త్వరలో మధ్యంతర ఎన్నికలు..! mid term polls on the way, hints parties

Mid term polls on the way hints parties

mid term polls, Uddhav Thackeray, Shiv Sena-BJP Alliance, Devendra Fadnavis, Shiv Sena, NCP, mumbai civic polls, demonetisation, India news, latest news

After snapping ties with the BJP for civic polls, Shiv Sena chief Uddhav Thackeray hinted at pulling back support to the Devendra Fadanvis led government.

త్వరలో మధ్యంతర ఎన్నికలు..! సంకేతాలు ఇచ్చిన పార్టీలు

Posted: 02/14/2017 02:38 PM IST
Mid term polls on the way hints parties

త్వరలో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయని... ప్రజలంతా సిద్ధంగా ఉండాలని ఓ ప్రమఖ పార్టీ అధినేత సంచలన ప్రకటనన చేసింది. బహుశా తమిళనాడులో మద్యంతర ఎన్నికలు వస్తున్నాయని ఏదో పార్టీ ప్రకటన ఇచ్చిందనుకుంటే పోరబాటే. ఈ ప్రకటన ఇచ్చింది ఎదో పార్టీ కాదు. ప్రభుత్వంలో మిత్రపక్షంగా వున్న శిశసేన. అది మహారాష్ట్రలోనే. ఏడాదిన్నర కాలం కూడా తిరగకుండానే అప్పుడే మహారాష్ట్ర అసెంబ్లీకి మళ్లీ ఎన్నకలలా..? అన్న డౌట్ అక్కర్లేదు. ఎందుకంటే ఈ ప్రకటన చేసింది ముమ్మాటికీ మిత్రపక్షమైన శివసేన అదినేత ఉద్దవ్ థాకరే.

మహారాష్ట్రలో త్వరలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని, ప్రజలు సిద్దంగా వుండాలని, ప్రజలతో పాటు పార్టీ నేతలు, శ్రేణులు, కార్యకర్తలు కూడా సిద్దంకావాలని ఉద్ధవ్ థాకరే అన్నారు. మహారాష్ట్రలో బీజేపీ, శివసేనల సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, త్వరలో జరగనున్న బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ, శివసేనలు దేనికదే విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత, బీజేపీ ప్రభుత్వానికి తాము ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకుంటామని ఉద్ధవ్ స్పష్టం చేశారు.

ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో విడిగా పోటీ చేస్తున్న రెండు పార్టీలు విమర్శ,ప్రతివిమర్శలకు దిగాయి. ఈ నేపథ్యంతో వరుసగా గత 5 పర్యాయాలు బీఎంసీని శివసేన పార్టీ కైవసం చేసుకున్న తరుణంలో నిధులు వెచ్చించడంలో పారదర్శకత లోపిస్తోందని బీజేపి అరోపించింది. ఆ అరోపణలను తీవ్రంగా ఖండించిన ఉద్ధవ్‌ ఠాక్రే.. ముంబయి తమ ప్రాంతమని, నగరానికి నష్టం కలిగే ఏ విషయాన్ని తాము సహించబోమని స్పష్టం చేశారు. ఇక ఈ ఎన్నికల తరువాత బీజేపి పార్టీకి తాము మద్దుతు ఉపసంహరించుకుంటామని ఖరాఖండీగా చెప్పేశారు.

ఇదే సమయంలో ప్రధాని మోదీపై కూడా ఉద్ధవ్ థాకరే తీవ్ర విమర్శలు గుప్పించారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల... 86 శాతం డబ్బు చలామణిలో లేకుండా పోయిందని మండిపడ్డారు. ఏ మాత్రం ముందస్తు ఆలోచన లేకుండానే పెద్ద నోట్లను రద్దు చేశారని విమర్శించారు. దీనిపై ఆందోళన పడని వాళ్లు మనుషులే కాదని విమర్శించారు. మోదీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని... కానీ, ఆయన ఎలాంటి వాగ్దానాలను నిలబెట్టుకోలేక పోయారని అన్నారు. రామ మందిర నిర్మాణం విషయంలో కూడా ఎలాంటి పురోగతి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles