ధర్మశాలలో టీమిండియా జయకేతనం.. ఎగిరిన త్రివర్ణ పతాకం india Win by 8 wickets, reclaim border-gavaskar trophy

Dharamsala hosts win by 8 wickets reclaim border gavaskar trophy

india vs australia, steve smith, ajinkya rahane, kl rahul, india, australia, Team India, india australia dharmasala test, india australia dharmasala test, latest sports news, indian cricket team, news, sports, cricket news, cricket

India got off to a steady start chasing a target of 106 after bowling out Australia, Ajinkya Rahane along with Rahul took the hosts home without any more damage.

ధర్మశాలలో టీమిండియా జయకేతనం.. ఎగిరిన త్రివర్ణ పతాకం

Posted: 03/28/2017 11:59 AM IST
Dharamsala hosts win by 8 wickets reclaim border gavaskar trophy

ధర్మశాల టెస్టులో టీమిండియా విజయం సాధించింది. టెస్టు సీరీస్ లలో అప్రతిహాత విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా.. ప్రపంచ దిగ్గజాలమని భావించే అసీస్ ను కూడా చిత్తు చేసి మరో సిరీస్ ను తమ ఖాతాలోకి వేసుకుని వరుసగా ఏడు విజయాలను అందుకుంది. ధర్మశాలలో టెస్టు నేపథ్యంలో ఆ పిచ్ స్పిన్నర్లకు అనుకూలం కాదు.. పేస్ కే అనుకూలమన్న కథనాల నేపథ్యంలో అప్పడే తాము గెలిచినట్లు భావించిన అసీస్ ముందు మురిసనమ్మ పండగ గుర్తెరుగదు అన్న నానుడిని నిజం చేసింది.

ధర్మశాల టెస్టు నేపథ్యంలో అసీస్ వెటరన్ బౌలర్లు, దిగ్గజాల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకన్న జట్టు.. రంగంలోకి దిగిన తరువాత మాత్రం బొక్కబోర్లాపడింది. మొదటి ఇన్నింగ్స్ ను ఒక్కరోజులోనే ముగించిన అసీస్.. 300 పరుగుల స్కోరును సాధించింది. దీనికి ధీటుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 332 పరుగులతో అసీస్ పై 32 పరుగుల అధిపత్యం సంపాదించింది. ఇక మూడో రెజున అసీస్ రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించి.. వరుసగా వికెట్లను కోల్పోయింది. మూడో టెస్టులో శతకంతో రాణించిన మాక్స్ వెల్ నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్ లోనూ కాస్త పర్వాలేదనిపించాడు. అతను మినహా ఎవరు అకట్టుకోలేకపోయారు.

దీంతో అసీస్ అటగాళ్లంతా కేవలం 137 పరుగులకే పెవీలియన్ చేరిపోగా, భారత్ ముందు 105 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించారు. మంగళవారం 19 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో మ్యాచ్ ను ప్రారంభించిన టీమిండియా..  14వ ఓవర్లో 46 పరుగుల దగ్గర విజయ్(8) వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన పుజారా స్కోర్ ఓపెన్ చేయకుండానే రన్ అవుట్ గా వెనుదిరిగాడు. అనవసర పరుగుకోసం వెంపర్లాడి కీలకమైన వికెట్ ను జారవిడుదుచుకున్నారు. రాహుల్, పూజారా మధ్య సంయమనం లేకపోవడంతో ఈ వికెట్ ను టీమిండియా కోల్పోయింది. దీంతో బాల్ అందుకున్న మాక్స్ వెల్ బంతిని నేరుగా వికెట్లు విసరడంతో పుజారా డకౌట్ అయ్యాడు.

ఆ తరువాత క్రీజులోకి వచ్చిన స్టాండింగ్ కెప్టెన్ అజింక్య రహానే తన సత్తాను చాటాడు. క్రీజులోకి వచ్చి రావడంతోనే అప్పటికే కుదురుకున్న రాహుల్(52)తో కలసి నాలుగు ఫోర్లు, రెండు సిక్స్ లతో అసీస్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. ఈ క్రమంలో విజాయానికి కావాల్సిన 87 పరుగులను భారత్ జట్టు కేవలం 18 ఓవర్లలోనే ముగించింది. అసీస్ పై 8 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. కాగా రాహుల్ అర్థశతకంతో అదరగొట్టాడు. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. బోర్డర్ – గవాస్కర్ ట్రోపీ భారత్ సొంతమైంది.

స్కోర్ బోర్డు:

ఆసీస్ – 300 & 137

భారత్ – 330 & 107/2

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs australia  steve smith  ajinkya rahane  kl rahul  india  australia  Team India  bangalore  cricket  

Other Articles