పవన్ ట్వీట్ చేసిన ఆ ‘అనంతపురం నేత’ ఎవరు? Pawan Kalyan tweets about Tarimela Nagireddy.

Pawan kalyan tweets about tarimela nagireddy

Janasena Pawan Kalyan, Janasena Communist Leader, Janasena Hand Loom Satyagraha, Chenetha Satyagraha Sabha, Pawan kalyan Tarimela Nagireddy, Tarimela Nagireddy aka TN, Tarimela Nagireddy Birthday Celebrations, Pawan kalyan Communist, Pawan kalyan Salute, Tarimela Nagireddy Pawan kalyan, Chenetha Satyagraha Sabha Pawan Kalyan, Chenetha Satyagraha Sabha Janasena, Pawan Speech at Chenetha Satyagraha Sabha

Janasena President Pawan Kalyan tweets about Communist leader Tarimela Nagireddy hundred year birthday celevrations.

పవన్ ట్వీట్ చేసింది ఎవరి గురించి?

Posted: 02/20/2017 08:13 AM IST
Pawan kalyan tweets about tarimela nagireddy

టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం తన ట్విట్టర్ లో చేసిన ట్వీట్లు ఆసక్తికర చర్చకు దారితీశాయి. తన తండ్రి స్వతహాగా వామపక్ష భావజాలాలు ఉన్న వ్యక్తి కావటంతో చిన్నప్పటి నుంచే తాను వాటికి ప్రభావితుడిని పవన్ తరచూ పలుసార్లు చెప్పటం మనం చూశాం. ఈ క్రమంలో తరచూ కామ్రేడ్ పార్టీ నేతలతో సమావేశం అయ్యే పవన్ ఓ కీలక నేతకు సంబంధించి తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు.

కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి శతజయంతి సందర్భంగా పవన్ ఆయన్ని గుర్తు చేసుకున్నారు. ఇది.. కామ్రేడ్ తరిమెళ్ల నాగిరెడ్డి శత జయంతి సంవత్సరం అని, ఈ సందర్భంగా చిన్నతనంలో జరిగిన ఓ విషయం తనకు గుర్తుకు వస్తోందని చెప్పుకొచ్చాడు. తాను ఇంటర్మీడియట్ చదువుతుండగా, నాగిరెడ్డి రచించిన ‘తాకట్టులో భారతదేశం’ అనే పుస్తకాన్ని తన తండ్రి తనకు ఇచ్చారని, అయితే, ఆ పుస్తకంలో నాగిరెడ్డి ఆలోచనలు, లోతైన అధ్యయనం, గంభీరత ఉండటంతో ఆ వయసులో తాను గ్రహించలేకపోయానని, ఆ పుస్తకంలో రాసిన వాక్యాలు ఇప్పటి పరిస్థితులకు సరిపోతాయని అన్నారు.

మద్రాస్ లెజిస్టేటివ్ లో ఎంపీగా ఒకసారి, ఎమ్మెల్యేగా నాలుగు సార్లు నాగిరెడ్డి పని చేశారని, భూమి లేని నిరుపేదల కోసం వెయ్యి ఎకరాలను ఆయన దానం చేశారని, అంత గొప్ప వ్యక్తికి తలవంచి నమస్కరిస్తున్నానని ఆ ట్వీట్ లో పవన్ పేర్కొన్నారు. 1917 ఫిబ్రవరి 11న అనంతలో జన్మించిన నాగిరెడ్డి అలియాస్ టీఎన్ మచ్చ లేని నేతగా తన రాజకీయ ప్రస్థానం కొనసాగించాడంటూ ప్రశంసలు కురిపించాడు కూడా. ఇక ఇదిలా ఉంటే చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గుంటూరు - విజయవాడ మధ్య మంగళగిరిలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సోమవారం చేనేత సంఘాలు నిర్వహిస్తున్న సత్యాగ్రహం కార్యక్రమంలో పవన్ పాల్గొనబోతున్నాడు. చేనేత ఐక్య గర్జన పేరుతో చేపట్టిన సత్యాగ్రహంలో మధ్యాహ్నం 3 గంటల కు పవన్ ప్రసంగించనున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chenetha Satyagraha Sabha  Pawan kalyan  Tarimela Nagireddy  

Other Articles