How panneerselvam able to defeat sasikala team

O Panneerselvam, Panneerselvam Floor Test, Panneerselvam Dharma Yudham, Amma Rule Panneerselvam, Panneeselvam Palanisamy, Tamil Nadu New CM, CM Palanisamy Panneeselvam

tamil Nadu Out going Chief Minister O Panneerselvam declared war against Palaniswamy Government. At the memorial of Jayalalithaa he and his supporters would continue their fight.

శశికళ టీంను ఎలా ఓడిస్తాడంటే...

Posted: 02/17/2017 10:00 AM IST | Updated: 02/17/2017 10:14 AM IST
How panneerselvam able to defeat sasikala team

అన్నాడీఎంకే సీఎం పోరు వారం హైడ్రామా తర్వాత ఎట్టకేలకు ముగిసింది. చిన్నమ్మ జైలుకు వెళ్లినా సరే అనుచరుడిని ముఖ్యమంత్రిగా చేసి తన పంతం నెగ్గించుకుంది. దీంతో పన్నీర్ సెల్వం పరిస్థితి అయోమయంలో పడిపోయింది. బలనిరూపణకు 14 రోజుల గడువు ఇచ్చినప్పటికీ, ఈ గ్యాప్ లో సమీకరణాలు తారు మారు అయ్యే అవకాశం ఉండటంతో శనివారమే దానికి రెడీ అయిపోతున్నాడు కొత్త సీఎం పళనీస్వామి. ఇదిలా ఉండగానే మరోసారి అమ్మ సమాధి వద్ద హైడ్రామా నడిపిన ఓపీస్ ప్రభుత్వాన్ని కూల్చటమే తన లక్ష్యమంటూ ప్రకటించాడు కూడా. పన్నీర్ దారెటు?

మొత్తం 134 మంది ఎమ్మెల్యేలలో తనకే 124 మంది మద్ధతు ఉందని పళనీ ప్రకటించిన విషయం తెలిసిందే. సెల్వం బ్యాచ్ లో పది మంది ఉన్నప్పటికీ వారిని పార్టీ నుంచి తొలగించటంతో వారు తిరిగే వచ్చే అవకాశాలు లేవు. ఇక ఉన్న వారిని ఒక్క రోజు కాపాడుకుంటే చాలూ పళనీ నాలుగేళ్లపాటు ఏ అడ్డూ లేకుండా పాలన సాగించుకోవచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. అయితే అదే సమయంలో కొత్త వారేవ్వరూ తమిళనాడును ఎంతో కాలం ఏలలేదన్న చరిత్ర కూడా ఉంది.

కీలకం కానుకన్న కులం..

బల పరీక్ష సమయానికి కుల రాజకీయాలు కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. 20 మంది దేవర్, 28 మంది గౌండర్, 31 మంది దళిత, 19 మంది వన్నియర్ వర్గ ఎమ్మెల్యేలు ఉన్నారు. పన్నీర్ సెల్వంకు చెందిన దేవర్ వర్గం 8 మంది అల్రెడీ అతని పంచన చేరారు. ఇక మిగిలింది 12 మంది. వీరంతా గతంలో జయ, సెల్వం హయాంలో మినిస్టర్ లుగా పని చేశారు కూడా. దీంతో ప్రస్తుతం వీరంతా పళనీకి హ్యాండిచ్చే అవకాశం లేకపోలేదు.

మరోవైపు ప్రజల నుంచి కూడా తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతుండటంతో ఎమ్మెల్యేలు ఏ క్షణాన అయినా యూ టర్న్ తీసుకునే అవకాశం లేకపోలేదు. రిసార్ట్ నుంచి ఇళ్లకు బయలుదేరిన కొంత మంది ఎమ్మెల్యేలను అటకాయించిన ప్రజలు ఆగ్రహాంతో ఉమ్మేయటం, వారిపై దుమ్మెత్తి పోయటం లాంటి సీన్లు కనిపించాయి. చివరకు పోలీసుల సాయంతో వాళ్లు ఇళ్లకు చేరాల్సిన పరిస్థితి దాపురించింది. వీటి వెనుక సెల్వం ఉన్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు నిజంగానే తలెత్తే అవకాశాలను కొట్టి పారేయలేం అంటున్నారు విశ్లేషకులు.

ప్రభుత్వంపై ధర్మ యుద్ధం ప్రకటించిన సెల్వంను నిలువరించాలంటే అతనితోపాటు, మద్దతుదారులైన 9 మందిపై అనర్హత వేటు వేయించేలా ఈసీపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు అన్నాడీఎంకే కు అంత సమయం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బల పద్రర్శన కు ముందే అరవ రాజకీయాల్లో పన్నీర్ సెల్వం ఎలాంటి అలజడి రేపుతాడో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

శశికళ భవితవ్యం ఏంటి?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CM Palanisamy  Floor Test  Panneerselvam  

Other Articles

 • Pawan kalyan about ap special status at sahyagraham

  ITEMVIDEOS:అసెంబ్లీలో చేనేత గొంతుక వినిపిస్తా: జనసేనాని

  Feb 20 | బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటమే తనకు కోట్ల ఆస్తితో సమానమన్న పవన్ తెలుగు రాష్టర్ ప్రభుత్వాలు చేనేతకు అండగా ఉంటానని మాటల్లో చెప్పటం కాదని, ఆచరించి చూపాలంటూ చెప్పాడు. నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన... Read more

 • Pawan kalyan speech at chenetha sathyagraham

  కించపరిచినా గర్వంగా ఫీలవుతా : పవన్ కళ్యాణ్

  Feb 20 | చేనేత ను గౌరవించటం అంటే దేశ సంస్కృతిని గౌరవించటమేనని జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించాడు. సోమవారం ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ సాధికారంత సంఘం ఆధ్వర్యంలో మంగళగిరిలో నిర్వహించిన చేనేత సత్యాగ్రహం ‘ఐక్య గర్జన సభకు’ పవన్... Read more

 • Akhilesh yadav s dig at pm narendra modi

  మోదీపై డబుల్ మీనింగ్ డైలాగ్ ఏశాడు

  Feb 20 | ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ యూపీ ఎన్నికల ప్రచార సభలో మరోసారి దేశ ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేసి మాటల తుటాలు పేల్చాడు. రాయ్ బరేలీలో జరిగిన ప్రచార సభలో ప్రసంగిస్తూ... Read more

 • Dmk file petition against palaniswamy trust vote

  హైకోర్టులో డీఎంకే.. శశికళ మాత్రం సుప్రీంలో...

  Feb 20 | తమిళనాడు అసెంబ్లీలో జరిగిన యాక్షన్ డ్రామాలో కొత్త ట్విస్ట్. ఎడప్పది పళనిస్వామి సీఎంగా బలనిరూపణలో గెలవటంపై అభ్యంతరాలు లేవనెత్తింది డీఎంకే. ఈ మేరకు తమ చొక్కాలు చించి దారుణ అవమానానికి గురి చేశారంటూ గగ్గోలు... Read more

 • This isis militant statement make us blood curdle

  200 రేప్ లు, 500 హత్యలు.. ఎవడు వాడు?

  Feb 20 | ఐఎస్ఐఎస్ ఈ పేరు చెబితే చాలూ ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కి పడుతుంటాయి. ఏ రోజు ఏ మూలన ఈ రాక్షసులు నరమేధం సృష్టిస్తారోనన్న భయం గుప్పిట్లో ప్రపంచ దేశాలు బతుకుతున్నాయి. ముఖ్యంగా ఇస్లాం దేశాలైతే... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno