అరోగ్య అందోళనకు చెక్ పెడుతున్న చేతి గడియారాలు wrist watches that gives health updates

Wrist watches that gives health updates

Wrist Watches, Health details, Kronovo Watch, Clayton Christensen, Fitbit, fitness trackers, pebble, smartwatches, The Innovator's Dilemma, wearables

Smartwatch sales are plummeting, and fitness seems to be the only profitable area remaining in the wearables sector

అరోగ్య అందోళనకు చెక్ పెడుతున్న చేతి గడియారాలు

Posted: 12/04/2016 09:31 AM IST
Wrist watches that gives health updates

హృద్రోగులు గుండె దడగా వున్నా.. కొంత నాడి ఎక్కువ వేగంగా కొట్టుకున్నా అందోళనకు గురవుతుంటారు. వెనువెంటనే డయాగ్నస్టిక్స్ సెంటర్ కు వెళ్లి చేతి చమురు వదిలించుకుంటారు. అయితే ఇక అలాంటి అందోళన అవసరం లేదు. టెక్నాలజీని అందిపుచ్చుకుని చేతి గడియారంలోనే మీ అరోగ్య వివరాలు మొత్తం మీ చేతుల్లో ఉంచుతుంది. ఎప్పటికప్పుడు మీ అరోగ్యంపై మిమల్ని అలర్గ్ చేస్తుంది. మీరు చేస్తున్న శారీరక శ్రమను కూడా లెక్కబెడుతుంది.

స్మార్ట్‌ఫోన్ల స్థాయిలో ఏర్పాటు చేసిన 1.2 గిగాహెర్‌ట్జ్ డ్యూయల్ కోర్ మైక్రోప్రాసెసర్.. ఒక జీబీ ర్యామ్, నాలుగు జీబీల మెమరీలతో ఈ వాచీ ఎన్ని పనులు చేయగలదో చూడండి. అడుగున ఉండే చిన్నసైజు ఎలక్టోడ్ర్‌లతో ఇది మీ గుండె పనితీరును సూచించే ఈకేజీ గ్రాఫ్‌ను చూపుతుంది. మీ ఆరోగ్య పరిస్థితికి తగ్గట్టుగా ఎలాంటి వ్యాయామాలు చేయాలో సూచిస్తుంది. నడిచే అడుగులు లెక్కపెడుతుంది.. సుఖ నిద్రపైనా ఒక కన్నేసి ఉంచుతుంది. ఉచ్ఛ్వాస, నిశ్వాసాల తీరుతోపాటు మీ గుండెచప్పుళ్లల్లో వచ్చే తేడాలనూ పసిగట్టి హెచ్చరిస్తుంది.

ఈ పనులన్నీ చేసేందుకు అవసరమైన గైరోస్కోపు, యాక్సెలోమీటర్, ఇతర సెన్సర్లు దీంట్లో ఉన్నాయి. ఆండ్రారుుడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు రెండింటితోనూ పనిచేసే క్రోనోవో వాచీ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతానికి దీన్ని వాణిజ్య స్థాయిలో తయారు చేసేందుకు నిధులు సమీకరిస్తున్నారు. దాదాపు రూ.14 వేలు ఖరీదు చేయగల ఈ హైటెక్ వాచీ టైమ్‌ను ఎటూ చూపిస్తుంది. సంగీతమూ వినిపిస్తుందండోయ్!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles