ప్రధాని నిర్ణయంపై జేఎన్ యూ అర్థిక వేత్తల పెదవి విరుపు JNU economic professors quetions demonetisation decision

Jnu economic professors quetions demonetisation decision

Delhi University, Jawaharlal Nedhru University, demonetisation, economic professors, Economy, black money, PM Modi, Arun Jaitley, Indian GDP, Himanshu

Delhi Jawaharlal Nedhru University economic professors quetions demonetisation decision and asks about black money detials

ప్రధాని నిర్ణయంపై జేఎన్ యూ అర్థిక వేత్తల పెదవి విరుపు

Posted: 12/04/2016 10:06 AM IST
Jnu economic professors quetions demonetisation decision

నల్లధనంపై యుద్ధం పేరుతో కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో ఆశించిన స్థాయిలో నల్లధనం బయటపడే అవకాశం కనిపించడం లేదని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆర్థిక శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ హిమాంశు స్పష్టం చేశారు. రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్ల విలువ మొత్తంగా సుమారు రూ.14.18 లక్షల కోట్లుకాగా... బ్యాంకుల్లో ఇప్పటికే 11 లక్షల కోట్ల కు పైగా డిపాజిట్ అయ్యాయని పేర్కొన్నారు. ఇంకా నెల రోజులు గడువున్నందున.. మరో రెండున్నర, మూడు లక్షల కోట్లు బ్యాంకులకు చేరే అవకాశముందని చెప్పారు.

అంటే బ్యాంకులకు చేరకుండా మిగిలే సొమ్ము రూ.50 వేల కోట్లలోపే ఉండవచ్చని అభిప్రాయ పడ్డారు. ప్రభుత్వం ఊహించినట్లు మూడు, 4 లక్షల కోట్లు నల్లధనం తేలే అవకాశం లేదని దీనిద్వారా స్పష్టమవుతోందని వివరించారు. శనివారం మంథన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలో ‘నోట్ల రద్దు’ అంశంపై జరిగిన చర్చాగోష్టిలో హిమాంశు మాట్లాడారు. నోట్ల రద్దు కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందన్న విషయంలో వామపక్షవాదులు, మితవాదులు సహా ఆర్థిక వేత్తలంతా ఏకాభి ప్రాయం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

వ్యవసాయ రంగం వరుసగా రెండు కరువులు చూస్తున్న తరుణంలో ఆర్థిక వ్యవస్థకు దెబ్బతగిలితే.. దాని ప్రభావం అన్ని రంగాలపైనా ప్రతికూలంగా ఉంటుందని పేర్కొన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తి తగ్గిపోతుందని.. ఉపాధి, ఉద్యోగావకాశాలు తగ్గిపోతాయని చెప్పా రు. వేతనాలు పడిపోరుు ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుందని, దానివల్ల మార్కెట్లో డిమాండ్ పడిపోతుందని వివరించారు. ఇదే జరిగితే 2010 తర్వాత 8 శాతం వృద్ధి రేటును చూడని తొలి ప్రధాని మోదీయే అవుతారని వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles