Call from 777888999 could get you killed! ఆది డెత్ కాల్ కానేకాదు.. రిలాక్స్ గా వుండండీ..!

Call from 777888999 could get you killed another hoax in the making

Call from 777888999, death call 777888999, phone explode 777888999, India, WhatsApp , Facebook, 777888999, hoax, hoax message, social media, india, circulated messages, panic, national news, breaking news, top news, latest news

a unique 9-digit phone number saying that a call from 777888999 could set your phone on fire and if messages are to be believed, it could get you killed too.

ఆది డెత్ కాల్ కానేకాదు.. రిలాక్స్ గా వుండండీ..!

Posted: 05/18/2017 04:13 PM IST
Call from 777888999 could get you killed another hoax in the making

అది డెల్ కాల్.. అ కాల్ లిఫ్ట్ చేశారంటే మీ ఫోన్ కు అదే చివరి కాల్ కావచ్చు. ఎందుకంటే ఆ కాల్ లిప్ట్ చేయగానే మీ ఫోన్ పేలిపోవడం గ్యారంటీ.. తస్మాత్ జాగ్రత్త.. అంటూ హెచ్చరికల ధోరణితో మీ వాట్సాఫ్ గ్రూపులోనే లేక మరే విధంగానే మీకు ఈ మెసేజ్ అందిందా..? అందేవుంటుంది. ఇక చివరాఖరున ఈ మేసేజ్ ను దయచేసి మీ ఫ్రెండ్స్ కు కూడా దీన్ని షేర్ చేయండీ అని కూడా వుందా..? ఇంతకీ ఆ నెంబర్ ఏంత అంటే 777888999.

ఇది నిజమని నమ్మేసి అనేక మంది 7తో ప్రారంభమయ్యే ఫోన్లనే ఎత్తడం లేదు.. ఇక మరికోందరు త్రిబుల్ సెవన్, త్రిబుల్ 8, త్రిబుల్ 9 నెంబర్లు వున్న ఏ ఇతర ఫోన్లను లిస్టు చేయడం లేదు. తమ విలువైన ఫోన్ పగిలిపోతేనూ... అని కొందరు ప్రశ్నిస్తుండగా, బతికుంటే బలసాకులు తిని బతకొచ్చ.. ఫోన్ పెలి ప్రాణమే పోతే.. అంటూ మరికోందరు మేసేజ్ ను తెగ నమ్మెసి హైరానా పడుతున్నారు. అయితే ఇంతకీ ఈ మేసేజ్ లో నిజమెంత..? ఫోన్ నెంబర్లతో ఫోన్ పేల్చేసేంత సీన్ వుందా..? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

ఇక వచ్చిన మేసేజ్ తోనే తలబొప్పికడుతుంటే.. ఇక మరికోందరు మరింత వివరాణ్మతక కథనాలను కూడా ప్రచారం చేస్తున్నారు. "777888999 నుంచి కాల్ వచ్చి దాన్ని రిసీవ్ చేసుకుంటే, ఓ యువతి మాట్లాడుతుంది. అదే మీరు మాట్లాడే చివరి కాల్ అని చెబుతుంది. ఆపై నిజంగానే అలా జరుగుతుంది. జాగ్రత్త సుమీ అంటూ హెచ్చరించే మేసేజ్ లు కూడా వచ్చేశాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ మేసేజ్ లో.. అసలు నిజముందా..? కనీసం నిజం పాలు ఎంత..? అన్న కోణంతో చర్చ జరుగుతుంది.

అయితే, ఇది కేవలం పుకారేనని.. దీనిని నమ్మనక్కర్లేదని నిపుణులు కొట్టి పారేస్తున్నారు. ఒక నంబర్ నుంచి ఫోన్ వచ్చి, దాన్ని రిసీవ్ చేస్తే, ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉండదని, అటువంటిదే ఉంటే, అది అన్ని నంబర్లకూ వర్తిస్తుందని చెబుతున్నారు. ఇక ఫోన్ రిసీవ్ చేసుకుంటే చనిపోతారనడానికి ఒక్క నిదర్శనం కూడా లేదని చెబుతున్నారు. ఈ నంబరులో కేవలం 9 అంకెలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇది ఇండియాలో పనిచేయదని, ఒకవేళ అది ఇంటర్నేషనల్ నంబరే అయినా, ఆ దేశపు కోడ్ సహా మొబైల్ స్క్రీన్ పై ప్రత్యక్షమవుతుందని అభయమిస్తున్నారు. ఈ నంబరుతో ఫోన్ వచ్చినట్టు ఇంతవరకూ సాక్ష్యాలు లభించలేదని టెలికం రంగ నిపుణులు వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 777888999  death call  WhatsApp  Facebook  hoax message  social media  

Other Articles

  • Rs 40 lakh looted by armed men from bank in rourkela

    సినీపక్కీలో.. పట్టపగలు నగరంలో బ్యాంకు దోపిడీ..

    Jun 20 | ఒడిశాలోని రూర్కెలా నగరంలో సినీపక్కీలో పట్టపగలు బ్యాంకు దోపిడీ జరిగింది. ముసుగులు ధరించిన దొంగలు అయుధాలను చేతబట్టి బ్యాంకులోకి చొరబడి ఏకంగా 44 లక్షల రూపాయలతో పరారయ్యారు. మధ్యాహ్నం సమయంలో జరిగిన ఈ చోరీ... Read more

  • President ram nath kovind approves governor s rule in jammu and kashmir

    జమ్మూకాశ్మీర్ లో రాష్ట్రపతి పాలన.. తక్షణం అమల్లోకి..

    Jun 20 | జమ్ముకశ్మీర్ లో అనూహ్యంగా రాజకీయ కల్లోలం ఏర్పడి శరవేగంగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. బీజేపి చారిత్రక అవకాశానికి తిలోదకాలు ఇచ్చి.. పిడీపీ ప్రభుత్వంతో తెగదెంపులు చేసుకున్న తరుణంలో దేశాధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్... Read more

  • Prakash raj takes dig at pm modi justasking continues in j k

    చారిత్రక అవకాశమన్న ప్రధానికి ప్రకాష్ రాజ్ చురక

    Jun 19 | జమ్ముకశ్మీర్ లో తాము అధికార పీడిపీ పార్టీతో ఏర్పర్చుకున్న కూటమిని తెగదెంపులు చేసుకున్న బీజేపి ఇక రాష్ట్రపతి పాలన విధించాలని ఏకంగా గవర్నర్ కు కోరింది. ఈ నేపథ్యంలో ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ గతంలో... Read more

  • Jammu and kashmit heading toward president s rule as cm resigns

    రాష్ట్రపతి పాలన దిశగా జమ్మూకాశ్మీర్.. తెగిన కూటమి బంధం..

    Jun 19 | జమ్ముకశ్మీర్ లో తాము అధికార పీడిపీ పార్టీతో ఏర్పర్చుకున్న కూటమికి బీజేపి ముగింపు పలికింది. ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో రాష్ట్ర సీనియర్ నేతలతో ఏర్పాటైన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.... Read more

  • Parakala prabhakar resigns to media adviser post

    ఏపీ మీడియా సలహాదారు పదవికి పరకాల రాజీనామా

    Jun 19 | ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌ తన పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన తన రాజీనామా లేఖను పంపుతూ, తక్షణమే ఆమోదించాలని కోరారు. తనపై కొన్ని రోజులుగా కొందరు... Read more

Today on Telugu Wishesh