మరో ట్విస్ట్: మళ్లీ వేడెక్కుతున్న తమిళనాట రాజకీయాలు.. FIR against Stalin for unlawful assembly

Fir registered against dmk working president mk stalin

tamil nadu, palnisamy, paneer selvam, Dharma yudhdam, pandyarajan, sasikala, chief minister, dhanpak, TN assembly speaker, vidyasagar rao, cabinet minister, stalin, dmk, aiadmk, congress, tamil nadu politics

An FIR was registered against Dravida Munnetra Kazhagam (DMK) working president MK Stalin on Sunday.

మరో ట్విస్ట్: మళ్లీ వేడెక్కుతున్న తమిళనాట రాజకీయాలు..

Posted: 02/19/2017 11:55 AM IST
Fir registered against dmk working president mk stalin

తమిళనాడులో మళ్లీ రాజకీయం వేడెక్కింది. జయలలిత మరణంతో ఖాళీ అయిన పార్టీ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి స్థానాలను దక్కించుకోవడానికి పన్నీరు సెల్వం వర్గం, పళనిస్వామి వర్గం మధ్య తీవ్ర ఉత్కంఠకు తెరపడుతూ పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం, విశ్వాస పరీక్ష నెగ్గిడం అంతా చకచక జరిగిపోయాయి, ఈ తరుణంలో అసెంబ్లీలో డీఎంకే పక్ష నేత స్టాలిన్ ఓ అడుగుముందుకేసి మరీ విశ్వాసపరీక్షను వాయిదా వేయాలని, రహస్య ఓటింగ్ చేపట్టాలని పట్టబట్టిన నేపథ్యంలో ఇక అక్కడ మళ్లీ అధికార, విపక్షాల మధ్య రాజకీయ రగడ రాజుకుంది.

పళనిస్వామి అధికారం చేపట్టి 24 గంటలు కూడా గడవకముందే చెన్నై పోలీసులు డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్‌పై కేసు నమోదు చేయడంతో ఇక శాంతి నెలకొంటుందని భావించిన తరుణంలో మరోమారు రాజకీయ వేడి రాజకుంది. అసెంబ్లీ నుంచి రాజ్ భవన్ కు వెళ్లి అక్కడి నుంచి నేరుగా పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మెరీనా బీచ్‌లోని గాంధీ విగ్రహం ముందు ఆందోళన నిర్వహించినందుకు గాను ఆయనపై కేసు నమోదు చేశారు, అయితే అందోళన చేయడమే కాకుండా మెరినీ బీచ్ వద్ద నానా రచ్చచేసినందుకు ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు అక్కడి పోలీసులు  తెలిపారు.

డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌కు శాసనసభలో అవమానం జరిగిందన్న సమాచారం తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. చిరిగిన చొక్కాతో స్టాలిన్‌ మీడియా ముందుకు రావడాన్ని చూసి డీఎంకే శ్రేణులు తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలతో ఆందోళనలు చేపట్టాయి. నిరసనలు మిన్నంటాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించారు. ఎక్కడికక్కడ రాస్తారోకోలు, ధర్నాలకు దిగడంతో వాతావరణం వేడెక్కింది. చెన్నై, మదురై, కోయంబత్తూరు, ఈరోడ్, నామక్కల్, తిరునల్వేలి, తిరుచ్చిల్లో భారీ ఎత్తున నిరసనలు రాజుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా హైఅలెర్ట్‌ ప్రకటించారు.

మరోపక్క, అసెంబ్లీ నుంచి నేరుగా ఎనిమిదిమంది ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన స్టాలిన్‌ అసెంబ్లీలో తనకు జరిగిన అవమానం, మార్షల్స్‌ దురుసుతనం గురించి గవర్నర్‌కు ఫిర్యాదు చేసి మెరీనా తీరంలోని గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యేలు, పార్టీ ఎంపీలతో కలిసి స్టాలిన్‌ నిరసన చేపట్టారు. దీనికి మద్దతుగా జల్లికట్టు తరహాలో జనాలు రావడంతో బుజ్జగించిన పోలీసులు ఆయనను అరెస్టు చేయకుండా పంపించేశారు. అనూహ్య గందరగోళానికి తెరతీసిన స్టాలిన్‌పై తాజాగా పోలీసులు కేసు నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles