మాజీ కెప్టెన్ ధోని మ్యాచ్ ను అపించాడు.. MS Dhoni calls fourth umpire and stops the play

Ms dhoni calls fourth umpire and stops the play

ms dhoni, dhoni, ms dhoni wicketkeeping, dhoni, india vs england, ind vs eng, india vs england 2nd t20, cricket news, sports news, cricket

During the second innings, MS Dhoni, who recently stepped down from the captaincy post, stopped the game.

మాజీ కెప్టెన్ ధోని మ్యాచ్ ను అపించాడు..

Posted: 02/01/2017 08:58 PM IST
Ms dhoni calls fourth umpire and stops the play

టీమిండియా కెప్టెన్సీ పగ్గాలను ఇటీవలే వదిలేసిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మ్యాచ్ ను అపించాశాడు. అంతర్జాతయ వేదికలపై మునుపెన్నడూ లేని విధంగా అట ప్రారంభమైన కొద్ది నిమిషాలకు అంఫైర్ వద్దకు వెళ్లిన దోని మ్యాచ్ ను నిలిపేయాల్సిందిగా కోరాడు. మ్యాచ్ జరుగుతున్న క్రమంలో నాలుగో అంఫైర్ ను మైదానంలోకి రప్పించేట్లు చేశాడు. ఎందుకంటారా..? ఆయన ధోని నిశిత పరిశీలన అలాంటిది. అదేంటీ అంటారా..?

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా ఫీల్డింగ్ చేసేందుకు సిద్దం కాగా, బాట్ అందుకున్న మనవాళ్లు చేధించగల స్కోరునే బోర్డుపై నిలిపారు. అ తరువాత రెండో ఇన్నింగ్స్ లో భాగంగా టీమిండియా ఫిల్డింగ్ చేస్తున్న క్రమంలో మ్యాచ్‌ను కొన్ని నిమిషాలు పాటు ధోని నిలిపివేయించాడు. భారత్ బౌలింగ్ సమయంలో ఒక బెయిల్‌లో ఎల్ఈడీ లైట్లు వెలగకపోవడాన్ని గమనించిన ధోనీ, అంపైర్లకు చెప్పి, మ్యాచ్ ఆపించాడు. ఫీల్డ్ అంపైర్ ఏకంగా ఫోర్త్ అంపైర్ కు విషయాన్ని చెప్పారు.

దీంతో హుటాహుటిన రంగంలోకి వచ్చిన సిబ్బంది బెయిల్ మార్చడంతో మ్యాచ్ కు ఏర్పడిన అంతరాయం ముగిసింది. మ్యాచ్ మధ్యలో బెయిల్ మార్చడం క్రికెట్‌ చరిత్రలో ఇదే ప్రథమం.ఆడిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల సంఖ్య 72. వికెట్ కీపర్‌గా ఆ మ్యాచ్‌లలో 63 మంది బ్యాట్స్‌మన్‌ను ఏదో రూపంలో ఔట్ చేశాడు. ఇది ఓ రికార్డు. ధోనీ తర్వాత స్థానాల్లో కమ్రాన్ అక్మల్ (60), దినేష్ రామ్‌దిన్ (51) రెండు మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ లెక్క ఇప్పుడెందుకంటే ధోనీ నిశిత పరిశీలనను చెప్పడానికే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles