ఆదార్ తో నగదు పంపోచ్చు.. పుచ్చుకోనూవచ్చు India Post Payments Bank will send money via Aadhaar

India post payments bank will send money via aadhaar sans bank account linking

aadhaar, digital payments, india post payments bank, internet, finance ministry, arun jaitley, pm modi, mobile, business, industry, technology

India Post Payments Bank will be able to send and receive money through an Aadhaar and it won’t matter if it will be linked to a bank account or not

బ్యాంక్ అకౌంట్ లేకున్నా నగదు పంపోచ్చు.. ఎలాగంటే

Posted: 02/21/2017 06:45 PM IST
India post payments bank will send money via aadhaar sans bank account linking

బ్యాంక్ అకౌంట్ లేకుండా కేవ‌లం ఆధార్ నంబ‌ర్‌తోనే డ‌బ్బును ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డంతోపాటు పొందేందుకు కూడా వీలు క‌ల్పించేందుకు కృషి చేస్తోంది ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ నుంచి ఈ బ్యాంకులు అందుబాటులోకి వ‌స్తాయ‌ని ఇండియా పోస్ట్ సీఈఓ ఏపీ సింగ్ తెలిపారు. ఇండియా పోస్ట్ పే మెంట్స్ బ్యాంక్‌లు ప్రారంభ‌మైతే ఆధార్ నంబ‌ర్‌ను అనుసంధానం చేస్తామ‌ని దీంతో ఎక్క‌డికైనా డ‌బ్బును ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌డంతోపాటు డ‌బ్బును కూడా పొందే వీలుంటుంద‌ని ఆయ‌న చెప్పారు.

తొలి ద‌శ‌లో ఈ త‌ర‌హా బ్యాంకుల‌ను దేశ‌వ్యాప్తంగా 650 జిల్లాల్లో ప్రారంభిచ‌నున్న‌ట్లు ఏపీ సింగ్ చెప్పారు. ఇప్ప‌టికే UIDA పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని తీసుకుని ప్ర‌యోగం చేప‌ట్టింద‌ని ఆయ‌న తెలిపారు. మొత్తం 5 బ్యాంకుల అకౌంట్ల‌తో ఆధార్ నంబ‌ర్‌ను అనుసంధానం చేసి ప్ర‌యోగం చేసింద‌ని ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలు కూడా ఉన్న‌ట్లు ఏపీ సింగ్ వివ‌రించారు. ఈ ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైంద‌ని ఈ ఏడాది సెప్టెంబ‌ర్ నుంచి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుల‌కు వ‌ర్తింప‌జేస్తామ‌న్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aadhaar  digital payments  india post payments bank  internet  finance ministry  pm modi  

Other Articles