రిసార్టు రాజకీయం.. తమిళనాడు నుంచి నాగాలాండ్ కు..! Nagaland CM TR Zeliang Decides To Quit Amid Political Crisis

Nagaland cm tr zeliang decides to quit amid political crisis

TR Zeliang, Nagaland Chief Minister, Nagaland Chief minister quits, Nagaland CM, Nagaland Chief Minister TR Zeliang, Zeliang quits, Zeliang, TR Zeliang

Nagaland Chief Minister T R Zeliang has announced that he is going to quit from the position of top post amid political crisis

రిసార్టు రాజకీయం.. తమిళనాడు నుంచి నాగాలాండ్ కు..!

Posted: 02/19/2017 05:11 PM IST
Nagaland cm tr zeliang decides to quit amid political crisis

తమిళనాడు రిసార్టు రాజకీయాలు ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌ కు పాకాయి. ముఖ్యమంత్రి టి.ఆర్‌. జెలియాంగ్‌ పై అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్)కు చెందిన 40 ఎమ్మెల్యేలు బుధవారం తిరుగుబాటు చేశారు. వీరిని అసోంలోని కాజీరంగా ప్రాంతంలో ఉన్న విలాసవంతమైన రిసార్టుకు తరలించారు. దీంతో నాగాలాండ్‌ లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఎన్‌పీఎఫ్ పార్టీ అధ్యక్షుడు షుర్‌ హోజెలీ లీజీట్సు ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి.

గవర్నర్‌ ఆచార్యతో కలిసి సీఎం జెలియాంగ్‌ ఢిల్లీ వెళ్లారు. వీరిద్దరూ పీఎంఓ మంత్రి జితేంద్ర సింగ్, బీజేపీ నేత రాంమాధవ్, ఎంపీ, మాజీ సీఎం నైపూ రియోతో సమావేశమయ్యారు. గవర్నర్‌ ఢిల్లీ నుంచి రాగానే పరిస్థితులు లీజీట్సు కు ప్రతికూలంగా మారాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేలు మనసు మార్చుకుని  నైపూ రియోకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. జెలియాంగ్‌ కంటే ముందు నాగాలాండ్‌ సీఎంగా నైపూ రియో పనిచేశారు.

2014 లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో ఆయన సీఎం పదవిని వదులుకున్నారు. మున్సిపల్‌ ఎన్నికల వ్యవహారంలో ప్రభుత్వానికి, నాగా గిరిజనులకు మధ్య వివాదం నడుస్తుండడంతో గత కొద్ది రోజులుగా హింసాత్మక ఘటనలతో నాగాలండ్‌ అట్టుడుకుతోంది. జెలియాంగ్‌ రాజీనామా చేయాలని నాగాలాండ్‌ ట్రైబల్‌ యాక్షన్‌ కమిటీ(ఎన్ టీఏసీ) గట్టిగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ సంక్షోభం తలెత్తింది. 60 అసెంబ్లీ స్థానాలున్న నాగాలాండ్‌ అసెంబ్లీలో ఎన్‌పీఎఫ్ కు 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles