చార్జీల మోతపై వెనక్కు తగ్గమంటున్న బ్యాంకులు SBI justifies penalty on issue of minimum balance

Sbi justifies penalty on issue of minimum balance says need money to manage jan dhan accounts

Arundhati Bhattacharya, State Bank Of India, minimum balance requirement, minimum balance penalty, Jan Dhan accounts, ATM transactions, bank transactions

The State Bank of India justified its move saying the bank needs to impose some charges to balance the "burden" of managing a large number of no-frills Jan Dhan accounts.

చార్జీల మోతపై వెనక్కు తగ్గమంటున్న బ్యాంకులు

Posted: 03/09/2017 07:50 AM IST
Sbi justifies penalty on issue of minimum balance says need money to manage jan dhan accounts

ఎస్బీఐ తాజాగా మార్చిన నిబంధనల విషయంలో యు టార్న్ తీసుకునే ప్రసక్తే లేదని అ బ్యాంకు వర్గాలు తేల్చిచెప్పాయి. బ్యాంకు ట్రాన్స్ యాక్షన్స్ నాలుగు పర్యాయాలకు మించినా.. లేదా  బ్యాంకు అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ లేకుపోయినా విధించే ఛార్జీల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య తేల్చి చెప్పారు. బ్యాంకు అకౌంట్ల నిర్వహణ బారంగా మారిన పరిణామాల నేపథ్యంలోనే తాము ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.

జీరో బాలెన్స్. ఇతర ఖాతాల నగదు లావాదేవీలతో బ్యాంకులతో ఖర్చు పెరుగుతోందని.. అందుకే చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించామన్నారు. SBIలో 11 కోట్ల జన్ ధన్ అకౌంట్లు ఉన్నాయని వాటిని మెంటేయిన్ చేయడానికి చాలా ఖర్చవుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి రూపాయలు లిమిట్ పెట్టామని, పట్టణాల్లో మాత్రమే 5 వేల రూపాయల లిమిట్ ఉండాలని చెప్పామన్నారు. నగదు నిల్వ తగినంత లేనప్పటికీ జన్‌ధన్‌ ఖాతాలకు మాత్రం ఆ జరిమానా వర్తించదని స్పష్టంచేశారామె.

సేవింగ్, కరెంట్ ఖాతాలలో తగినంత నగదు నిల్వ లేకపోతే ఏప్రిల్‌ 1 నుంచి భారీగా చార్జీ అమలు చేస్తామని ఇటీవల ఆ బ్యాంక్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో బ్యాంకులు ఖాతాదారులు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జన్ ధన్ ఖాతాలను మెయింటేన్ చేయడానికి తమకు జరిమానాలు విధించడం సమంజసం కాదని వారు అంటున్నారు. జన్ ధన్ అకౌంట్ల కోసం బ్యాంకులు కేంద్ర ప్రభుత్వం నుంచి మినహాయింపులు కోరాలి తప్ప తమను బలిపశువుల్ని చేయడం ఎంతవరకు సమంజసమని ప్నశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles