తమిళనాడు అసెంబ్లీలో విధ్వంస పర్వం.. స్పీకర్ ఘెరావ్ TN Speaker walks out, Assembly adjourned till 1 PM.

Tn speaker walks out assembly adjourned till 1 pm

tamil nadu, palnisamy, paneer selvam, sasikala, chief minister, dhanpak, TN assembly speaker, vidyasagar rao, cabinet minister, stalin, dmk, aiadmk, congress, tamil nadu politics

Amid ruckus, Speaker walks out and Assembly is adjourned till 1 PM. DMK MLA Ku Ka Selvam sat on Speaker's chair in protest. DMK MLAs tear paper, break chairs and speaker’s microphone in the Assembly demanding secret ballot.

తమిళనాడు అసెంబ్లీలో విధ్వంస పర్వం.. స్పీకర్ ఘెరావ్

Posted: 02/18/2017 12:25 PM IST
Tn speaker walks out assembly adjourned till 1 pm

తమిళనాడు అసెంబ్లీలో అన్నాడీఎంకే పక్ష నేతగా ఎన్నికై ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పళనిస్వామి ప్రభుత్వం విశ్వాసపరీక్షను ఎదుర్కోనేందుకు ఇవాళ అసెంబ్లీ సమావేశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయగా సభలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర గంధరగోళం ఏర్పడింది. రాజ్యంగ విరుద్దంగా ఎమ్మెల్యేలను రిసార్టులో దాచి.. వారిని నేరుగా ఓటింగ్ కు తీసుకురావడంతో అసెంబ్లీలో అధికార పక్షం విశ్వాస పరీక్షను రహస్య ఓటింగ్ పక్రియ ద్వారా చేపట్టాలని డిమాండ్ తో డిఎంకే సహా పన్నీరు సెల్వం వర్గం విధ్వంసానికి పాల్పడింది.

డీఎంకే ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్ద నినాదాలు చేశారు. అయినా స్పీకర్ వెనక్కు తగ్గకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేల నిరసనలు, నినాదాల మధ్య హెడ్ కౌంట్ ఓటింగ్ చేపట్టగా, డీఎంకే నేతలు, పన్నీరు వర్గీయులు మరింత రెచ్చిపోయారు. అసెంబ్లీలోని బల్లలను ఎత్తి విసిరి వేయడంతో పాటు నానా హంగామా చేశారు. ఢీఎంకే ఎమ్మెల్యే అరుణ ఏకంగా బల్లలపైకి ఎక్కి ప్రభుత్వానికి, స్పీకర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. రహస్య ఓటింగ్ నిర్వహించాలిన డిమాండ్ చేశారు.

అంతటితో ఆగని డీఎంకే ఎమ్మెల్యేలు తమ చేతుల్లోని అసెంబ్లీ ప్రతులను చించి స్పీకర్ పైకి విసిరివేశారు. స్పీకర్ పోడియం వద్ద చుట్టుముట్టిన ఎమ్మెల్యేలు అగ్రహంతో స్పీకర్ మైక్రోఫోన్ ను విరగొట్టారు.  డీఎంకే ఎమ్మెల్యే కుకా సెల్వం ఏకంగా స్పీకర్ కుర్చీలో కూర్చున్నారు. దీంతో విఫక్ష సభ్యుల నుంచి వస్తున్న తీవ్ర నిరసనలతో గంధరగోళం ఏర్పడిన కారణంగా సభను స్పీకర్ మద్యాహ్నం ఒంటిగంట వరకు వాయిదా వేశారు. అయితే అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య నెలకొన్న గందరగోళం కారణంగా ఓ మార్షల్ గాయపడ్డాడు. అతన్ని అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం అస్పత్రికి తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles