కొత్త నోట్లు ఏపీకేనా? తెలంగాణకు లేవా? | Central partiality on New Notes dispatch between Telugu states.

Rbi dispatching new notes to telugu states

Telugu States, New Currency Notes, Demonetization, Central Partiality in Notes Distribution, New Notes to Andhra Pradesh, New Currency notes to AP, Chandra babu Naidu and KCR New Notes, New Currency for Telangana, New Notes to telugu states, RBI Telugu States

Central dispatching new currency notes to AP, says delay for Telanagana.

ఏపీ సంగతి ఓకే.. మరి తెలంగాణ పరిస్థితి?

Posted: 12/07/2016 12:55 PM IST
Rbi dispatching new notes to telugu states

నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న తెలుగు ప్రజలకు కేంద్రం కనికరం మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. రెండు వేల నోట్ల రిలీజ్ తర్వాత 500 రూపాయల నోట్లను ఆలస్యంగా దక్షిణాది రాష్ట్రాలకు విడుదల చేసిన ప్రభుత్వం అందులోనూ అచ్చు తప్పులే చేసింది. దీంతో మొత్తం నోట్లను ఎలా పంపించిందో అలాగే వెనక్కి రప్పించేసుకుని సమస్యను మరింత జఠిలం చేసేసింది. ఇక ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తూ త్వరగా సరిపడా నోట్లు పంపాలని కేంద్రానికి ఆర్జి పెట్టుకున్నారు. అయితే ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నా, నవ్యాంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు ఓ అడుగు ముందంజలోనే ఉన్నారు.

దీంతో బుధవారం ఏపీకి రూ.1100 కోట్ల నగదు పంపిణీ చేస్తామని ఆర్థిక శాఖ తెలిపింది. కాగా, మంగళవారం బ్యాంకర్లు, అధికారులతో జరిపిన టెలి సమావేశంలో కూడా కొత్తనోట్లు రాబోతున్నాయంటూ సూచనలు ఇచ్చేయటం తెలిసిందే. మొదటి నుంచి బాబు కరెన్సీ నోట్ల నిర్ణయానికి మద్ధతు ఇవ్వటంతోపాటు, ప్యానెల్ కి నేతృత్వం వహించటం, పైగా మోదీ ఇచ్చిన క్యాష్ లెస్ పిలుపును త్వరగా అందుకుని ఆ ప్రయత్నాలు కొనసాగించటంతో సాయం విషయంలో కేంద్ర కూడా సానుకూలంగానే ఉంది.

ఇక రైతులు తమకు కావాల్సిన ఎరువులు, పురుగు మందులను ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేయాలని సీఎం సూచించారు. రేషన్ సరుకులను రాష్ట్రవ్యాప్తంగా అరువుపై 66 శాతం దాకా పంపిణీ చేసినట్టు తెలిపారు. సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు నగదు రహిత లావాదేవీలకు క్లాసులు చెప్పించి జనాల్లో అవగాహన కల్పించే కార్యక్రమాల రూపకల్పనకు విద్యాధికారులు సిద్ధమైపోతున్నారు.

మరోవైపు తెలంగాణ విషయానికొస్తే... ఇప్పటికే టాక్స్ రూపంలో బోలెడంత నష్టం చూసిన సర్కార్, కొత్త నోట్ల జారీ కోసం ఇంకొంత కాలం ఎదురు చూడక తప్పదనే సంకేతాలను తొలుత అందించింది. ఇప్పటికే 1800 కోట్ల విలువైన నోట్లను అందించిన ఆర్బీఐ మరింత కరెన్సీకి వేచి చూడాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే రైతులు, రేషన్ సరుకులు తదితర అంశాల్లో కేంద్రానికి కాస్త గట్టిగానే విన్నవించుకోవటంతో వీలైనంత తొందరలోనే తెలంగాణకు నోట్లు చేరనున్నాయంట. మరోవైపు కొత్త వెయ్యి, రూ.100, రూ.50, రూ.20 నోట్లు కూడా రానున్నాయని, ఇవి కూడా చేరుకుంటే ఇబ్బందులు చాలావరకు తగ్గుతాయని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telanagana  Andhra Pradesh  New Currency Notes  

Other Articles