నెత్తురోడిన మసీదు.. సూసైడ్ ఎటాక్.. 100 మంది దుర్మరణం ఎవరి పనంటే... Blast rips through shrine in Pakistan 100 dead

100 killed in bombing at shahbaz qalandar shrine

Pakistan Suicide Blast, Sufi Shrine Blast, Lal Shahbaz Qalandar, 100 Killed Pakistan, Blast Rips, Shahbaz Qalandar Shrine Blast, Pak Suicide Blast, Pakistan Suicide Blast, Masid Blast

Pakistan Suicide Blast: Sufi shrine Lal Shahbaz Qalandar shrine attack kills 100; Twitter erupts in anger, shock.

మసీదులో బ్లాస్ట్... 100 మంది దుర్మరణం

Posted: 02/17/2017 07:32 AM IST
100 killed in bombing at shahbaz qalandar shrine

పాకిస్థాన్‌ లో మరో నరమేధం వంద మంది ప్రాణాలు బలిగొంది. గురువారం రాత్రి సింధ్‌ ప్రావిన్స్‌ సెహ్వాన్‌ లో ఉన్న సుప్రసిద్ధ లాల్‌ షాబాజ్‌ కలందర్‌ దర్గాలో ఆత్మాహుతి దాడి జరిగింది. సూఫీ తెగ వారు పవిత్రంగా భావించే ఈ దర్గాలో ప్రతి గురువారం ప్రార్ధనలు నిర్వహిస్తారు. ప్రార్థనల అనంతరం ధమాల్‌ (సూఫీ నృత్య వేడుక) కూడా నిర్వహిస్తారు. సరిగ్గా ఆ సందడిలో ఉన్న భక్తులు ఆనందపరవశులై ఉండగా, మందిర ప్రధాన ద్వారం గుండా లోపలికి ప్రవేశించిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాది తొలుత ఒక హ్యాండ్‌ గ్రెనేడ్‌ ను సూఫీ భక్తులపైకి విసిరాడు. అయితే అది పేలలేదు. దీంతో మరింత ఆగ్రహంతో ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో భారీ పేలుడు సంభవించింది.

అప్పటివరకు నృత్యాలతో సంతోషంగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా హాహాకారాలతో దద్దరిల్లిపోయింది. ఎటు చూసిన రక్తమోడుతూ రక్షించాలన్న ఆర్తనాదాలు వినిపించాయి. శరీర భాగాలు ఖండఖండాలుగా ఎగిరిపడ్డాయి. భారీ శబ్దంతో దర్గాలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు పరుగులు తీశారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు, స్థానికులు సహాయకచర్యలు చేపట్టారు. తొలుత వారు కూడా అక్కడి భీతావహ దృశ్యాలు చూసి బెంబేలెత్తిపోయారు. అయితే అక్కడి బాధితుల పరిస్థితి, ఆర్తనాదాలు విని చలించిపోయి సహాయకచర్యలు చేపట్టారు. ఈ ఘటనలో అందిన ప్రాధమిక సమాచారం ప్రకారం మృతుల్లో 12 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. 250 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఇక్కడికి 40-50 కిలోమీటర్ల వరకు ఒక్క ఆసుపత్రి కూడా లేకపోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగిందని స్థానిక అధికారులు తెలిపారు.

కాగా, సహాయక చర్యల కోసం సాయుధ దళాలను, సైన్యానికి చెందిన సి-130 విమానాన్ని, నేవీ హెలికాప్టర్‌ ను రంగంలోకి దించినట్టు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తెలిపారు. ఘటనాస్థలిలో అత్యవసర చికిత్సలందించేందుకు జమ్‌ షోరో, నవాబ్‌ షా, హైదరాబాద్‌ ల నుంచి వైద్యులను రంగంలోకి దించినట్టు కూడా ఆయన వెల్లడించారు. కాగా, ఈ బాంబుదాడి చేసింది తమ సైనికుడేనని ఐఎస్ఐఎస్ ప్రకటించింది. దీంతో సింధ్ ప్రావిన్స్‌లోని అన్ని ప్రార్థనా మందిరాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. కాగా, దాడిని ఐక్యరాజ్యసమితితో సహా పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  Suicide Blast  100 Killed  

Other Articles

  • Bjp member arrested near thrissur for printing fake currency

    నకిలీ నోట్లను ముద్రించిన బీజేపి నేత.. ప్రధాని లక్ష్యాలకు తూట్లు

    Jun 23 | పాత పెద్ద నోట్లు రద్దు చేస్తూన్న క్రమంలో ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ భారత ప్రజల ముందుకు మీడియా ద్వారా వచ్చి.. నోట్ల రద్దు వెనకనున్న అసలు ఉద్దేశ్యాన్ని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో... Read more

  • Ndrf trails to rescue toddler meena goes in vain

    మరింత కిందకు జారిన మీన.. ఎన్డీఆర్ఎఫ్ విఫలయత్నం..

    Jun 23 | రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలం ఇక్కారెడ్డి గూడెంలో బోరుబావిలో పడిన 14 నెలల చిన్నారి మీనాను రక్షించేందుకు ఎన్డీఆరఎఫ్ అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రోబో టెక్నాలజీ (రోజోటిక్ హ్యాండ్)తో పాపను బోరుబావి... Read more

  • Sexual assault on minor police hunt for accused

    మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడి కోసం పోలీసుల వేట

    Jun 23 | అమ్మాయిలంటేనే అంగడి వస్తువుగా భావించే మగమృగాలు కంటికి నచ్చిన అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడేందుకు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. గతంలో కన్యాశుల్కం పేరుతో పేద అమ్మాయిల తల్లిదండ్రులకు ధనాశ చూపి... Read more

  • Boys wear skirts in uniform protest

    స్కూల్లో జంబలకిడి పంబ

    Jun 23 | నిరసనలు వ్యక్తం చేయటంలో ఇప్పటి జనరేషన్ స్టైలే వేరు. తమకు అనుకూలంగా ఏదైనా నిర్ణయం రాలేదంటే.. దాని ఎలా సాధించుకోవాలో బాగా తెలుసు. అందుకు సోషల్ మీడియా కూడా ఓ మంచి ఫ్లాట్ ఫాం... Read more

  • Presidential poll nda candidate ramnath kovind files nomination appeals for support

    అతిరధుల సమక్షంలో ఒక ఘట్టం ముగించిన రామ్ నాథ్

    Jun 23 | దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవికి జరుగుతున్న ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్థిగా రామ్ నాథ్‌ కోవింద్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ భవనంలో ఆయన ఎన్డీఏ భాగస్వామ్య ఫక్షాల నేతలు, బీజేపి పాలిత రాష్ట్రాల... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno