US Man Encounter with Venomous Rattlesnake

Dangerous rattlesnake in us man lap

Terrifying Encounter , Man Lap Rattlesnake, Dangerous Rattlesnake, Rattlesnake Poison, Terrifying Encounter Bite, Nick The Wrangler Real Name, Nick The Wrangler Host, Nick The Wrangler Programmer, Nick Bishop Videos, Nick Bishop Video, Nick Bishop Rattlesnake Video, Rattlesnake Close Shoot, Rattlesnake Man Escaped, US Man Lap Snake

This Man's Terrifying Encounter With A Rattlesnake Gets 6.7 Million Views. Snake was in his lap almost 2 minutes.

ITEMVIDEOS:ఒళ్లో డేంజరస్ పాము.. ఆపై ఏం జరిగిందంటే...

Posted: 05/25/2017 09:55 AM IST
Dangerous rattlesnake in us man lap

సాహసోపేతమైన కార్యక్రమాలు చేసేప్పడు ఇలాంటి జరిగేవే అయినప్పటికీ తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు ఇక్కడ ఓ యువకుడు. నిక్ బిషప్ ముద్దుగా నిక్ ది వ్రాంగ్లర్ అని పిలుచుకుంటుంటారు. అమెరికా అడవుల్లో సంచరిస్తూ జంతువులపై డాక్యుమెంటరీలు తీయటం, వాటిని యూట్యూబ్ లో అప్ లోడ్ చేసి హిట్స్, లైక్స్ కొట్టడం ఇదే ఇతగాడి పని. అయితే ఈ మధ్య చేసిన ఓ ప్రయత్నం మాత్రం అతనికి గుండె ప్యాంట్ లోకి వచ్చేలా చేసింది.

డాక్యుమెంటరీ తీసి అలసిపోయిన అతడి దగ్గరికి ఓ భయంకరమైన రాటిల్ స్నేక్ వచ్చింది. మెల్లిగా అతని ఒళ్లోకి దూరి కాసేపు అతన్ని కంగారుకు గురిచేసింది. మాములుగా ఈ రాటిల్ స్నేక్ ఏం చేయకపోయినా మనుషులపై దాడులు చేస్తుంటాయి. అవి కరిస్తే వాటి విషం క్షణాల్లో రక్తం అంతా పాకి మనిషి చనిపోతాడంట. ఈ విషయాన్ని ఊటంకిస్తూ గతంలో జరిగిన చాలా ఘటనలే చూపించింది నేషనల్ జియోగ్రఫీ ఛానెల్. కానీ, నిక్ అదృష్టం కొద్ది అలాంటిదేం జరగలేదు.

మెలిగా అతనివైపే చూస్తున్న పామును చిన్నగా కదిలించే యత్నం చేశాడు. ఓ చిన్నకర్ర సాయంతో దాని తోక చివర తాకటం మొదలుపెట్టాడు. దీంతో అది నెమ్మదిగా బయటికి అతని వెనకాల ఉన్న పొదల్లోకి వెళ్లింది. వెంటనే ఒక్క దూటున అతను పక్కకు వచ్చేశాడు. కేవలం రెండే రోజుల్లో ఫేస్ బుక్ లో ఈ వీడియో 7 మిలియన్ల వ్యూవ్స్ సంపాదించింది. చూసే మనకు ఇంతగా ఉంటే అనుభవించిన అతనికి ఇంకెతం నరకం కనిపించి ఉంటుందేమోనని పలువురు కామెంట్లు చేస్తున్నారు. దయచేసి మీరు ఇలాంటి ప్రయత్నాలు చేయకండి అంటూ ఓ ట్యాగ్ లైన్ కూడా పెట్టాడు నిక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nick Bishop  Rattlesnake  Close Encounter  

Other Articles