వాళ్ల పాపాలు ఇంకా బయటపడుతున్నాయ్.. UPA government cabinet meet lied on polavaram: devineni uma

Upa government cabinet meet lied on polavaram devineni uma

polavaram, upa governments, cabinet meer, president, congress, devineni uma, Chandrababu, chief minister, AP ministers, Andhra Pradesh,

Andhra pradesh Minister devineni uma alleges that UPA government cabinet meet lied on polavaram project in adding of khammam districts seven mandals

ITEMVIDEOS: వాళ్ల పాపాలు ఇంకా బయటపడుతున్నాయ్..

Posted: 01/28/2017 10:48 AM IST
Upa government cabinet meet lied on polavaram devineni uma

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన నేపథ్యంలో కాంగ్రెస్ అప్పట్లో చేసిన పాపాలు, చాచిన కుట్రలు కూడా తాజాగా వెలుగు చూస్తున్నాయి. సమైక్య రాష్ట్రాన్ని విభజించి.. నవ్యాంధ్రకు అనేక కేంద్ర విద్యా సంస్థలు.. పలు జాతీయ సంస్తలు ఏర్పటు చేయాలని చెప్పడంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా. నవ్యాంధ్రకు ప్రత్యేక హాదా కల్పించాలన్న అనేక డిమాండ్లను విభజన బిల్లోలో పోందుపర్చామని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్న దానికి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన బీజేపి-టీడీపీలు చేస్తున్న దానికి పొంతన లేదన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా వెలుగోలకి వచ్చిన పలు విషయాలు చర్చనీయాంశంగా మారాయి.

ముఖ్యంగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం విషయంలోనే కాంగ్రెస్ నేతలు కుట్రలకు, కుతంత్రాలకు తెరతీసినట్లు స్పష్టమవుతుంది. పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ కు అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని నాయకత్వం అన్యాయం చేసిందని తాజాగా బయటపడింది. పునర్విభజన సమయంలో పోలవరం ముంపు మండలాలను ఆంధ్రలో కలుపుతామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో సభ్యులకు మాటఇచ్చారు. ఈ మేరకు క్యాబినెట్ సెక్రటరితో పాటు హోం సెక్రకటరీ మూడు పేజీల నోట్ సిద్దం చేశారు.

అయితే ఈ నోట్ ను క్యాబినెట్ కమిటీ తిరస్కరించింది. కాగా ఏడు మండలాలను క్యాబినెట్ అమోదించి.. రాష్ట్రపతికి పంపగా, దానిని రాష్ట్రపతి తిరస్కరించారని అప్పట్లో కాంగ్రెస్ నేతలు నమ్మబలికారని, కానీ క్యాబినెట్ మీట్ లోనే ఏడు మండలాలను కలుపుతూ రూపోందించిన నోట్ ను పక్కనబెట్టారని ఆంధ్రప్రదేశ్ నీటిపారుధల శాఖ మంత్రి దేవినేని ఉమ అరోపించారు.  కాగా, తాజాగా పార్లమెంట్ నోట్ బయటపడటంతో అసలు క్యాబినెట్ మీట్ లోనే దానిని పక్కనబెట్టారన్న విషయం తేటతెల్లమైందని కూడా చెప్పుకోచ్చారు.

ఇలా కాంగ్రెస్ నేతలు రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టుకు అన్యాయం చేయాలని భావించారని, అయితే చంద్రబాబు వినతి మేరకు మోడీ సర్కారు దానిని ఏపిలో కలుపుతూ నిర్ణయం తీసుకుందని కూడా చెప్పుకోచ్చారు. కానీ కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం మాత్రం పోలవరం గురించి తామేదో కష్టపడ్డామని చెప్పుకోస్తూ.. పబ్బం గడుపుకునే పనిలో వున్నారని విమర్శించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles