నిరుద్యోగ ర్యాలీ నిర్వహణలో మాదే విజయం: కోదండరామ్ Kodandaram Over HC Judgement On TJAC's Unemployment Rally

Kodandaram slams telangana government police on tjac s unemployment rally

kodandaram, tjac chairman kodandaram, tjac kodandaram, high court, high court judgement, kodandaram on unemployment, unempoyement in telangana, unemployed rally, tjac, kodandaram, unemployed youth, telangana government, police, high court, petition

Telangana Jac chairman Kodandaram slams telangana government and police On Unemployment Rally for not allocating the prescribed grounds.

ITEMVIDEOS: నిరుద్యోగ ర్యాలీ నిర్వహణలో మాదే విజయం: కోదండరామ్

Posted: 02/21/2017 05:51 PM IST
Kodandaram slams telangana government police on tjac s unemployment rally

నిరుద్యోగ ర్యాలీ నిర్వహణకు రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇవ్వగా దానిని టీజేఏసీ ఉపసంహారించుకుంది. నాగోల్‌లోని మెట్రో గ్రౌండ్‌లో తెలంగాణ జేఏసీ నిరుద్యోగుల నిరసన సభను నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేయడంతో పాటు.. ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నాం 3గంటల వరకు సభ నిర్వహించుకోవచ్చని అనుమితని ఇవ్వడంతో.. కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన టీజేఏసీ తమ పిటీషన్ ను ఉపసంహరించుకుంది.

తెలంగాణలో వున్న నిరుద్యోగుల కోసం నిరసన సభ నిర్వహించేదే మొత్తం తెలంగాణ సమాజానికి తెలియాలని, అందుకే హైదరాబాద్‌ నడిబొడ్డున సభ నిర్వహించాలనుకుంటే తమకు శివారు ప్రాంతాల్లో అనుమతి ఇవ్వడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీ జేఏసీ తమ పిటిషన్‌ను వెనక్కి ఉపసంహకరించుకుంది. తాము మాత్రం నాగోల్‌ మెట్రో గ్రౌండ్‌లో సభను నిర్వహించబోమని టీ జేఏసీ తేల్చిచెప్పింది. ఈ సభ నిర్వహణ కోసం హైకోర్టులో జరిగిన వాదోపవాదాలను టీజేఏసీ తరుపు న్యాయవాదులు వినిపిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో అర్ధం కావడం లేదని అన్నారు.

న్యాయస్థానం, ప్రభుత్వం విధించిన అన్ని షరతులను తాము అంగీకరించామని, జల్లికట్టుతో నిరుద్యోగ నిరసన ర్యాలీని పోల్చారని మొత్తానికి ప్రజాస్వామ్య బద్ధమైన డిమాండ్‌ను, హక్కులను తెలంగాణ ప్రభుత్వం అణిచివేసిన పరిస్థితి కనిపిస్తుందని అన్నారు. ఫంక్షన్‌హాలులో సమావేశాలు నిర్వహించుకోండని చెప్తున్నారంటే ఎంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు.

యోగ్యంకాని.. సౌకర్యాలు లేని నాగోలు గ్రౌండ్ లో సభ ఎలా నిర్వహిస్తామని ప్రశ్నించారు జేఏసీ చైర్మన్ కోదండరాం. చివరి నిమిషంలో మార్చుకోవటం సాధ్యం కాదన్నారు. ఎల్బీ స్టేడియం, ఉస్మానియా కాలేజీ, నిజాం గ్రౌండ్ లో అనుమతి ఇవ్వటానికి ఏం అభ్యంతరం అని నిలదీశారు. విద్యార్థుల ర్యాలీలో తీవ్రవాదులు చొరబడే ప్రమాదం ఉందని చెప్పటం చూస్తుంటే.. అణచివేత దోరణి ఏ విధంగా ఉందో తెలుస్తుందన్నారు. ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తుందన్నారు.

సుందరయ్య విజ్ణాన కేంద్రం నుంచి ఇందిరాపార్క్ వరకు ర్యాలీకి కూడా అనుమతి లేదని చెప్పటాన్ని తప్పుబట్టారు. ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వానికి పెట్టిన ఐదు డిమాండ్లపైనా ఎలాంటి స్పందన లేదన్నారు. చర్చకు ఓకే అంటే నిరసన విరమణకు అభ్యంతరం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 600 మందిని అరెస్ట్ చేశారని.. వాళ్లందరూ ఎక్కడికక్కడే శాంతియుత నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు కోదండరాం. నిరసన అనేది రాజ్యాంగ హక్కు అని.. ఏదో విధంగా చేసి తీరతాం అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tjac  kodandaram  unemployed youth  telangana government  police  high court  petition  

Other Articles