గోవా తరువాత ఢిల్లీలో.. కొద్దిలో తప్పిన మృత్యుఘోష.. Mishap averted at Indira Gandhi International Airport in Delhi

Indigo and spicejet flights avert collision at delhi airport

SpiceJet take off Delhi, runway accident, IndiGo accident Delhi, Delhi airport scare, Delhi Airport, miscommunication, Air Traffic Control, Directorate General of Civil Aviation

A major accident was averted at Delhi's Indira Gandhi International airport on Tuesday morning as two planes, an IndiGo and a SpiceJet aircraft, came face-to-face on the runway.

గోవా తరువాత ఢిల్లీలో.. కొద్దిలో తప్పిన మృత్యుఘోష..

Posted: 12/27/2016 11:54 AM IST
Indigo and spicejet flights avert collision at delhi airport

పెను ప్రమాదం.. ఘోర ప్రమాదం.. కొద్దిలో తప్పింది. పైలెట్లు అప్రమత్తతతో వ్యవహరించడంలో వందల మంది విమానయాన ప్రయాణికులు సురక్షితంగా ఊపిరిపీల్చుకున్నారు. లేని పక్షంలో మృత్యుఘోష, బందువుల హాహాకారాలు, క్షతగాత్రుల అర్థనాధాలతో దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకునేది. ఢిల్లీ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లో ఏర్పడిన గంధరగోళం.. కాస్తా పెను విషాదంగా మారేంది.

అయితే తమకు ఎదురవుతున్న ప్రమాధాన్ని గుర్తించి, సకాలంలో స్పందించి అప్రమత్తంగా వ్యవహరించడంతో పైలెట్లు ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. ఈ క్రమంలో ఏటీసీలో చోటుచేసుకున్న గందరగోళంపై పౌర విమానాయాన డైరెక్టర్ జనరల్ విచారణకు అదేశించింది. అంతకు ముందు గోవా విమానాశ్రయంలో జెట్ ఎయిర్ వేస్ కు సంబంధించిన విమానం రన్ వే పై (స్కీడ్) జారిందన్న వార్త వెలువడిన కొన్ని గంటల వ్యవధిలో ఇలా మరో విమాన ప్రమాదానికి సంబంధించిన వార్త వెలుగులోకి రావడంతో విమానయాన ప్రయాణికులు అందోళనకు గురయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎదురెదురుగా వచ్చిన ఇండితో, స్పైస్ జెట్ విమానాలు రమారమి ఢీ కొట్టుకునేంత వరకు వెళ్లాయి. 176 మంది ప్రయాణికులతో.. లక్నో నుంచి ఢిల్లీ విమానాశ్రమంలోకి అప్పుడే వచ్చి దిగిన ఇండిగో విమానం ట్యాక్సీ వే వైపు వెళుతుండగా, అదే సమయంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన స్పైస్‌ జెట్‌ విమానం టేకాఫ్ తీసుకుంటూ దానికి ఎదురుగా వచ్చింది. రెండు విమానాలు ఎదురెదురుగా దగ్గరగా వచ్చాయి. పైలట్లు అప్రమత్తంగా వ్యవహరిచడంతో తృటిలో ప్రమాదం తప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles