నడిరోడ్డుపై ఆర్మీ విమానం... ఫైలెట్ పరుగులు.. ఆపై ఏం జరిగిందంటే... Military helicopter lands on road to ask trucker for directions.

Helicopter pilot lands to ask for directions in kazakhstan

Military Helicopter video, Military Helicopter Road, Pilot Ask Directions, Military Helicopter Pilot, Pilot Weirdest Request, Helicopter Land Road, Kazakhstan Army, Kazakhstan Helicopter Video

Military pilot lands helicopter on a expressway to ask for directions in Kazakhstan.

ITEMVIDEOS:ఇలాంటి హెల్ప్ ఎవరైనా కోరతారా?

Posted: 02/17/2017 08:16 AM IST
Helicopter pilot lands to ask for directions in kazakhstan

సపోజ్ పర్ సపోజ్ మీరు ఏదైనా వాహనంలో హైవే మీద వెళ్తున్నారు. ఉన్నపళంగా మీకు దారి తెలియదు. అప్పుడు మీరేం చేస్తారు?. దారిన పోయే మరో వాహనాన్ని ఆపి సాయం కోరతారు కదా. కానీ, కజకిస్థాన్ లో సరిగ్గా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. కాకపోతే కాస్త వెరైటీగా...

గాల్లో ఎగరాల్సిన ఓ హెలికాప్టర్ హఠాత్తుగా రోడ్డు మీద వాలింది. కరబుతక్ నేషనల్ హైవేపై వరసగా లారీలు వాటి గమ్యస్థానానికి వెళ్తున్న సమయంలో... చుట్టూ మంచు దుప్పటి కప్పుకున్న దశలో.. కళ్లు చించుకున్నా కానరాని రోడ్డుపై.. మంచును చీల్చుకుంటూ ఓ ఆర్మీకి చెందిన ఎంఐ-80 హెలికాప్టర్‌ ఒకటి నడిరోడ్డుపై ల్యాండ్‌ అయింది.

 

ఏం జరిగిందా? అని లారీ డ్రైవర్లంతా ఆశ్చర్యానికి గురవుతున్న దశలో ఆ హెలికాప్టర్‌ నుంచి కిందికి దిగిన పైలట్‌.. నేరుగా ఓ లారీ డ్రైవర్‌ వద్దకు వచ్చి కరచాలనం చేశాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. పైలెట్ కు తను వెళ్లాల్సిన అడ్రస్ తెలియలేదట. దాంతో హెలికాప్టర్ ని ఉన్నపళంగా నడి రోడ్డు మీద ల్యాండ్ చేసి, దారీపోయే వాళ్లని అడ్రస్ వాకబు చేశాడు. అక్తుబిన్సిక్‌ నగరానికి ఎలా వెళ్లాలని దారి అడిగాడు. దీంతో ఆశ్చర్యపోయిన ఆ లారీ డ్రైవర్‌, అంతలోనే తేరుకుని ఎలా వెళ్లాలో సూచించాడు. అతని సూచనల మేరకు హెలికాప్టర్ తిరిగి గాల్లోకి లేచి పయనమైంది.

ఈ విచిత్రమైన ఘటనతో లారీ డ్రైవర్లు బిత్తరపోయారు. దీనిపై స్పందించిన కజికిస్ధాన్ రక్షణ శాఖ శిక్షణలో భాగంగా శిక్షణ పైలట్లకు గమ్యం చెప్పకుండా.. వెళ్లిన చోటును కనుక్కునేలా చేస్తామని, వారే గమ్యాన్ని కనుక్కుని చేరాల్సి ఉంటుందని తెలిపారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kazakhstan  Military Helicopter  Road  Directions  

Other Articles

Today on Telugu Wishesh