శశిథరూర్ ఇంట్లో దొంగలు.. దోచుకెళ్లింది అపరూపమైన సంపద.. Shashi Tharoor's Delhi home robbed, FIR lodged

Shashi tharoor s delhi home burgled copper gandhi glasses gifted by pm modi stolen

shashi tharoor, shashi tharoor house burgled, shashi tharoor robbed, shashi tharoor house, lok sabha mp, latest news, latest india news, latest delhi news, crime news

Several valuable items, including idols and “copper Gandhi glasses” gifted to him by the Prime Minister, were stolen from Congress leader and Lok Sabha MP Shashi Tharoor’s home

ప్రధాని మోడీ ఇచ్చిన గిఫ్టను చేజార్చుకున్న కాంగ్రెస్ ఎంపీ

Posted: 12/07/2016 11:40 AM IST
Shashi tharoor s delhi home burgled copper gandhi glasses gifted by pm modi stolen

ఆయన కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు. పెద్ద పారిశ్రామిక వేత్త కూడా. ముగ్గురు భార్యలను పెళ్లిళ్లు చేసుకుని తన మూడో భార్య మరణంతో వివాదాలను ఎదుర్కోంటూ, ఇంకా కోర్టు కేసులకు కూడా హజరవుతున్న వ్యక్తి ఆయన. ఎవరో అర్థమైందా..? కేంద్ర మాజీ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించిన ఆయన ఇంట్లో అప్పుడున్న భద్రత ఇప్పుడు కరువైంది. ఆయన మరెవరో కాదు శశిథరూర్. తన నివాసంలో వున్న తన ప్రత్యేక కార్యలయ గది తాళాలను పగులగోట్టిన దొంగలు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు.

ఈ విలువైన వస్తువుల జాబితాలో అరు విగ్రహాలతో పాటు దేశ ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు బహుకరించిన గాంధీ రాగి కళ్లజోళ్లు కూడా వున్నాయి. యాంటిక్ పీస్‌తోగా పరిగణించే ఈ అత్యంత విలువైన రాగి కళ్లజోడును కూడా దొంగలు ఆయన ఇంటి నుంచి ఎత్తుకెళ్లారు. థరూర్ కార్యాలయం తాళాలు పగిలి ఉండటాన్ని ఆయన ఇంట్లో పనిచేసేవారిలో ఒకరు గుర్తించి ఆయనకు విషయాన్ని తెలిపారు. దీంతో తన కార్యాలయాన్ని పరిశీలించిన ఆయన చోరీకి గురైన వస్తువులను గుర్తించారు.

తన కార్యాలయంలో దొంగలు పడ్డారని, అత్యంత విలువైన వస్తువులను చోరీ చేశారని ఆయన తుగ్లక్ రోడ్డు పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. లోధీ ఎస్టేట్ లోని అత్యంత భద్రత వున్న కాలనీలోని తన నివాసంలో ఈ చోరీ జరిగిందని ఆయన పోలీసులకు తెలిపారు. ఈ కాలనీలో తనతో పాటు అనేక మంది ఎంపీలు, వీఐపీలు కూడా నివాసమున్నారని ఇలాంటి ప్రాంతంలో దొంగలు ప్రవేశించి దొంగతనాలకు పాల్పడటంపై పలు విమర్శలు కూడా వినబడుతున్నాయి. థరూర్ పిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఐపీసీ 380/457 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నవంబర్ 29వ తేదీ రాత్రి ఈ దొంగతనం జరిగిందని థరూర్ పోలీసులకు తెలిపారు.  

కాగా థరూర్ నివసించే ఈ భవనం మెయిన్‌రోడ్డులోనే ఉండటంతో, ప్రహరీగోడను దూకిన దొంగలు లోనికి ప్రవేశించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంతకుముందు కూడా విగ్రహాలు చోరీచేసిన ఒక గ్యాంగు ఈ దోంగతనానికి పాల్పడినట్లు తాము అనుమానిస్తున్నట్లు న్యూఢిల్లీ డీసీపీ జతిన్ నర్వాల్ చెప్పారు. మెయిన్‌గేటు తాళాలు వేసినవి వేసినట్లే ఉన్నాయని థరూర్ కార్యాలయా సిబ్బంది తెలిపారు. రోడ్డుమీద ఉన్న ఫుట్‌పాత్ నుంచి ప్రహరీ ఎక్కడం చాలా సులభమని కూడా అన్నారు. థరూర్ ఇంటి సమీపం నుంచి ఒక ప్రకటన బోర్డును కూడా కొన్నివారాల క్రితం ఎవరో చోరీ చేశారని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shashi tharoor  valuable idols  copper Gandhi glasses  Congress  lok sabha mp  crime news  

Other Articles