రైల్వే వాటాగా తెలుగు రాష్ట్రాలకు ఏం లభించాయో తెలుసా..? Arun Jaitley gives big allocations to south central railway

Arun jaitley gives big allocations to south central railway

PM modi, narendra modi, arun jaitley, Telangana, andhra pradesh, railway budget, demonetisation, Budget, finance minister, nda government, budget 2017-18, Union Budget 2017, financial year budget, congress, mallikarjun kharge, parliament

Finance Minister Arun Jaitley allocates good shares to south central railways, which covers maximum area of telugu states, in the Budget for 2017-18.

రైల్వే వాటాగా తెలుగు రాష్ట్రాలకు ఏం లభించాయో తెలుసా..?

Posted: 02/01/2017 08:06 PM IST
Arun jaitley gives big allocations to south central railway

కేంద్ర ఆర్థికమం‍త్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించిన బడ్జెట్‌లో రైల్వేలకు చేసిన కేటాయింపుల్లో దక్షిణ మధ్య రైల్వేకు వాటాలు పెరిగాయని జీఎం వినోద్ కుమార్‌ చెప్పారు. సాధారణ బడ్జెట్ లో రైల్వే బడ్జెట్ ను కూడా కలిపిన తరువాత తొలిసారిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలుగు రాష్ట్రాలకు భారీగా వాటాలను పెంచారని చెప్పారు. వాటి వివరాలను తెలియజేస్తూ 2017-18దక్షిణ మధ్య రైల్వే-తెలంగాణ బడ్జెట్‌ రూ.1,729 కోట్లు అని, అలాగే, ఏపీ బడ్జెట్‌ రూ.3,406కోట్లు అని తెలిపారు.

యాత్రికులు, పర్యాటకులకోసం ప్రత్యేక రైళ్లు ఉంటాయని చెప్పారు. బల్లార్షా-కాజీపేట-విజయవాడ మధ్య మూడో లైన్‌ ఏర్పాటు చేయనున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు. ఆంద్రప్రదేశ్‌, తెలంగాణలతో దక్షిణ మధ్య రైల్వే జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేస్తామని, వచ్చే ఏడాది సికింద్రాబాద్‌, విజయవాడ స్టేషన్లు మరింత ఆధునీకరిస్తామని చెప్పారు. 20 స్టేషన్లలో 34 లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన స్టేషన్‌లో కోచ్‌ మిత్ర సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

 సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ సమీపంలో చెత్త శుద్ధి కేంద్రం పెడతామన్నారు. ఎంఎంటీఎస్‌ ఫేజ్‌-2ను 2018కల్లా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తిరుపతి నుంచి జమ్ము వరకు హమ్‌ సఫర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ ఉంటుందని, విశాఖ నుంచి విజయవాడ మధ్య ఉదయ్ ఎక్స్ ప్రెస్‌ నడుస్తాయని చెప్పారు. వెయిట్‌ లిస్టింగ్‌ ప్యాసింజర్ల కోసం వికల్ప్‌ సదుపాయం ఉంటుందన్నారు. సికింద్రాబాద్‌-న్యూఢిల్లీ మధ్య నడిచే మూడు రైళ్లకు వికల్ప్ సదుపాయం, సికింద్రాబాద్‌ స్టేషన్లో ఎస్ఎంఎస్‌ చేస్తే కోచ్‌ పరిశుభ్రం చేసే సౌకర్యం ఏర్పడనుందని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM modi  arun jaitley  budget 2017-18  Telangana  andhra pradesh  railway budget  parliament  

Other Articles