ప్రజాతీర్పును హైజాక్ చేసినందుకు పారికర్ క్షమాపణలు చెప్పాలి Shame on you, Digvijay Singh replies to Parrikars

Shame on you digvijay singh replies to parrikars thank you jibe

Digvijaya Singh, Manohar Parrikar, Rajya Sabha, Goa polls, Goa, Goa elections, Nitin gadkari, BJP, Congress purchasing law makers, democracy

Digvijaya Singh hit out at Goa CM Manohar Parrikar alleging alleged that the BJP indulged in buying of lawmakers in the state,

ప్రజాతీర్పును హైజాక్ చేసినందుకు పారికర్ క్షమాపణలు చెప్పాలి

Posted: 04/01/2017 05:59 PM IST
Shame on you digvijay singh replies to parrikars thank you jibe

గోవా శాసనసభ ఎన్నికలలో అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించినా.. అధికారాన్ని మాత్రం బీజేపి చేజిక్కించుకున్న నేపథ్యంలో ఈ విషయమై ఇంకా ఇరు పార్టీల పెద్దల మధ్య మాటల మంటలు కొనసాగుతూనే వుంది. ఈ క్రమంలో బీజేపి అధికార దాహం ఎలాంటిదో యావత్ దేశం చూసిందని, అధికారం కోసం ప్రజాతీర్పును కూడా అగౌరవపర్చేందుకు బీజేపి పార్టీ సహా ఆ పార్టీ నేతలు దిగజారుతారని గోవా, మణిపూర్ ఫలితాల ద్వారా తేలిపోయిందని కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

రాజ్యసభలోకి వచ్చి గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తనపై వ్యంగ్యాస్త్రాలు సంధించి.. తనకు ధ్యాంక్స్ చెప్పడంపై కూడా దిగ్విజయ్ స్పందించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బీజేపి నేతలు తనతో పాటు దేశప్రజలకు, ముఖ్యంగా గోవా ప్రజానికానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ట్ిట్టర్ అనుసంధానంగా ట్విట్ట్ లు చేశారు. గోవా ప్రజలను మోసం చేసి అధికారాన్ని లాక్కున్న నైజం పట్ల క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
 
దూకుడుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా సాయపడినందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు చెప్పాలని ఆయనకు సలహా ఇచ్చారు. పారికర్ అధికార దాహంతో ఉన్నారని, ఆయన సిగ్గుపడాలని ట్వీట్‌లో పేర్కొన్నారు. గోవా ప్రజలను మోసం చేసినందుకు వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గోవా గవర్నర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని, సర్కారియా కమిషన్ మార్గదర్శకాలను, సుప్రీంకోర్టు తీర్పులను తుంగలో తొక్కారని ఆరోపించారు. గోవా ప్రజల తీర్పును హైజాక్ చేశారని అరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Digvijaya Singh  Manohar Parrikar  Rajya Sabha  Goa polls  Goa  Nitin gadkari  BJP  Congress  

Other Articles