రహస్య ఓటింగ్ కు పన్నీరు, స్టాలిన్ పట్టు.. సభ వాయిదా..! OPS, Stalin demand for secret ballot, assembly adjourned

Ops stalin demand for secret ballot assembly adjourned

tamil nadu, palnisamy, paneer selvam, sasikala, chief minister, dhanpak, TN assembly speaker, vidyasagar rao, cabinet minister, stalin, dmk, aiadmk, congress, tamil nadu politics

Panneerselvam group and dmk floor leader Stalin demand secret ballot, Ruckus broke out in Tamil Nadu Assembly, for the key floor test on the confidence motion to be moved by Chief Minister Edappadi K Palanisamy been adjourned by 30 minutes

రహస్య ఓటింగ్ కు పన్నీరు, స్టాలిన్ పట్టు.. సభ వాయిదా..!

Posted: 02/18/2017 12:08 PM IST
Ops stalin demand for secret ballot assembly adjourned

తమిళనాడు అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర గంధరగోళం ఏర్పడటంతో సభను స్పీకర్ ధన్ పాల్ అరగంట పాటు వాయిదా వేశారు. పన్నీరు వర్గంతో పాటు ప్రధాన ప్రతిపక్షం డీఎంకే రహస్య ఓటింగ్ కు పట్టుబడుతుండటం.. దానిని తిరస్కరించిన స్పీకర్ హెడ్ కౌంట్ ద్వారా ఓటింగ్ కు అనుమతించడంతో దానిని అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేసని డీఎంకే యత్నాలు కొంతమేరకు ఫలించాయి. తీవ్ర గందదరోగల ంనేపథ్యంలో సభను అరగంట పాటు వాయిదా వేశారు స్పీకర్. రహస్య ఓటింగ్ జరిగితేనే ఎమ్మెల్యేలు తమ మనోభావాల మేరకు ఓటు వేయగలుగుతారని డీఎంకే, పన్నీరు వర్గం నేతలు చెబతున్నారు.

ఎమ్మెల్యేలను ఖైదీలను తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారని డీఎంకే స్టాలిన మండిపడ్డారు. బల పరీక్షకు 15 రోజుల గడువు ఉంటే... ఇంత హడావుడిగా ఓటింగ్ నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని స్టాలిన్ ప్రశ్నించారు.  సభలో చర్చను కొనసాగించి బలపరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. రహస్య ఓటింగ్ తోనే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. తమ పూర్తి మద్దతు పన్నీరు సెల్వం వర్గానికే వుందని స్టాలిన్ కుండబద్దలు కొట్టారు.

కాగా పన్నీరు సెల్వం కూడా ప్రభుత్వంపై స్వరం పెంచారు. ముందుగా తమిళనాడు ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవాలని.. ఆ తరువాతే బలపరీక్షను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలను ముందుగా వారి నియోజకవర్గాల్లో తిరగనివ్వాలని ఆ తరువాత వారిని విశ్వాసపరీక్షలో పాల్గోనేలా చూడాలని ఆయన సూచించారు. అయితే, అసెంబ్లీని వాయిదా వేయడానికి స్పీకర్ నిరాకరించారు. ఓటింగ్ ను ఆయన కొనసాగిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles