటేసిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. నిజానికి గతేడాది నాటికి చైనా జనాభా 137 కోట్లు అని జాతీయ గణాంకాలు చెబుతున్నాయని, అయితే వాస్తవానికి అంతకంటే ఇంకా 8 కోట్లు తక్కువే అంటే 129 ఉంటుందని వాదిస్తున్నాడు. ఆ లెక్కన భారత అధికారిక గణాంకాల ప్రకారం ఆ దేశ జనాభా 131 కోట్లతో భారతే జనాభాలో అగ్రస్థానంలో ఉంటుందని చెబుతున్నాడు.

ఇక ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌కే ఆ ఖ్యాతి లభిస్తుందని ఫుక్సియాన్ చెబుతున్నారు. కానీ, చైనాకే చెందిన మరికొన్ని సర్వేలు మనోడి వాదనను పెద్ద తప్పుగా పేర్కొన్నాయి. పుక్సి చెబుతున్నట్లు జనాభా క్రమంగా మందగించిన దాంట్లో వాస్తవం ఏ మాత్రం లేదని, అలాగని గణనీయంగా కూడా పెరిగిందనటానికి ఆధారాలు లేవని వాంగ్ ఫెంగ్ అనే మరో డెమోగ్రాఫర్ చెబుతున్నాడు. ఒకే బిడ్డ నినాదం వర్కవుట్ అయినప్పటికీ అది అనుకున్నంత స్థాయిలో కాకపోవటమే ఇందుకు కారణమని వివరిస్తున్నాడు. సరైన గణాంకాల కోసం సీరియస్ గా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China  Demographer  India Population  Highest Country  

Other Articles