చిన్నమ్మకు జైలు శిక్ష మూడున్నరేళ్లే..! sasikala to undergo only only 3 years 6 months jail

Sasikala to undergo only 3 years 6 months jail

Tamil Nadu, chief minister, late cm J Jayalalithaa, VK Sasikala, disproportionate case, pallaniswamy, sendigottanyan, thambidurai, O.Panneerselvam, supreme court, vidyasagar rao, PM modi, Governor, tamil politics

AIADMK general secretary VK Sasikala and other two convicts in disproportionate assts case to undergo only 3 years 6 months jail

చిన్నమ్మకు జైలు శిక్ష మూడున్నరేళ్లే..!

Posted: 02/14/2017 03:52 PM IST
Sasikala to undergo only 3 years 6 months jail

తమిళనాడు స్వర్గీయ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్థుల కేసులో నిందితురాలిగా వున్న అమె నిచ్చెలి శశికళను దేశ అత్యున్నత న్యాయస్థానం దోషిగా పరిగణిస్తూ నాలుగేళ్ల కారాగారవాస శిక్షను విధించిడంతో పాటు జరిపామన కూడా విధించింది. అయితే అమె కేవలం మూడేళ్ల ఆరు నెలలు మాత్రమే కారగారం చేయనున్నారు. ఎందుకలగా..? మరి మరో ఆరు నెలలు అంటారా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయా.?

ఆదాయినికి మించి అస్తులను కూడబెట్టిన కేసులో తమిళనాడు స్వర్గీయ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సహా అమె నిచ్చెలి శశికళ, ఇరళవరసి, సుధాకరన్లు నిందితులు. వీరిలో జయలలిత పరమపదించిన కారణంగా అమెను మినహాయించిన న్యాయస్థానం మిగిలిన ముగ్గురు నిందితులకు నాలుగేళ్ల కారాగారశిక్షను విధించింది. కాగా, కర్ణాటకలోని దిగువ కోర్టులో అక్రమాస్థుల కేసు తీర్పు వచ్చినప్పుడు జయలలిత, శశికళ సహా మొత్తం నలుగురు దోషులు ఆరు నెలల పాటు జైలుశిక్ష అనుభవించారు.

అప్పట్లో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో వాళ్లు శిక్ష అనుభవించారు. దాంతో ఆ శిక్షా కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. తమ నాలుగేళ్ల జైలు శిక్ష కాలంలో నిందితులు అనుభవించిన జైలు శిక్షను మినహాయించి, మిగిలిన మూడున్నరేళ్ల జైలుశిక్షను మాత్రమే శశికళ, సుధాకరన్, ఇళవరసి.. ఈ ముగ్గురూ అనుభవించాల్సి ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : J Jayalalithaa  VK Sasikala  disproportionate case  pallaniswamy  sendigottanyan  thambidurai  AIADMK  

Other Articles