adding energy drinks to alcohol makes you sexually confident మద్యంలో అవి జోడిస్తే.. శృంగారం మజా వేరయా..!

Study reveals how people feel more sexually confident by taking alcohol

energy drinks with alcohol, sexually confident when energy drinks added with alcohol, health and well being, alcohol, energy drinks, sexually confident, alcohol, energy drinks, sexually confident, psychology, restrictions,Pierre Chandon, vodka-Red Bull cocktail, heterosexual men, exotic cocktail

According to a new study, knowing that you have added energy drinks to a spirit will make you feel that you are more drunk.

మద్యంలో అవి జోడిస్తే.. శృంగారం మజా వేరయా..!

Posted: 05/16/2017 05:02 PM IST
Study reveals how people feel more sexually confident by taking alcohol

కాక్ టెయిల్ తాగిన కోతినేను.. నెక్ టై కట్టుకున్న కాకి నేను.. కోంచెం లూజు కొంచెం టైట్ నేను.. అంటూ పాటను అలపిస్తున్నారా..? ఈ పాటను ఎప్పుడు అలపిస్తారో మాకు తెలుసులేండి.. మీరు కొంచెం మద్యం పుచ్చుకుంటున్నప్పుడే కదా..? అయితే మీకు మరో విషయం చెప్పాలి. అదేంటంటే.. రెడ్ బుల్ సహా పలు ఎనర్జీ డ్రింకులు మార్కెట్లోకి వచ్చాయి కదా.. వాటిని సేవిస్తే మనుషులకు రెక్కలు వచ్చినట్లేనంటూ ట్యాగ్ లైన్లు కూడా పెట్టేసుకుని వచ్చాయి. ఇంతవరకు బాగానే వున్నా ఈ ట్యాగ్ లైన్లతోనే వచ్చింది అసలు చిక్కంత. ఎందుకంటే ఎన్ని ఎనర్జీ డ్రింకులు తాగినా.. రెక్కలు రావడం లేదు.. సరికదా అలాంటి ఫీలింగే లేదు అంటూ బాధపడుతున్నారా..?

అయితే తాజాగా చేసిన అధ్యయనాల్లో ఈ ట్యాగ్ లైన్ నిజమనే స్సష్టమవుతుంది. అయితే కేవలం ఎనర్జీ డ్రింకు తాగితే మాత్రం సరిపోదట. మద్యంలో ఈ ఎనర్జీ డ్రింకులను కలుపుకుని తాగితే.. అప్పుడు ఖచ్చితంగా రెక్కలు వస్తాయట. దీంతో అయిపోయిందా అంటే ఇక్కడే అసలు విషయం ప్రారంభమవుతందట. మద్యంలో ఎనర్జీ డ్రింక్ ను కలుపుకుని సేవిస్తే మత్తు క్షణాల్లో ఎక్కేస్తుందని, ఎంతో తాగేసినట్టుగా అనిపిస్తుందని.. దాంతో వారు మోతాదుకు మించిన మద్యాన్ని సేవించలేరని తెలుస్తుంది. అంతేకాదండోయ్.. మద్యంతో రెడ్ బుల్ కలుపుకుని తీసుకున్న వారు శృంగార ప్రపంచంలో విహరించాలని, విహరించగలమన్న అత్మవిశ్వాసంతో వుంటారట. ఇక వీరిలో ధైర్యంతో పాటు దేనికైనా రెడీ అని దూకుడుగా వెళ్లే స్వాభావమూ అధికంగానే వుంటుందని అంటున్నారు

ఈ మేరకు లండన్ లోని ఓ సంస్థ చేసిన అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఎనర్జీ డ్రింకులను మద్యంతో కలపి తీసుకన్న పక్షంలో వారికి అధికంగా మద్యం తాగామన్న భావన కలగడంతో పాటు శృంగారంలో రాణించగలమన్న అత్మవిశ్వాసం అధికంగా వుంటుందని అద్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు మొత్తం 154 మంది పురుషులపై అధ్యయనం చేసిన సంస్థ వారిలో కొందరికి మద్యాన్ని అందించింది. మరికోందరికి మద్యంతో పాటు ఎనర్జీ డ్రింకులను కలపి అందించింది.

ఇంకోందరికి మద్యంతో పాటు పళ్ల రసాలను కలిపి ఇచ్చింది. వీరందరినీ అద్యయనం చేయడం కోసం మధ్యం సేవించిన తరువాత అదరికీ కంప్యూటర్ల ఎదుట కూర్చోబెట్టి ఒక టాస్క్ ఇచ్చి వారిని పూర్తి చేయాల్సిందిగా కొరింది. వారందరిలో మద్యంతో పాటు ఎనర్జీ డ్రింక్స్ తీసుకున్న వారి టాస్క్ లను పూర్తి చేసేందుకు ఎంతటి రిస్క్ లనైనా ఎదరించేందుకు సిద్దపడ్డారని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే ఇలా అధిక కాలం పాటు సేవించడం మాత్రం అరోగ్యంతో అటలాడుకోవడమేనని అధ్యయకారులు తెలియజేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : alcohol  energy drinks  sexually confident  psychology  restrictions  

Other Articles