CBI to probe Kalabhavan Mani's death ఆ నటుడి మృతి కేసు దర్యాప్తులో ట్విస్టు..

Actor kalabhavan mani s death cbi takes over probe

Kalabhavan Mani death mystery, Kalabhavan Mani case takenup by cbi, kalabhavan mani death investigation, Kalabhavan Mani CBI enquiry, Central Bureau of Investigation, Kerala High Court, Kerala police, Kerala, crime, law and justice

The Central Bureau of Investigation (CBI) has taken over the probe into the death of film actor Kalabhavan Mani. he state police have handed over the investigation of the case to CBI following the High Court order.

ఆ నటుడి మృతి కేసు దర్యాప్తులో ట్విస్టు..

Posted: 05/18/2017 05:09 PM IST
Actor kalabhavan mani s death cbi takes over probe

నాటక రంగం నుంచి వెండితెరకు పరిచమైన అనతికాలంలోనే ఏకంగా 200పైగా దక్షిణాది చిత్రాలలో నటించి.. తన సత్తాను చాటుకున్న ప్రజాగాయకుడు, విలక్షణ నటుడు కళాభవన్ మణి మృతి కేసు దర్యాప్తులో ట్విస్టు చోటుచేసుకుంది. రాష్ట్రోన్నత న్యాయస్థానం అదేశాల మేరకు మణి అనుమానాస్పద మరణం కేసును సీబీఐ దర్యాప్తు చేయనుంది. కళాభవన్ మణి మృతి కేసులో మిస్టరీని తేల్చాలని సీబిఐని అదేశించిన న్యాయస్థానం నెలరోజుల్లోగా విచారణ ప్రారంభించాలని కూడా అదేశాలను ఇచ్చింది.

ఈ కేసుపై దర్యాప్తు చేసేందుకు అంతకుముందు సీబీఐ నిరాకరించడంతో కళాభవన్ మణి భార్య, సోదరుడు కోర్టును ఆశ్రయించారు. కళాభవన్ మణి గతేడాది మార్చి 6న అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడంతో ఆయన మరణంపై అనుమానాలు వున్నాయని అతని భార్య, కుటుంబ సభ్యులు  అనుమానాలు వ్యక్తం చేయడంతో కేరళ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కళాభవన్ మణి దేహంలో అత్యంత విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్ అవశేషాలు కనుగొన్నట్టు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడికావడంతో ఆయనకు విషం ఇచ్చి చంపారన్న అనుమానాలు బలపడ్డాయి. మణి మృతి వెనుక అతడి స్నేహితుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కేసులో సిబిఐ చేత విచారణ జరిపించాలని అయన కుటుంబ సభ్యులు న్యాయస్థానాన్ని అశ్రయించడంతో కోర్టు ఈ మేరకు అదేశాలను జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kalabhavan Mani  death case investigation  CBI  kerala police  kerala high court  

Other Articles