కాపులను విఛ్చినం చేసే కుతంత్రాలు.. బాబు మైండ్ గేమ్ 'Naidu Playing Mind Game With Kapus'

Naidu playing mind game with kapus

mudragada padmanabham, kapu reservation agitation, open letter, Chandrababu Naidu, Kapu, Andhra Pradesh

Kapu strongman Mudragada Padmanabham is back in the news with yet another open letter to Andhra Pradesh chief minister and Telugu Desam Party president N Chandrababu Naidu.

కాపులను విఛ్చినం చేసే కుతంత్రాలు.. బాబు మైండ్ గేమ్

Posted: 12/30/2016 12:07 PM IST
Naidu playing mind game with kapus

కాపులలో వున్న ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైండ్ గేమ్ అడుతున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా తమ ఉద్యమం ఆగదని కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. కాపులకు ఇచ్చిన హామీలను నెరవర్చడంలో విఫలమైన చంద్రబాబు.. తమ జాతితో మైండ్‌ గేమ్‌ ఆడుతూ పబ్బం గడుపుకోవాలని చస్తున్నారని ఆరోపించారు.

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. ఇప్పటివరకు తమ జాతికి ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. పార్టీ ఎజెండాలో తమ కులాన్ని బీసీలలో చేర్చుతామన్న అంశాన్ని చేర్చి.. తమ ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పటివరకు ఎందుకు అడుగు ముందుకు వేయలేదని ఆయన ప్రశ్నించారు. ఉద్యమం ప్రారంభం నాటి నుంచి తమ అనుకూల పత్రిక, చానళ్ల ద్వారా చంద్రబాబు ప్రభుత్వం వ్యతిరేక వార్తలు రాయిస్తోందని అన్నారు.

తమ కులానికి చెందిన కొందర్ని లొంగదీసుకుని తనను దూషించడమే పనిగా ఎందుకు పెట్టుకున్నారని ఆయన ప్రశ్నించారు. కార్పొరేషన్‌ ను ఏర్పాటు కూడా కాపు ఐక్యతను విఛ్ఛిన్నం చేయడానికినని పేర్కొన్నారు. ఒక కులాన్ని అదే కులస్తులతో తిట్టించిన ఘటనలు దేశంలో ఎక్కడా లేవని వాపోయారు. ఉద్యమంలో కాపు కులస్తులు అలసిపోతున్నారని, మరికొంత వారి బంధువుల వ్యాపారాల వల్ల ప్రభుత్వంలో చేరుతున్నారని వెల్లడించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తమను బీసీలలో చేర్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని ముద్రగడ స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles