అన్నగారి దారిలో అమెరికా అధ్యక్షుడు.. Donald Trump says will take $1 as salary with no vacations

Donald trump says will take 1 as salary with no vacations

US presidential elect, donald trump, US President salary, Trump salary, USD 1 hillary clinton, FBI, FBI director James Comey, e-mail probe, donald trump, deemocratic party, republican party, hillaru clinton emails probe, hillary confident

US President-elect Donald Trump has said he would take $1 as his salary a year and not the $400,000 that comes with the US president's job and will refrain from going on any vacation.

అన్నగారి దారిలో అమెరికా అధ్యక్షుడు..

Posted: 11/14/2016 01:32 PM IST
Donald trump says will take 1 as salary with no vacations

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలో నిలిచి యావత్ ప్రపంచం విస్మయంలో ముంచి గెలుపోందిన డోనాల్డ్ ట్రంప్.. అధ్యక్ష పగ్గాలు చేపట్టకుండానే తన ముద్రను ప్రజలపై స్థిరంగా వేసేందుకు సన్నధం అవుతున్నారు. ఆంధ్రుల ఆరాధ్యుడు స్వర్గీయ ఎన్టీ రామారావును అధర్శంగా తసీుకున్నారో లేక.. మరే పరిస్థితులు అయనను ఇలాంటి నిర్ణయాన్ని తీసుకునేందుకు ప్రేరేపించాయో తెలియదు కానీ.. ఏకంగా అశ్చర్యకర ప్రకటన చేసి అమెరికావాసులను మరోమారు విస్మయానికి గురిచేశారు.

అన్నగారు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తరువాత నెలకు రూపాయి వేతనం తీసుకోగా, ఇప్పుడ ట్రంప్ కూడా అలాంటి నిర్ణయం తీసుకుంటామన్నారు. తాను అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి.. శ్వేత సౌధ్యంలోకి అడుగిడిన తర్వాత ఏడాదికి ఒక్క డాలర్ మాత్రమే జీతంగా తీసుకుంటానని, తనకు నాలుగు లక్షల డాలర్లు వద్దని చెప్పారు. అంతేకాదు, పర్యటనల పేరిట వృధా ఖర్చు చేయకుండా వాటిని నిలువరిస్తానని తెలిపారు. తాను జీతం తీసుకోవాలనుకోవడం లేదని స్పష్టం చేశారు.

ఈ ఏడాది సెప్టెంబర్ లో జరిగిన ఎన్నికల ప్రచార సమయంలో తాను సాలరీ తీసుకోనంటూ ఓ వీడియో ద్వారా చెప్పగా.. తాజాగా మళ్లీ అదే విషయాన్ని మీడియా ముఖంగా కూడా స్పష్టం చేశారు దేశంలో చాలా పనిచేయాల్సి ఉందని, ప్రజల కోసం తాను అదంతా చేస్తానని ట్రంప్ చెప్పారు. ప్రజల ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని, పన్నుల అంశాన్ని పరిశీలించాల్సి ఉందని, ఇలా ఎన్నో పెద్ద పెద్ద పనులు ఉన్నందున తాను వెకేషన్స్ లాంటివి పెద్దగా పెట్టుకోవాలనుకోవడం లేదని ట్రంప్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : US presidential elect  donald trump  US President salary  Trump salary  USD 1  

Other Articles