పళనిస్వామి ప్రభుత్వంపై ‘నాయకుడు’ సంచలన వ్యాఖ్యలు Tamil Nadu Government Like A 'Criminal Conglomerate': Kamal Haasan

Tamil nadu government like a criminal conglomerate kamal haasan

tamil nadu, kamal haasan, palnisamy, paneer selvam, sasikala, chief minister, stalin, dmk, aiadmk, congress, tamil nadu politics

Chief Minister Edappadi Palaniswami may have won the vote of confidence in the Tamil Nadu Assembly, but Kamal Haasan, one of the biggest stars of the South, said it's not an outcome he accepts. "The emotion(s) on streets denote something else,"

పళనిస్వామి ప్రభుత్వంపై ‘నాయకుడు’ సంచలన వ్యాఖ్యలు

Posted: 02/19/2017 12:42 PM IST
Tamil nadu government like a criminal conglomerate kamal haasan

తమిళనాడులో శశికళ వర్గంగా వున్న పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం, విశ్వాస పరీక్ష నెగ్గిన నేపథ్యంలో వారికి మాత్రం ఆ ఆనందాన్ని దూరం చేస్తున్నారు అక్కడి సెలబ్రిటీలు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే సినీతారాలు. ఇప్పటికే కొందరు సినీప్రముఖులు వారి అసంతృప్తిని బహిరంగంగానే చాటుకున్న తరుణంలో హీరో కమల్ హాసన్ మాత్రం మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నేరస్తుల కూటమికి నేటి తమిళ ప్రభుత్వానికి పెద్ద తేడా ఏమీ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు అసెంబ్లీని శుభ్రం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్నాడీఎంకే తాత్కాళిక చీఫ్‌ వీకే శశికళ కుటుంబాన్ని ఉద్దేశిస్తూ క్రిమినల్‌ కూటమంతా ఒక చోట చేరిందని మండిపడ్డారు. శశికళ వర్గం నుంచి పళనిస్వామి ముఖ్యమంత్రిగా ఎన్నికవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఊహించినట్లుగా జరగలేదని అన్నారు.

‘నిజమేమిటో కోర్టు పదేపదే తేల్చి చెప్పింది. శశికళే కాదు.. చనిపోయిన జయలలిత కూడా అక్రమాస్తుల కేసులో దోషి అని స్పష్టం చేసింది. తమిళనాడు అసెంబ్లీని ఫ్లోర్‌ను శుభ్రం చేయాల్సి ఉంది. ప్రజల వద్దకు ఎన్నికలు తీసుకెళ్లండి. వారి మనసులో ఏముందో చెప్తారు. నేను చాలా కోపస్తుడిని. నేను రాజకీయాలకు సరిపోను. కోపంతో ఉండే వ్యక్తులు రాజకీయాలకు అవసరం లేదు. రాజకీయ నాయకులంటే గొప్ప సమతౌల్యం పాటించేవారిగా ఉండాలి. ఇప్పుడు నేను చాలా కోపంతో ఉన్నాను. నాలాగా చాలామంది ప్రజలు కోపంతో ఉన్నారు’  అని కమల్‌ చెప్పారు. ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles