చెన్నై జైలుకు నన్ను తరలించలేరా.? మేనల్లుడితో శశికళ Sasikala wants Dinakaran to get her transferred to TN

Sasikala wants dinakaran to get her transferred to tn

Tamil Nadu, chief minister, palanisamy, VK Sasikala, T.T.V. Dinakaran, disproportionate case, Parappana Agrahara Central Prison, stalin, Bengaluru, O.Panneerselvam, madras high court, bengaluru, tamil politics

Newly appointed AIADMK deputy general secretary, T.T.V. Dinakaran arrived at the Parappana Agrahara Central Prison in Bengaluru to meet his aunt Sasikala.

మేనల్లుడితో రెండుగంటల పాటు శశికళ మంతనాలు..

Posted: 02/21/2017 01:12 PM IST
Sasikala wants dinakaran to get her transferred to tn

తమిళనాడు స్వర్గీయ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ.. బెంగళూరు పరప్పన అగ్రహార కేంద్రీయ జైలులో ఖైదీగా శిక్షననుభవిస్తున్న నేపథ్యంలో అమెను బెంగళూరు నుంచి చెన్నైకు మార్చాలని కోరుకుంటున్నారు. చెన్నైలోని పజల్ సెంట్రల్ జైలుకు తనను తరలించాలని అమె కోరుతున్నారు. ఈ మేరకు అమె తరపున న్యాయవాదులు కర్ణాటక ప్రభుత్వానికి పిటీషన్ దాఖలు చేశారు.

ఈ నేపథ్యంలో ఆమె మేనల్లుడు, అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్ జైల్లో శశికళతో భేటీ కావడంతో తనను చెన్నై జైలుకు తరలించడంలో అలస్యమెందుకు జరుగుతుందని అన మేనల్లుడిని ఆరా తీశారని సమాచారం. కాగా, వీరిద్దరు మధ్య సుమారు రెండు గంటల సమావేశం జరిగిందని, ఈ రహస్య భేటీలో పలు కీలక విషయాలు చర్చకొచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా చిన్నమ్మ తన అనుచరుడు, తమిళనాడు సీఎం పళనిస్వామికి కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసినట్లు సమాచారం.

జైల్లో ఉన్నా అన్ని విషయాలు తనతో సంప్రదించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని దినకరన్‌కు శశికళ సూచించారట. దాదాపు రెండు గంటల పాటు ఈ భేటీ జరిగింది. తనను చెన్నై జైలుకు మార్చేందుకు ఉన్న అవకాశాలపై కూడా దినకరన్‌కు శశికళ కొన్ని సూచనలు చేశారు. ఇదిలా ఉంటే ఇవాళ శశికళతో తమిళనాడు విద్యాశాఖ మంత్రి కెఎస్ సెంగొట్టయన్, అటవీ శాఖ మంత్రి శ్రీనివాసన్ కూడా భేటీ కానున్నట్లు తెలిసింది. ఇక చెన్నై జైలుకు తరలించడంపై శశికళ న్యాయవాదుల అభ్యర్థనపై లీగల్‌ ఆప్షన్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం.

మరోవైపు న్యాయనిపుణులు మాత్రం శశికళను చెన్నై జైలుకు మార్చే అవకాశాలు తక్కువ అని అభిప్రాయపడుతున్నారు. 'శశికళ కేసు భిన్నమైనది. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు ఆమె కర్ణాటక జైలులో ఖైదీగా ఉన్నారు. సుప్రీంకోర్టు అనుమతి ఉంటే తప్ప ఆమెను మరో జైలుకు మార్చడం కుదరదు. సుప్రీంకోర్టుకు తెలియజేయకుంటే జైలు మార్పు ప్రక్రియ చేపడితే.. దీనిని సుప్రీంకోర్టు రద్దు చేసే అవకాశముంది' అని అక్రమాస్తుల కేసులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బీవీ ఆచార్య తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : VK Sasikala  Palanisamy  Parappana Agrahara Central Prison  dinakaran  AIADMK  tamilnadu  

Other Articles