TV channel's sudden closure shocks staff వైరల్ వీడియో: ఏడుస్తూనే వార్తలు చదివిన యాంకర్

Tv anchor fights tears after finding out on air channel is being shut

anchor cries over channel being shut down, Israeli anchor cries over channel shut down, Israeli anchor Geula, Israel's Channel One shut down, viral video

An Israeli television news anchor got tearful reporting her own show's sudden cancellation on air. Geula Even fought back tears after learning it would be her last show on Israel's Channel One after the government abruptly decided to shut it down.

ITEMVIDEOS: వైరల్ వీడియో: ఏడుస్తూనే వార్తలు చదివిన యాంకర్

Posted: 05/11/2017 05:40 PM IST
Tv anchor fights tears after finding out on air channel is being shut

ఇక ఆ క్షణమే తమకు అఖరు గడియలు అని తెలిస్తే.. దీని తరువాత తమ ఉపాధి పోతుంది..? మళ్లీ జాబ్ కోసం అన్వేషణ సాగించాలని తెలిస్తే.. ఎవరు మాత్రం తమలోని ఉద్వేగాన్ని అపుకోగలరు. ఎక్కడవున్నా.. ఎందరిమద్య వున్నా.. పిడుగులాంటి వార్త తెలిసిన తరువాత కట్టలు తెంచుకుని వచ్చే కన్నీళ్లను అపడం ఎవరితరం. ఇక్కడా ఈ టీవీ న్యూస్ రీడర్ విషయంలోనూ అదే జరిగింది. అయితే అప్పటికే అమె లైవ్ లో వుంది. ఏకంగా ప్రభుత్వమే తమ టీవీ ఛానెల్ ను అపేయాలని అదేశిస్తూ ఉత్తర్వులను జారీ చేసిందని ఆ వార్తను చదువుతూ.. ఉద్వేగానికి గురైన ఆ యాంకర్ తన కళ్ల వెంట వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూనే వార్తలకు మమ అనిపించింది.

వివరాల్లోకి వెళ్తే.. ఇజ్రాయిల్‌కి చెందిన గ్యులా ఈవెన్‌, ఛానెల్‌ 1 అనే వార్తా సంస్థలో యాంకర్‌గా పనిచేస్తోంది. ఈ వార్తా ఛానెల్‌ ఇజ్రాయిల్‌లో చాలా ఫేమస్‌. దీనికి దాదాపు 49 ఏళ్ల చరిత్ర ఉంది. కొన్ని రాజకీయ వివాదాల కారణంగా ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నేతన్యాహు ఈ ఛానెల్‌ మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ వార్తను గ్యులా లైవ్ లో వార్తలు చదువుతుండగా వచ్చింది. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అందుతోంది.. పార్లమెంటులో తాజాగా ఓ ప్రకటన చేశారని, మా టీవీ ఛానెల్ ను ప్రభుత్వం నిలిపివేయాలని అదేశాలు జారీ చేసిందని.. ఈ రోజు రాత్రి మా చిట్టచివరి న్యూస్ బులెటన్ అని చెబుతూ ఏకంగా కన్నీళ్ల పర్యంతమైంది.  

అలా ఏడుస్తూ... ఉబికి వస్తున్న కన్నీళ్లను తూడ్చుకుంటూ గ్యులా వార్తలు చదివింది. తన బాధను అమె ఇలా వ్యక్తం చేస్తూనే ఈ రోజుతో చాలా మంది తమ ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారని, వాళ్లకు కొత్త ఉద్యోగాలు దొరకాలని అశిస్తున్నట్లు చెప్పింది. 55 సెకండ్ల నిడివి వున్న ఈ వీడియో క్లిపింగ్ ను ఛానల్ వన్ తమ అధికారిక ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేయగా, అది కాస్తా వైరల్ అయ్యింది. దీనిని ఇప్పటివరకు ఏకంగా 3.45 లక్షల మంది చూశారు. 1950 సార్లు ఇది షేర్ అయ్యింది. నేతన్యాహు మీడియా పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌లానే వ్యవహరిస్తున్నారంటూ ఆ ఛానెల్‌ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tv anchor  israeli tv channel  channel shut down  viral video  

Other Articles