bitter experiance-to-ap ministers-in-munagalapalem-village లోకేష్ సహా ఏపీ మంత్రులకు చేధు అనుభవం

Bitter experiance to ap ministers in munagalapalem village

Nara Lokesh, Amarnath Reddy, bojjala gopalakrishna reddy, munagalapalem, Yerpedu Accident, Andhra pradesh

Bitter experiance for andhra pradesh ministers including AP CM son Nara Lokesh at munagalapalem as the victims familes question ministers why arent government taking action against sand mafia in chitoor region even after repeated complaints

లోకేష్ సహా ఏపీ మంత్రులకు చేధు అనుభవం

Posted: 04/22/2017 07:01 PM IST
Bitter experiance to ap ministers in munagalapalem village

ఏర్పేడు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు నారా లోకేశ్‌, అమర్‌ నాథ్‌ రెడ్డి, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలకు చేదు అనుభవం ఏదురైంది. మంత్రులను బాధిత కుటుంబాల సభ్యులు నిలదీసి వెనక్కు వెళ్లమని నినాదాలు చేయడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చిత్తూరు జిల్లా మునగలపాళెం గ్రామంలో ఏర్పేడు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన మంత్రులను స్థానికులు అడ్డుకున్నారు.

ఇసుక మాఫియా వెనుక ఉన్నది మీ మనుషులు కాదా? అంటూ మృతుడి భార్య నిలదీశారు. మీరు పది లక్షలు ఇవ్వడం కాదు...అవే పది లక్షల రూపాయలను నేను మీకు ఇస్తాను...నా భర్తను మీరు వెనక్కి తీసుకురండి అని ఆమె సవాలు విసిరారు. గ్రామంలో ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది, చర్యలు తీసుకోండి అంటూ పలుమార్లు గ్రామం నుంచి రిప్రజెంటేషన్ ఇస్తే పట్టించుకోలేదని ఆమె మండిపడ్డారు.

న్యాయం చేస్తామని పరామర్శించేందుకు వచ్చిన మీరు...తమ వారిని పొట్టన బెట్టుకుని ఏం న్యాయం చేస్తారని ఆమె అడిగారు. అమరావతిలో రోడ్లేసుకోవడం కాదు...గ్రామాలను కూడా పట్టించుకోండి అంటూ ఆమె నిలదీశారు. అమరావతి, గుంటూరు తప్ప మిగతా ప్రాంతాల అభివృద్ధి పట్టదా అని ప్రశ్నించారు. శ్రీకాళహస్తిలో రోడ్డు విస్తరణ జరిగి ఉంటే ప్రమాదం జరిగేది కాదన్నారు. ‘అమరావతిలో రోడ్డు వేయడం కాదు.. మా సంగతి పట్టించుకోండి’ అంటూ ధ్వజమెత్తారు.

అనంతరం లోకేష్ మాట్లాడుతూ, ఈ గ్రామం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని అన్నారు. గ్రామంలో చాలా మంది హైదరాబాదులో ఐటీ పరిశ్రమలో ఉద్యోగాలు చేస్తున్నారని, అలాగే బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఉన్నారని, వారందర్నీ సంప్రదాయబద్దమైన కర్మకాండలు ముగిసిన తరువాత అమరావతికి రమ్మని పిలిచామని, ఆ తరువాత వారి భవిష్యత్ గురించి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కాగా ఏర్పేడు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 16కు చేరింది. స్విమ్స్‌ లో చికిత్స పొందుతూ శనివారం మరొకరు మృతి చెందారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles