Congress may drop from EC's EVM Tampering Challenge

Congress unlikely to participate in ec tamper evm dare

Congress, Congress EC Challenge, Congress EVM Challenge, Election Commission EVM Challenge, EVM Congress, EVM Tampering, Election Voting Machine Challenge, Election Commission Open Challenge, Congress Fear EVM Challenge, AAP EC EVM Challenge

Congress is unlikely to participate in the challenge organised by the Election Commission to prove that electronic voting machines (EVMs) could be tampered with. The party is not ready to treat the challenge in the cavalier manner in which leaders across the opposition camp have been making statements.

ఈవీఎం ఛాలెంజ్.. వికెట్ డౌన్

Posted: 05/25/2017 08:20 AM IST
Congress unlikely to participate in ec tamper evm dare

ఎన్నికల సంఘం నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) ట్యాంపరింగ్‌పై విసిరిన ఛాలెంజ్ మొదలయ్యేందుకు మరో వారం గుడువు మాత్రమే ఉంది. ఈవీఎంలో అవకతవకలు, మొన్నటి ఎన్నికల్లో వాడిన ఈవీఎంలు బీజేపీ కే అనుకూలంగా ఓటు వేస్తున్నాయని నిరూపించేందుకు జూన్ 3 నుంచి అవకాశం ఇస్తున్నట్లు ఈసీ ప్రకటించిన విషయం విదితమే. అయితే ఈ పోటీ నుంచి కాంగ్రెస్ దాదాపుగా తప్పుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

ఎన్నికల సంఘం చాలెంజ్‌లో పాల్గొనరాదని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాజకీయ పార్టీలన్నింటికి ఓ నోటీసు పంపినస్తున్న ఎన్నికల సంఘం ఈ క్రమంలో కాంగ్రెస్ కు ఓ ఇన్విటేషన్ పంపింది. అయితే దానిపై ఇప్పటిదాకా కాంగ్రెస్ అధిష్ఠానం అధికారికంగా స్పందించలేదు. దీంతో ఛాలెంజ్ నుంచి దాదాపుగా కాంగ్రెస్ డ్రాప్ అయినట్లేనని భావిస్తున్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నేతలు ఓ నిర్ణయానికి వచ్చారు.

‘ఈవీఎంలను ప్రవేశపెట్టిందే మేము. అటువంటి మేం ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అందరిలా బాధ్యతారహిత్యాంగా వ్యవహరించలేం’’ అని కాంగ్రెస్ ఆఫీస్ బేరర్ ఒకరు చెప్పుకొచ్చారు. దీంతో ఈసీ చాలెంజ్‌లో కాంగ్రెస్‌కు పాల్గొనే ఉద్దేశం లేదని తేలిపోయింది. మరోపక్క ఆప్ నుంచి పోటీలో పాల్గొనబోయే ముగ్గురు నేతలు ఎవరా? అని ఇప్పుడు చర్చ మొదలైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress  EC Challenge  EVM Tampering  

Other Articles