ప్రవేట్ ట్రావెల్స్.. కస్సు బ(బు)స్సు... ఎవరి వర్షన్ వారిదే... | Private Travels clash between JC and Srinivas Goud.

Jc prabhakar versus srinivas goud

JC Prabhakar Reddy, TRS MLA Srinivas Goud, Private Travels Issue, Prabhakar versus Srinivas, Private Travels clash in telugu states, JC travels Srinivas goud, Telangana MLA Srinivas Goud, JC Prabhakarreddy, Reddy vs gout, Telangana RTO office, JC Prabhakar Reddy Arrest, Orange Travels Sunil Reddy

TDP MLA JC Prabhakar Sawal to TRS MLA Srinivas Goud over private Travels Issue.

ITEMVIDEOS:జేసీ వర్సెస్ ఎస్జీ... టెన్షన్.. టెన్షన్...

Posted: 12/27/2016 11:31 AM IST
Jc prabhakar versus srinivas goud

తెలుగు రాష్ట్రాల ప్రైవేట్ ట్రావెల్స్ వ్యవహారం కాస్త తీవ్ర ఉద్రిక్తంగా మారింది. తాము నిబంధనలకు అనుగుణంగానే ప్రైవేటు బస్సులను నడుపుతున్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం వేధిస్తోందని, అందుకు తగిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ చేసిన దివాకర్ ట్రావెల్స్ సహ యజమాని, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్, ఖైరతాబాద్ లోని ఆర్టీయే కార్యాలయానికి రావడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నామని చెబుతూ, తెలంగాణ ప్రైవేటు ట్రావెల్స్ అసోసియేషన్ ప్రతినిధులను వెంటబెట్టుకుని అప్పటికే టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ ఆర్టీయే కార్యాలయం లోపలికి వెళ్లి వుండటంతో, ప్రభాకర్ రెడ్డిని పోలీసులు బయటే అడ్డుకున్నారు. కొంత వాగ్వాదం అనంతరం ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నామని ప్రకటించి, పోలీసు స్టేషన్ కు తరలించారు. తాము నిబంధనలకు విరుద్ధంగా బస్సులను తిప్పలేదని, తమను వేధిస్తున్నారన్న ఆధారాలు ఉండబట్టే సవాల్ చేశానని, అందుకు ఆధారాలు తీసుకునే వచ్చానని పోలీసు స్టేషన్ దగ్గర ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ తో చర్చించేందుకు వచ్చిన తననెందుకు అడ్డుకుంటున్నారని తెలంగాణ పోలీసులతో తాడిపత్రి ఎమ్మెల్యే, దివాకర్ ట్రావెల్స్ యజమాని జేసీ ప్రభాకర్ రడ్డి వాదనకు దిగారు. ఈ ఉదయం తోపులాటల మధ్య ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషనుకు తరలించారు. ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని సునీల్ రెడ్డి బస్సుల సీజ్ వ్యవహారంతో వీరిద్దరి మధ్య మూడు రోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు ముఖాముఖి భేటీకి ఇద్దరూ సై అంటే సై అనుకున్నారు.

 

ఎవరి వర్షన్ వారిదే...

తనకు ఏ ప్రశ్న వేసినా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని, తనకున్న 44 బస్సుల పర్మిట్లను తీసుకు వచ్చానని, వాటికి టాక్స్ కట్టానో లేదో పరిశీలించుకోవాలని సవాల్ విసిరారు. పాలెంలో ప్రమాదానికి గురైన బస్సు వివరాలూ తన వద్ద ఉన్నాయని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా రాలేదని, తెలంగాణలో బస్సు ఆపరేటర్ గా వచ్చానని, తెలంగాణ చిరునామాతో ఉన్న బస్సు పర్మిట్లను ఆయన చూపించారు.

తెలంగాణ ఆర్జీసీ నష్టపోతుంది...
ఆంధ్ర రాష్ట్రానికి చెందిన బస్సు డ్రైవర్లు హైదరాబాద్ కు వస్తే, వారు సేదదీరేందుకు ఎంజీబీఎస్ లో ఏసీ రూముల సౌకర్యాన్ని తాము దగ్గర చేశామని, తెలంగాణ బస్సులు విజయవాడకు వెళితే, డ్రైవర్లకు కనీసం మంచి నీరు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని టీఆర్ఎస్ నేత శ్రీనివాసగౌడ్ ఆరోపించారు. ఎన్నో ఏళ్లు కొట్లాడి, ఎందరో ప్రాణాలు కోల్పోయిన తరువాత తాము తెలంగాణను సాధించుకున్నామని, ఇప్పటికీ ఆంధ్రావారి ఆగడాలతో ఇబ్బందులు పడుతున్నామని ఆయన ఆరోపించారు. ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ ఉన్నప్పటికీ, ఏపీ దాన్ని పాటించడం లేదని ఆరోపించారు. సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేయడం లేదని అన్నారు. మీడియా మాధ్యమంగా తాను, ప్రభాకర్ రెడ్డిని కూర్చోబెడితే, మొత్తం అన్ని వివరాలనూ చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభాకర్ రెడ్డిని తీసుకువెళ్లిన పోలీస్ స్టేషన్ కు తాను వెళితే, దాడి చేసేందుకు వచ్చారని కొత్త ఆరోపణలు చేస్తున్నారని శ్రీనివాసగౌడ్ అన్నారు.

పాలెం వద్ద యాక్సిడెంట్ అయిన బస్సుకు సంబంధించి ఇంతవరకూ పరిహారం చెల్లించలేదని విమర్శించారు. ఆయన బస్సుల్లో తల నీలాలు వంటి గూడ్స్ సరఫరా సాగుతోందని, వివిధ వస్తు రవాణాకు బస్సులను వినియోగిస్తూ దివాకర్ బస్సులు పట్టుబడ్డాయని కాగితాలు చూపించారు. యాక్సిడెంట్ బస్సులను అంతకుముందే అమ్మేసినట్టు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించారని ఆరోపించారు. 10-10-2010న బస్సును అమ్మేశానని చెబుతూ, 8-12-2010 తేదీ వున్న స్టాంపు పేపర్లపై రాసుకున్నారని ఆ దస్త్రాలు చూపారు. ప్రైవేటు ట్రావెల్స్ మూలంగానే తెలంగాణ ఆర్టీసీకి రోజుకు కోటి రూపాయల నష్టం వస్తోందని, వీటి ఆగడాలను అడ్డుకునే తీరుతామని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : JC Prabhakar reddy  TRS MLA Srinivasgoud  Private Travels Issue  

Other Articles