యుఎస్ లో అగుడుపెట్టాలంటే.. వీసా వుంటే సరిపోదట.. Canadian citizen denied entry to U.S.

Canadian citizen denied entry to u s told she needed visa to get in

United States of America, Canada, Manpreet Kooner, canadian visa to u.s., canadian stopped at u.s. border, u.s. visa, Immigration visa

A Montrealer who is a Canadian citizen by birth says she was barred from entering the United States and told to get a valid visa if she ever wants to cross the border.

యుఎస్ లో అడుగు పెట్టాలంటే.. వీసా వుంటే సరిపోదట..

Posted: 03/09/2017 08:46 AM IST
Canadian citizen denied entry to u s told she needed visa to get in

అగ్రరాజ్యం అధికారికంగా ఆరు ఇస్లామిక్ దేశస్థులను తమ అమెరికా రాజ్యంలోనికి రాకుండా నిషేధం విధించినా.. అధికారుల తీరును పరిశీలించి చూస్తే మాత్రం అసలు దేశంలోకి ఏ ఒక్క ఇస్లామిక్ వ్యక్తి అడుగు పెట్టనీయకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కనబడుతుంది. ఇక మరోలా చెప్పాలంటూ నిషేధం కొంతవరకే పరమితం అయినా.. అదేశాలు మాత్రం చాలా వరకు అమలు అవుతున్నాయని తెలుస్తుంది. ఈ మేరకు భారత సంతతికి చెందిన కెనడియన్‌ మహిళకు అమెరికాలో ఎదురైన సంఘటనలే ఉదాహరణగా నిలుస్తున్నాయి.

కనడియన్ ఇండియన్ మహిళను అగ్రరాజ్యంలో అడుగుపెట్టేందుకు చిక్కులు ఎదురయ్యాయి. ఆమె సరిహద్దును దాటి అమెరికాలో అడుగుపెట్టాలంటే ఇమ్మిగ్రెంట్‌ వీసా కావాలంటూ అమెరికా అధికారులు అడ్డు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. మన్‌ప్రీత్‌ కైనర్‌ అనే మహిళ కెనడాలోని మాంట్రియల్‌ నగరంలో ఉంటోంది. ఇటీవల తాను అమెరికా వెళ్లాల్సి వచ్చి క్యూబెక్‌-వెర్మాంట్‌ సరిహద్దు వద్ద గల ప్రత్యేక తనిఖీ విభాగానికి చేరుకుంది. అక్కడే ఆమెను ఆరు గంటలపాటు ఎదురుచూసేలా చేశారు. వేలిముద్రలు, ఫొటోలు తీయడం, ప్రశ్నించడంలాంటి చర్యలు చేశారు.

ఇదంతా పూర్తయ్యాక ఆమెను అమెరికాలోకి అనుమతిస్తారనుకుంటే చివరి నిమిషంలో ఇమ్మిగ్రేషన్‌ వీసా ఉందా అని ప్రశ్నించి ఆమెను తిరస్కరించారు. ‘నేను ఇది నమ్మలేకపోతున్నాను. అమెరికాలోకి అడుగుపెట్టకుండా నన్ను తిరస్కరించారు. అమెరికాలోకి అడుగుపెట్టేందుకు నాకు వీసా ఉన్నప్పటికీ ఇమ్మిగ్రెంట్‌ వీసా కావాలంటూ అడ్డుకున్నారు. అది లేకుంటే నేను అమెరికాలో అడుగుపెట్టలేనని చెప్పారు. నేను వారికి ఒక వలసదారినిగా కనిపించాను’  అని ఆవేదన వ్యక్తం చేస్తూ ఫేస్‌బుక్‌ పేజీలో ఆమె రాసుకొచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles