‘‘త్వరలో డెబిట్, క్రెడిట్ కార్డులకూ మంగళం’’ Mobile wallets, biometric modes to replace cards says Amitabh Kant

Mobile wallets biometric modes to replace cards says amitabh kant

Amitabh Kant, Mobile wallets, industry, Financial Services, FDI, biometric modes of payment, world, Renault, people, New Delhi

Mobile wallets and biometric modes of payments will replace debit and credit cards in the next three to four years, said NITI Aayog CEO Amitabh Kant.

‘‘త్వరలో డెబిట్, క్రెడిట్ కార్డులకూ మంగళం’’

Posted: 04/01/2017 05:08 PM IST
Mobile wallets biometric modes to replace cards says amitabh kant

పాత పెద్దనోట్ట రద్దును చేపట్టి అత్యంత సాహసోపేత నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం త్వరలోనే మరో కీలక నిర్ణయం కూడా తీసుకోనుంది, నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం.. తీసుకుంటున్న ఆర్థిక సంస్కరణలు దేశం గతిని మార్చుతాయని స్వయంగా కేంద్ర విత్త మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేసిన తరుణంలో.. ఈ క్రమంలో వేగం ఏమాత్రం తగ్గదని, మరో రెండేళ్లలో సంస్కరణలు కొత్త దశకు చేరుకుంటాయని కూడా తేల్చిచెప్పారు. అయితే ఇప్పటికే కేంద్రం డిజిటల్ లావాదేవీల దిశగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో మరేవిధంగా సంస్కరణలు జరుగుతాయ్..?  అని అలోచనలో పడ్డారా..?.

ఈ క్రమంలో త్వరలోనే భారీ అర్థిక సంస్కరణలకు భారత్ వేదిక కానుందని తెలుస్తుంది. త్వరలోనే బ్యాంకులు జారీ చేసే డెబిట్, క్రెడిట్ ఏటీయం కార్డులకు త్వరలోనే కేంద్రం మంగళం పాడనుంది. నమ్మశక్యంగా లేదా,,; కానీ ఇది నిజం. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ దృవీకరిస్తూ బాంబులాంటి వార్తను పేల్చారు. టెక్నాలజీ అప్లికేషన్లను ఇండియా అక్కున చేర్చుకుంటున్నందున మొబైల్ వాలెట్లు, బయోమెట్రిక్ పద్ధతుల్లో డిజిటల్ లావాదేవీలు మరింత వేగం పుంజుకుంటున్నాయని అమితాబ్ కాంత్ తెలిపారు.

ఈ క్రమంలో మునుముందు క్రెడిట్, డెబిట్ కార్డులు, ఏటీఎంలు మాయం కానున్నాయని వెల్లడించారు. పీహెచ్‌సీసీఐ ఇన్వెస్ట్‌మెంట్ ఫెసిలిటేషన్ సర్వీసెస్‌ ప్రారంభం సందర్భంగా అమితాబ్ కాంత్ మాట్లాడుతూ, భారతదేశ వృద్ధిలో టెక్నాలజీ కీలక భూమిక పోషించనుందని అన్నారు. 'రాబోయే మూడునాలుగేళ్లలో బ్యాంకులకు వెళ్లడం అనేది దాదాపు కనుమరుగవుతుంది. అంతటా వాడుకలో ఉన్న టెక్నాలజీ వేగం పుంజుకుంటుంది. మొబైల్ వాలెట్, బయోమెట్రిక్ పద్ధతుల్లో డిజిటల్ లావాదేవీలే వాడుకలోకి వస్తాయి. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఏటీఎంలు కంటికి ఇక కనిపించవు' అని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles