BJP MLA flayed for 'selfie' with fire ఆ సెల్ఫీతో.. ఈ బీజేపి ఎమ్మెల్యేను అపార్థం చేసుకున్నారు..

Mla clicks selfie at fire incident site slammed on social media

bjp leader slammed on social media, bachchu singh criticised, minister posts a selfie on a burning site, Bachchu Singh, Selfie Controversy, Bharatpur, BJP mla, facebook, Rajasthan, India news, latest news

The selfie obsession was apparently taken to a bizarre level by a BJP lawmaker in Rajasthan who posted one taken in front of burning houses. Bachchu Singh was skewered on Facebook

ఆ సెల్ఫీతో.. ఈ బీజేపి ఎమ్మెల్యేను అపార్థం చేసుకున్నారు..

Posted: 05/11/2017 04:04 PM IST
Mla clicks selfie at fire incident site slammed on social media

రాజస్థాన్ బిజేపి ఎమ్మెల్యేను నెట్ జనులు అపార్థం చేసుకున్నారు. అయితే తన నియోజకవర్గ ప్రజలతో పాటు నెట్ జనులు కూడా ఆయన ఉద్దేశ్యం వెనుకున్న పరమార్థాన్ని గ్రహించడంలో పప్పులో కాలేశారు. అయితే తీరా అయన ఉద్దేశ్యం తెలిసిన తరువాత. ఓహో అదా అసలు విషయం అంటూ నాలుకకర్చుకున్నారు. అసలాయన ఉద్దేశ్యం ఏమిటీ అంటరా..? అంతకన్నా ముందు అయనను అపార్థం చేసుకునేంతలా ఆయన చేసిన పనేంటి అంటారా..? ఏమీ లేదండీ ఇదంతా ఓ సెల్పీ తీసుకుచ్చిన తంటా.

ఔను నిజమే.. రాజస్తాన్ లోని  భరత్ పూర్ జిల్లాలోని బయానా అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ గ్రామంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నిరుపేదల గుడిసెలు అగ్నికి అహుతవుతున్నాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆ సమాచారాన్ని పోలీసులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధి, బీజేపీ ఎమ్మెల్యే బచ్చు సింగ్ కు కూడా తెలియపర్చారు. గుడిసెలు కాలిపోతే తానువచ్చి ఏంచేస్తాను. ముందుగా ఫైర్ సిబ్బందికి సమాచారం అందించండీ అంటూ చెప్పే ప్రజాప్రతినిధులు వున్న నేటి రోజుల్లో.. పేదల గుడిసెలు తగలబడిపోతున్నాయని హుటాహుటిన సంఘటనా స్థలానికి తరలివచ్చిన ఎమ్మెల్యేలు ఎందరుంటారు.

అలా తరలివచ్చే వారిలో ఒకరు ఈ బచ్చుసింగ్. వెంటనే ఘటనాస్థాలానికి చేరుకుని తనకు తొచిన విధంగా తాను కూడా మంటలార్పే చర్యల్లో పాల్గొన్నాడు. సాక్షాత్తు ఎమ్మల్యే కూడా అక్కడే వుండటం.. పేదల బాధలను అర్థం చేసుకోవడంతో.. ఇల్లు, ఇంట్లోని వస్తువులు కాలిపోతున్నా.. వారికి కొంత ధైర్యం వుంటుంది. వారి మనోవేదనను అర్థం చేసుకునేందుకు స్వయంగా తమ ప్రజాప్రతినిధే వచ్చాడని.. ఆయన తమకు న్యాయం అందజేస్తారని అశించారు.

రమారమి మంటలన్నీ అర్పివేత చివరి దశకు చేరుకున్న క్రమంలో బాదితులకు త్వరలోనే తగిన విధంగా నా్యం చేస్తామని, అందరినీ అదుకుంటామని చెప్పిన ఎమ్మెల్యే.. మంటలు కనిపించేలా సెల్ఫీ దిగి తన ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. దీనిపై నెటిజన్లలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఓపక్క ఇల్లు కాలుతుంటే ఆ అగ్గితో చుట్టవెలిగించుకున్నాడన్న సామెత గుర్తుకొస్తోందని ఒక నెటిజన్ మండిపడగా, ఏ సమయంలో సెల్ఫీ దిగాలో కూడా ప్రజాప్రతినిధికి తెలియదా? అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక మరికోందరు మాత్రం ఆయనను రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించుకున్న నీరో చక్రవర్తిలా వున్నారని ఎద్దేవా చేశారు. దీంతో ఎమ్మెల్యే బచ్చుసింగ్ తన ఫేస్ బుక్ పోస్టును తొలగించారు. నెట్ జనులు తనను క్షమించాలని తన అసలు ఉద్దేశ్యం తాను స్వయంగా మంటలు చెలరేగి పేదల ఇళ్లను కబళించిన తన నియోజకవర్గంలోని ప్రాంతాను వెళ్లానని, ఆ భాధను, బాధితుల రోదనలను విన్నానని, ఈ క్రమంలో వారిక ిన్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతానని ఇందుకోసమే తాను ఈ సెల్పీని దిగి ఫేస్ బుక్ లో పోస్టు చేశానని చెప్పారు. దీంతో అయ్యయ్యో అనవసరంగా బచ్చుసింగ్ ను అపార్థం చేసుకున్నామే అంటూ కొందరు నెట్ జనులు తమ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bachchu Singh  Selfie Controversy  Bharatpur  BJP mla  facebook  Rajasthan  

Other Articles