మళ్లీ వెయ్యి రూపాయల నోట్లు వచ్చేస్తున్నాయహో..! RBI to introduce new Rs 1,000 notes, printing already underway

Rbi to introduce new rs 1 000 notes printing already underway

new rs 1ooo note, rs 1000 note, rs 2000 note, rbi, demonetisation, RBI Governor Urjit Patel, finance ministry, arun jaitley, shaktikanth das, pm modi, january, 1000 rupee note, new series of 1000 rupee notes, rbi, Reserve Bank of India,

The Reserve Bank of India (RBI) may introduce a new series of Rs 1,000 notes, to replace the earlier notes of similar denomination that were demonetised on November 8.

మళ్లీ వెయ్యి రూపాయల నోట్లు వచ్చేస్తున్నాయహో..!

Posted: 02/21/2017 11:56 AM IST
Rbi to introduce new rs 1 000 notes printing already underway

శీర్షిక చూడగానే నమ్మశక్యంగా లేదు కదూ. పెద్ద నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వం ఒక్కో తరుణంలో ఒక్కో ప్రకటన చేసిన దరిమిలా.. వారికే స్పష్టంత లేదని విమర్శలు వస్తున్న తరునంలో మరోమారు మళ్లీ రద్దైన పెద్దనోటు దేశప్రజలకు అందుబాటులోకి రానుంది. పెద్ద నోట్ల రద్దు తరుణంలో కొత్తగా డిజైన్ చేసిన పెద్ద నోట్లు ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఒకసారి, అలాంటిదేమీ లేదని మరోసారి కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ప్రకటనలు వెలువడిన నేపథ్యంలో అసలు వస్తాయో.. రావో అన్న అనుమానాలు దేశ ప్రజల్లో కలిగాయి. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం కొత్తగా రూపుదిద్దుకున్న వెయ్యి రూపాయల నోటు ప్రజలకు అందుబాటులోకి రానుంది.

దేశంలోని అవినీతి, నల్లధనాన్ని అణచివేసేందుకు పాత పెద్ద నోట్లు రూ. ఐదు వందలు, రూ. వెయి నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ గత ఏడాది నవంబర్ ఎనమిదిన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే వాటిస్థానంలో కొత్తగా రూ. 2వేలు, రూ. 500 నోట్లను ప్రవేశపెట్టారు. ఇప్పుడు కొత్తగా రూ. వెయ్యినోట్లను కూడా మళ్లీ ప్రవేశపెట్టే అవకాశముందని తెలుస్తోంది. కొత్త సిరీస్‌ వెయ్యినోట్లను ప్రవేశపెట్టడానికి భారత రిజర్వు బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నాయని, ఈ కసరత్తు తుదిదశకు చేరుకున్నదని ఓ జాతీయ పత్రికకు కేంద్ర ఆర్థికశాఖ అధికారిని ఉటంకిస్తూ పేర్కొన్నది.

ఇప్పటికే రూ. వెయ్యినోట్ల ముద్రణ ప్రక్రియను ఆర్బీఐ ప్రారంభించిందని, అయితే ఎప్పటిలోగా మార్కెట్లోకి ఇవి రానున్నాయన్నది కచ్చితంగా తెలియదని పేర్కొంది. రూ. రెండు వేల లావాదేవీలు సక్రమంగా జరిగేందుకు వీలుగా వుండేందుకు, రద్దైన పాత నోట్ల లోటును భర్తీ చేయడానికి కొత్తగా రూ. వెయ్యి నోట్లను ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ కొత్త వెయ్యి రూపాయల నోట్లు గత జనవరిలోనే మార్కెట్లోకి రానున్నాయని ప్రచారం జరిగగా, అనివార్యకారణాల వల్ల నిలిచిపోయింది.

అయితే, రెండు వేల రూపాయల నోటుకు మార్కెట్‌లో తగినంత చిల్లర లభించిక అనేక సమస్యలు ఎదురవుతుండటంతో మొదట రూ. ఐదు వందల నోట్లను ముద్రణకు ప్రాధాన్యం ఇవ్వడంతో కొత్త రూ. వెయ్యి నోట్ల రాక ఆగిపోయిందని అంటున్నారు. గత ఏడాది నవంబర్‌ ఎనమిదిన పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో వాటి స్థానంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన కోత్త రెండు వేల రూపాయల, ఐదు వందల రూపాయల నోట్లు తొమ్మిది లక్షల తొంబై రెండు వేల కోట్ల రూపాయలను ప్రజల అందుబాటుకోసం చలామణిలోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.

 

అంతా ఉత్తదే.. ఆర్థిక శాఖ

కొత్త వెయ్యి నోటు వార్తల నేపథ్యంలో ఆర్థిక శాఖ స్పందించింది. అలాంటి ఆలోచనేం లేదని తేల్చేసింది. వెయ్యి నోట్లను ప్రింట్ చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ దృష్టిలో లేదన్నవిషయాన్ని తాజాగా ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ తేల్చేశారు. కొత్తగా వెయ్యి రూపాయిల్ని ప్రభుత్వం తీసుకొస్తుందంటూ సాగుతున్న ప్రచారంలో అర్థం లేదన్న ఆయన..అది ఉత్త పుకారేనని తేల్చేశాడు.


ప్రస్తుతం రూ.500 నోట్లు.. ఇతర చిన్న నోట్లను సరిపడా ముద్రించటంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిన విషయాన్ని వెల్లడించిన ఆయన.. కొన్నిఏటీఎంలలో నగదు కొరత ఉందన్న ఫిర్యాదులు వస్తున్నాయని.. అవసరమైన మేరకే ప్రజలు నగదును విత్ డ్రా చేసుకోవాలన్న సూచన చేయటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : new rs 1ooo note  rs 1000 note  rs 2000 note  rbi  demonetisation  RBI Governor Urjit Patel  

Other Articles