మంత్రి గంటకు ఇండియన్ బ్యాంక్ ఝలక్.. Bank seized Ganta's properties

Hrd minister s properties attached by indian bank

Visakhapatnam, HRD Minister, Ganta Srinivasa Rao, Indian Bank, properties, guarantor, Pratyusha Resources and Infra Limited, Minister’s residences, MVP Colony, Chodavaram village, Visakhapatnam

Minister Ganta Srinivasa Rao’s properties have been attached by the Indian Bank’s Dabagardens branch here after a company for which he stood as guarantor for a loan has failed to repay. The amount defaulted is Rs. 141.68 crores.

మంత్రి గంటకు ఇండియన్ బ్యాంక్ ఝలక్.. ఆస్తులు జప్తు..

Posted: 12/30/2016 01:01 PM IST
Hrd minister s properties attached by indian bank

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావుకు ఇండియన్ బ్యాంక్ ఝలక్ ఇచ్చింది. అమాత్యుని ఆస్తుల‌ను స్వాధీనం చేసుకుని షాక్ ఇచ్చింది. ఇలాంటి ఘటనలు జరుగుతాయా..? అంటూ విస్మయం చెందినా.. ఇండియన్ బ్యాంక్ మాత్రం చేసి చూపించింది. విశాఖ‌ప‌ట్నం దాబా గార్డెన్స్ లోని ఇండియ‌న్ బ్యాంకు బ్రాంచి మంత్రి ఆస్తులను అటాచ్ చేసినట్లు దృవీకరించింది. మంత్రి గంటా శ్రీనివాసరావు గ్యారెంటర్ గా వున్న కంపెనీ కోట్ల రూపాయలను రుణాంగా తీసుకుని డిఫాల్టర్ గా మారడంతో బ్యాంకు ఈ చర్యలకు పూనుకుంది.

ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా కంపెనీ డైరెక్టర్లు అయిన ప‌రుచూరి రాజారావు, ప‌రుచూరి ప్రభాక‌ర‌రావు,  ప‌రుచూరి వెంక‌ట భాస్కర‌రావు త‌దిత‌రులు వివిధ ప్రాంతాల్లోని భూములు, భ‌వ‌నాలు త‌న‌ఖా పెట్టి బ్యాంకు నుంచి  విడ‌త‌ల‌వారీగా రుణం తీసుకున్నారు. ఈ మొత్తం ఏకంగా 141.68 కోట్ల రూపాయల రుణం వీరు ఇండియన్ బ్యాంకు నుంచి పోందారు. వీరికి మంత్రి గ్యారంటర్ గా వున్నారు. ఆయనతోపాటు కోండయ్య బాలసుబ్రహ్మణ్యం, నార్నీ అమూల్యలు కూడా హామీ ఇచ్చారు. అయితే రుణం తిరిగి చెల్లించడంలో విఫలమైన రుణగ్రహీతల అస్తులతో పాటు గ్యారంటర్ల అస్తులను కూడా బ్యాంకు అధికారులు సీజ్ చేశారు

ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా కంపెనీ రుణం తిరిగి చెల్లించడంలో కంపెనీ విఫ‌లం కావ‌డంతో బ్యాంకు నోటీసులు పంపింది. అయినా వారి నుంచి ఎటువంటి స్పంద‌న లేక‌పోవ‌డంతో హామీగా పెట్టిన ఆస్తుల‌ను స్వాధీనం చేసుకుంటున్నట్టు ప్రక‌టించింది. మొత్తంగా 26 అస్తులను సీజ్ చేసినట్లు బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. అయితే మంత్రి పూచీకత్తుగా పెట్టిన వాటిలో విశాఖ, ఎంవీపీ కాల‌నీలోని ఆయ‌న ఇల్లు, బాల‌య్య శాస్త్రి లేఅవుట్‌లోని ఫ్లాటు, అన‌కాప‌ల్లి, చోడ‌వ‌రంలోని వ్యవ‌సాయ‌భూమి, కూర్మన్న‌పాలెంలోని కొంత భూమి ఉన్నట్టు బ్యాంకు వివ‌రించింది.

నైతిక బాధ్యతతో అస్తులను ఇచ్చేస్తా: గంటా

ఇండియన్ బ్యాంకు తన అస్తులను సీజ్ చేసిందన్న వార్త కథనాలపై మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ జాతీయ దినపత్రికతో మాట్లాడుతూ.. ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా కంపెనీలో తాను కూడా ఒక భాగస్వామిగా వుండేవాడనని, అయితే 2009లో తాను కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశానని చెప్పారు. కాగా సంస్థకు రుణం కావాల్సిన సమయంలో తనకు చెందిన ఆస్తులను హామీగా పెట్టానన్నారు. సంస్థ ఈ రుణాన్ని చెల్లించడంలో విఫలమైందన్న విషయం తనకు తెలియదని, అయితే ఇప్పటికైనా సంస్థ ముందుకువచ్చి రుణం చెల్లించని పక్షంలో తాను నైతిక బాధ్యతగా తన అస్తులను వదులుకోడానికి సిద్దమని తెలిపారు.

కేంద్రమంత్రి సుజనా బాటలో గంటా శ్రీనివాసరావు..?

కేంద్రమంత్రి సుజనా చౌదరి బాటలోనే రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా పయనిస్తున్నారా..? అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిగా వున్న సుజనా చౌదరి.. తానకు చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ అనుబంధంగా మారిషస్ లో హెస్టియా హోల్డింగ్స్ లిమిటెడ్ సంస్థను స్థాపించారు. ఆ సంస్థకు మారిషస్ లోని మారిషస్ కమర్షియల్ బ్యాంకు నుంచి వంద కోట్ల రూపాయలకు పైగా రుణాన్ని కూడా తీసుకున్నారు. అయితే రుణం చెల్లించకుండానే హెస్టీయా సంస్థను మూసివేశారని, ఆయన డీఫల్టర్ గా మారారని అభియోగాలను ఎదుర్కోన్నారు.

దీంతో మారిషస్ కమర్షియల్ బ్యాంకు సిటీ సివిల్ కోర్టులో కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో కేసు విచారణకు హాజరుకాకపోవడంతో ఆయనపై రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు నాన్ బెయిలెబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. అయితే ఆ సంస్థకు తాను ఒకనాడు చైర్మన్ గా వ్యవహరించానని సుజనా తరువాత ప్రెస్ మీట్ లో చెప్పిన విషయం తెలిసిందే. కాగా ఆయన బాటలోనే రాష్ట్రమంత్రి గంటా పయనిస్తున్నారా..? అన్న ప్రశ్నలకు రేకెత్తుతున్న తరుణంలో గంటా మాత్రం సదరు సంస్థ రుణం చెల్లించని పక్షంలో నైతిక బాద్యతగా తన అస్తులను వదుటుకుంటారనని తేల్చిచెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles